ఇండియా మార్కెట్ లో నకిలీ మందు: WHO

భారతదేశంలో నకిలీ మందులు వినియోగం మరొకసారి వెలుగులోకి వచ్చింది. డిఫిటెలియో (DEFITELIO) అనే మందు వాడకం చాలా ప్రమాదకరమని, ఇది నిజానికి నకిలీ మందని, ఈ మందు వాడితే కచ్చితంగా అనారోగ్య పాలవడం ఖాయం అని WHO హెచ్చరించింది.  వెలుగులోకి నకిలీ మందు:  యుఎన్, హెల్త్ విభాగం అందించిన సమాచారం ప్రకారం, డిఫిటెలియో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో, ఆ సంస్థ ఈ మందు గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మందు నకిలీ మందుని ఒప్పుకుంది. […]

Share:

భారతదేశంలో నకిలీ మందులు వినియోగం మరొకసారి వెలుగులోకి వచ్చింది. డిఫిటెలియో (DEFITELIO) అనే మందు వాడకం చాలా ప్రమాదకరమని, ఇది నిజానికి నకిలీ మందని, ఈ మందు వాడితే కచ్చితంగా అనారోగ్య పాలవడం ఖాయం అని WHO హెచ్చరించింది. 

వెలుగులోకి నకిలీ మందు: 

యుఎన్, హెల్త్ విభాగం అందించిన సమాచారం ప్రకారం, డిఫిటెలియో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో, ఆ సంస్థ ఈ మందు గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మందు నకిలీ మందుని ఒప్పుకుంది. నకిలీ కాలేయ drug- డిఫిటెలియో (డీఫిబ్రోటైడ్), భారతదేశం మరియు టర్కీలలో విక్రయించబడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సోమవారం ప్రకటించింది.

డిఫిటెలియో (డీఫిబ్రోటైడ్ సోడియం) ఒక నకలి డ్రగ్ అని బయట పెట్టింది డబ్ల్యూహెచ్ఓ. అయితే దీని వినియోగం భారతదేశంలో (ఏప్రిల్ 2023) మరియు టార్కియే (జూలై 2023) లలో థర్డ్ పార్టీ ఛానల్ ద్వారా విస్తృతంగా సరఫరా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దీని వాడకం అతి ప్రమాదమని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌ఓ. 

ఈ డ్రగ్ కు సంబంధించి వ్యతిరేకంగా డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. మే 7, 2020 న, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, లాట్వియా, మలేషియా మరియు సౌదీ అరేబియా వంటి దేశాలలో నకిలీ drug వాడకంలో ఉన్నట్లు గుర్తించారు.

ఈ మందు ఎవరికి సిఫారసు చేస్తారు:

హేమాటోపోయిటిక్ స్టెమ్-సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (హెచ్‌ఎస్‌సిటి) చికిత్సలో, సినూసోయిడల్ అబ్స్ట్రక్టివ్ సిండ్రోమ్ (సోస్) అని కూడా పిలువబడే తీవ్రమైన హెపాటిక్ వెనో-ఆక్లూసివ్ డిసీజ్ (VOD) చికిత్స కోసం ఈ డిఫిటెలియో drug వాడుతూ ఉంటారు. అయితే ఈ డ్రగ్ ముఖ్యంగా, ఒక సంవత్సరం పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వాడుతున్నట్లు తెలుస్తోంది. VOD అనారోగ్య పాలైన వాళ్ళలో ముఖ్యంగా, లివర్ లో ఉండే, వైన్స్ బ్లాక్ అయిపోవడం కారణంగా లివర్ పని చేయడం మానేస్తుంది. 

ఈ మందు వాడితే ఏం జరుగుతుంది?: 

ఈ మందు వాడకం నిజానికి ట్రీట్మెంట్ లో పనికిరాదు. ఇంకా చెప్పాలంటే ఈ మందు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని ఇంట్రావీనస్ అడ్మినిస్ట్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య నష్టాలను కలిగిస్తుంది. అంతేకాకుండా కొన్ని పరిస్థితులలో ప్రాణాంతకమని హెచ్చరిక తెలిపింది. ప్రెస్ సమయం వరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా HT ప్రశ్నలకు స్పందించలేదు, అయినప్పటికీ, ప్రభుత్వంలో ఉన్న ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులు ఈ విషయం దర్యాప్తు చేయబడుతోందని చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ మందు వాడకం అనేది నిషేధించాలని ఇప్పటికే డాక్టర్లకు సూచించినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి గుర్తు చేశారు. 

మీరు, లేదా మీకు తెలిసిన ఎవరైనా, తెలియకుండా ఇటువంటి డ్రగ్ ఉపయోగించినట్లయితే లేదా ఉపయోగించిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లాంటి దుష్ప్రభావాన్ని ఎదుర్కొన్నట్లయితే, ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుండి తక్షణ వైద్య సలహా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. హెల్త్‌కేర్ నిపుణులు నేషనల్ రెగ్యులేటరీ అథారిటీస్/నేషనల్ ఫార్మాకోవిజిలెన్స్ సెంటర్ కు సంఘటనలు గురించి తెలియజేయాల్సి ఉంటుంది. 

అన్ని మందులు మరియు ఇతర వైద్య ఉత్పత్తులను లైసెన్స్ పొందిన సప్లయర్స్ ద్వారా కొనుగోలు చేయాలి, అయితే ఈ ఉత్పత్తుల తయారీ లేదా సరఫరా గురించి ప్రజలకు ఏదైనా సమాచారం తెలిసినట్లయితే తప్పకుండా, rapyalert@who.int.lso ని సంప్రదించాలి.