ఇంగ్లీష్ మీడియం కోర్సైనా.. పరీక్షలు తెలుగులో రాసే అవకాశం కల్పించాలి

విద్యార్థులు తమ తమ మాతృ భాషలో పరీక్షలు రాసేందుకు వీలు కల్పంచాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీశ్ కుమార్ అన్ని వర్సిటీలకు లేఖ రాశారు. వారు చదువుతున్న కోర్సును ఆగ్లం మీడియంలో చదువుతున్నా.. పరీక్షలను తమ తమ మాతృ భాషలో రాసే అవకాశం కల్పించాలని తెలిపారు. స్థానిక భాష లేదా మాతృ భాషలో పాఠ్య పుస్తకాల విద్యాబోధనలో మాతృ భాషకు ప్రాధాన్యత మొదలైన అంశాల్లో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని జగదీశ్ కుమార్ […]

Share:

విద్యార్థులు తమ తమ మాతృ భాషలో పరీక్షలు రాసేందుకు వీలు కల్పంచాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీశ్ కుమార్ అన్ని వర్సిటీలకు లేఖ రాశారు. వారు చదువుతున్న కోర్సును ఆగ్లం మీడియంలో చదువుతున్నా.. పరీక్షలను తమ తమ మాతృ భాషలో రాసే అవకాశం కల్పించాలని తెలిపారు. స్థానిక భాష లేదా మాతృ భాషలో పాఠ్య పుస్తకాల విద్యాబోధనలో మాతృ భాషకు ప్రాధాన్యత మొదలైన అంశాల్లో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని జగదీశ్ కుమార్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా స్థానిక భాషలలో అన్ని డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించడానికి యూజీసీ ప్రయత్నం చేస్తుందని జగదీశ్ కుమార్ తెలిపారు. ఇతర భాషల్లోని ఒరిజినల్ పాఠ్య పుస్తకాలను విద్యార్థుల మాతృ భాషలోకి అనువదించడాన్ని ప్రోత్సహించాలన్నారు. భారత్ లోని స్థానిక భాషల్లోకి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను మార్చి, ప్రచురించడాన్ని ప్రోత్సహించే దిశగా అంతర్జాతీయ పబ్లిషర్లతో జగదీశ్ కుమార్ ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇదిలా ఉండగా.. ఇంగ్లీష్ మీడియంలోని కోర్సులకు కూడా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సూచనపై రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నిర్ణయం విద్యార్ధుల భవిష్యత్తుకు ఏవిధంగా ఉపయోగపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఈ ప్రతిపాదనను కోరుకునే వారు ఎవరూ ఉండరని ఆర్ లింబాద్రి అన్నారు. చైర్మన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE). ప్రాంతీయ లేదా స్థానిక భాషలను నేర్చుకోవడానికి తాము వ్యతిరేకం కాదని, ప్రపంచీకరణ జరుగుతున్న ఈ ప్రపంచంలో ఇది సరైనది కాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్, ఇంజనీరింగ్ మరియు లా వంటి కోర్సులు ఉర్దూ మాధ్యమంలో బోధించబడేవి. ఇప్పుడు ఇంగ్లీషు మీడియం వైపు వెళ్లాం. ప్రాంతీయ భాషకు తిరిగి వెళ్లడం లేదా విద్యార్థులను వారి స్థానిక భాషలో పరీక్షలు రాయడానికి అనుమతించడం వల్ల భాషా అవరోధం కారణంగా వారు చాలా అవకాశాలను కోల్పోతారని వారు వివరించారు.

ఈ నిర్ణయం వలన విద్యార్థులకు మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని లింబాద్రి అన్నారు. రాష్ట్రాలు, ఇతర వాటాదారులను సంప్రదించకుండా యూజీసీ ఇలాంటి సూచన ఎలా చేస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ డీ రవీందర్‌ ప్రశ్నించారు. అదేవిధంగా వారు ఉద్యోగాలు పొందడంలో సమస్యలను ఎదుర్కొంటారని ఆయన తెలిపారు. ఇది మూల్యాంకన ప్రక్రియను కూడా క్లిష్టతరం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల విద్యార్థులు తమ భాషలో పరీక్షలు రాస్తే, విశ్వవిద్యాలయాలు సమాధాన పత్రాలను ఎలా మూల్యాంకనం చేస్తాయని ఆయన ప్రశ్నించారు. ప్రతిపాదన కేవలం సూచన కాబట్టి, దానిని విస్మరించవచ్చని లింబాద్రి అన్నారు. 

కానీ అది తప్పనిసరి కానందున ఈ అంశంపై చర్చ అవసరమని జోడించారు. అయితే, ఈ సూచనకు కొంత మద్దతు లభించింది. “ఎవరైనా తెలంగాణలో మాత్రమే పని చేయాలనుకుంటే, వాళ్ళు తెలుగులో పరీక్షలు రాస్తే తప్పు లేదు. ఇది విద్యార్థులకు అందుబాటులో ఉన్నంత వరకు, దాన్ని తప్పనిసరి చేయనంత వరకు ఎటువంటి హానీ లేదు”అని హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) వైస్-ఛాన్సలర్ ఇ.సురేష్ అన్నారు. అభ్యర్థికి మంచి సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నా కూడా భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకుని కష్టాలు పడవలసి వస్తుందని, రాష్ట్రం వెలుపల అవకాశాల కోసం వెతుక్కోవలసి వస్తుందని అన్నారు.