TCS Bomb Threat: టీసీఎస్‌‌ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్..

చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు

Courtesy: Twitter

Share:

TCS Bomb Threat: దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(Tata Consultancy Services) కార్యాలయంలో బాంబు బెదిరింపులు(Bomb threats) కలకలం రేపాయి. ఇది ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. పోలీసులు సహా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad) వచ్చి సోదాలు చేశాయి. తీరా చూస్తే బాంబు ఆనవాళ్లేం కనిపించలేదు. అసలు ఏమైందంటే? 

ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో(TCS ) బాంబు బెదిరింపులు(Bomb threats) కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీకి ఫేక్ బాంబ్ బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు 1500 మంది వరకు ఉద్యోగులు ఆఫీస్ నుంచి బయటికి పరుగులు తీశారు.  ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరిగింది. ఈసారి మాత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది బెంగళూరు(Bangalore) టీసీఎస్(TCS) కార్యాలయానికి.

కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయానికి(Tata Consultancy Services) గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు(Bomb threats) ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ ఆఫీస్ కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం అందుతుంది. నిన్న (మంగళవారం) బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఎంప్లాయిస్, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్ పై కోపంతోనే ఓ మాజీ ఉద్యోగి(Ex-employee) ఈ కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

టీసీఎస్ కంపెనీ(TCS Company) యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులు పనిలో ఉండగా ఆఫీస్ క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు(B-Block) బెదిరింపు కాల్(Bomb threats) రావడంతో వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి వేయడంతో పాటు పోలీసులు వెంటనే సమాచారం అందించారు.  బాంబు డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad) అక్కడికి చేరుకుంది.  పరప్పన అగ్రహార పోలీసులు(Agrahara Police) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్యాంపస్‌లో పేలుడు పదార్థాల కోసం గాలించారు. టీసీఎస్(TCS) ఆఫీసులోని B - బ్లాక్‌కు ఈ బాంబ్ థ్రెట్ కాల్(Bomb Threat Call) వచ్చినట్లు నిర్ధారించారు. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే భయంతో ఉద్యోగులు బయటకు వెళ్లారు. అయితే అక్కడ అనుమానాస్పదంగా ఏం కనిపించలేదు. ఇది బూటకపు బాంబు బెదిరింపుగా(Hoax Bomb Threat) తేల్చారు పోలీసులు. దీంతో ఉద్యోగులు, సంస్థ యాజమాన్యం అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పోలీసుల దర్యాప్తు తర్వాత.. ఈ కాల్ టీసీఎస్(TCS) మాజీ ఉద్యోగి నుంచి వచ్చినట్లు తెలిసింది. హుబ్లికి(Hubli) చెందిన ఒక మహిళా ఉద్యోగి.. కంపెనీపై కోపంతో ఈ పని చేసినట్లు చెప్పారు. టీసీఎస్ ఈమెను గతంలో తొలగించిందని ఆ కోపంతోనే ఇలా చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.

ఈ ఏడాది మేలో మాదాపూర్‌లో(Madhapur) ఉన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌కు బాంబు బెదిరింపు(Bomb threats)  కాల్‌ వచ్చింది. కంపెనీలో బాంబు పెట్టినట్లు ఎవరో బెదిరింపు కాల్‌ చేశారు. వెంటనే సమాచారాన్ని టీసీఎస్‌ యాజమాన్యం మాదాపూర్‌ పోలీసులకు చేరవేసింది.  అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌తో టీసీఎస్‌ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగిగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్ వచ్చిన వెంటనే టీసీఎస్‌లోని ఉద్యోగులను బయటకు పంపి తనిఖీలు(Inspections) చేపట్టారు. కానీ ఇది ఫేక్ కాల్ అని తెలుసుకున్న తరువాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటన తరువాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.

Tags :