ఢిల్లీలో పొగాకు ఉత్పత్తుల తయారీ నిషేధం 

ఢిల్లీలో పొగాకు సంబంధించిన కొన్ని ఉత్పత్తుల తయారీ నిషేధించడం జరిగింది. అయితే పొగాకు ఉత్పత్తుల తయారీకి సంబంధించిన నిషేధం సుమారు మరొక సంవత్సరం పాటు కొనసాగుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వల్ల యువత చిన్న పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఇటువంటి నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు లెఫ్ట్నెంట్ గవర్నర్ చెప్పడం జరిగింది.  మరో సంవత్సరం పాటు బ్యాన్:  ప్రస్తుతం అమల్లో ఉన్న బ్యాన్ లో భాగంగా పొగాకు సంబంధిత ఉత్పత్తుల తయారీ, […]

Share:

ఢిల్లీలో పొగాకు సంబంధించిన కొన్ని ఉత్పత్తుల తయారీ నిషేధించడం జరిగింది. అయితే పొగాకు ఉత్పత్తుల తయారీకి సంబంధించిన నిషేధం సుమారు మరొక సంవత్సరం పాటు కొనసాగుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వల్ల యువత చిన్న పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఇటువంటి నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు లెఫ్ట్నెంట్ గవర్నర్ చెప్పడం జరిగింది. 

మరో సంవత్సరం పాటు బ్యాన్: 

ప్రస్తుతం అమల్లో ఉన్న బ్యాన్ లో భాగంగా పొగాకు సంబంధిత ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ మరియు విక్రయాలను నిషేధిస్తుంది. గుట్కా, పాన్ మసాలా, ఖర్రా, మరిన్ని పొగకు సంబంధించిన ఉత్పత్తుల తయారీ ఢిల్లీలో పూర్తిగా నిషేధించబడింది. రాజధానిలో గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మరో ఏడాది పాటు పొడిగించారు.

రాజధానిలో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు వాటి వినియోగాన్ని గమనించడంతోపాటు “ప్రజారోగ్య సమస్యకు అత్యంత ప్రాముఖ్యత”కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 AA (4) కింద అధికారాలను అమలు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు మరియు యువకులకు సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ మీద కూడా నిషేధం అమల్లో ఉంది. 

L-G హౌస్ అధికారులు నిషేధిత ఉత్పత్తులలో ప్యాక్ చేయబడినవి అంతేకాకుండా ప్యాక్ చేయని వాటిల్లో పొగాకు ఉత్పత్తులు ఉన్నాయని మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం మరో సంవత్సరం పాటు అమలులో ఉంటుందని చెప్పారు.

ఉల్లంఘిస్తే చట్టపరమైన శిక్షలు: 

నగరం ఆహార భద్రతా విభాగం నుండి నోటిఫికేషన్‌ జారీ చేయడం ద్వారా , సక్సేనా దీనిని “కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది” మరియు నగరంలో దాని అమలు పట్ల ” నిషేధాన్ని ఉల్లంఘించే ఎటువంటి వైఖరిని” సహించబోమని చెప్పారు.

నియంత్రణ 2.3.4 ప్రకారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆహార భద్రత మరియు ప్రమాణాల, అమ్మకాలపై నిషేధం మరియు పరిమితులు, నిబంధనలు, 2011, పొగాకు మరియు నికోటిన్ కలిగిన ఉత్పత్తులను ఏదైనా ఆహార ఉత్పత్తులలో పదార్థాలుగా ఉపయోగించడాన్ని నిషేధించడం జరిగింది.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, ఢిల్లీలో గుట్కా, పాన్ మసాలా, ఫ్లేవర్డ్ పొగాకు మరియు ఇలాంటి ఉత్పత్తుల తయారీ, నిల్వ మరియు అమ్మకాలపై ఆహార భద్రత కమిషనర్ విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు కూడా ధృవీకరించింది. నిషేధాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి సెప్టెంబరు 2022 నిర్ణయాన్ని కూడా కోర్టు పక్కన పెట్టింది. దానిపై కేంద్రం మరియు ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను స్వీకరించినట్లు తెలుస్తోంది. గతంలో 2015 నుండి 2021 వరకు జారీ చేసిన నిషేధ నోటిఫికేషన్‌లకు వ్యతిరేకంగా పొగాకు వ్యాపారంలో సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టివేసింది. 

అయితే ప్రస్తుతం యువత ఇటువంటి హానికరమైన మత్తు పదార్థాలకు బానిస అవుతున్నట్లు, ముఖ్యంగా ఢిల్లీ వంటి రాజధానిలో నోటి క్యాన్సర్ల కేసులు అధికం అవ్వడం వల్ల ఉత్పత్తుల తయారీ విషయంలో నిషేధాన్ని ఒక సంవత్సరం పొడిగించినట్లు స్పష్టం చేశారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. అంతేకాకుండా, నిషేదానికి విరుద్ధంగా ఎటువంటి వైఖరిలను సహించబోమని స్పష్టం చేశారు.