సైంటిస్టుల శాలరీ గురించి ప్రస్తావించిన మాజీ ఇస్రో చీఫ్

మాజీ ఇస్రో చీఫ్ మాధవన్ నయర్, ఇటీవల విజయవంతంగా చంద్రుడు మీద అడుగు పెట్టిన చంద్రయాన్-3 మిషన్ యొక్క బడ్జెట్ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా భారతదేశ శాస్త్రవేత్తలు తక్కువ బడ్జెట్లో తయారు చేయగలిగే మిషన్స్ మీద దృష్టి సారిస్తారని, ముఖ్యంగా తక్కువ శాలరీలు వస్తున్నప్పటికీ, మన సైంటిస్టులు డబ్బు గురించి ఎప్పుడూ ఆశపడలేదు అంటూ, తమ పనితీరు మీద నమ్మకంతో ముందుకు సాగుతారాని, విజయాలు సాధిస్తారు అంటూ ప్రస్తావించారు మాజీ ఇస్రో చీఫ్ మాధవన్.  చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ […]

Share:

మాజీ ఇస్రో చీఫ్ మాధవన్ నయర్, ఇటీవల విజయవంతంగా చంద్రుడు మీద అడుగు పెట్టిన చంద్రయాన్-3 మిషన్ యొక్క బడ్జెట్ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా భారతదేశ శాస్త్రవేత్తలు తక్కువ బడ్జెట్లో తయారు చేయగలిగే మిషన్స్ మీద దృష్టి సారిస్తారని, ముఖ్యంగా తక్కువ శాలరీలు వస్తున్నప్పటికీ, మన సైంటిస్టులు డబ్బు గురించి ఎప్పుడూ ఆశపడలేదు అంటూ, తమ పనితీరు మీద నమ్మకంతో ముందుకు సాగుతారాని, విజయాలు సాధిస్తారు అంటూ ప్రస్తావించారు మాజీ ఇస్రో చీఫ్ మాధవన్. 

చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ లో బడ్జెట్ మిషన్: 

ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఇస్రో శాస్త్రవేత్తల చేత తయారు చేయబడిన చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ అంటూ ప్రస్తావించారు మాజీ ఇస్రో చీఫ్ మాధవన్. ఇంకా చెప్పాలంటే మునుపు తయారు చేసిన చంద్రయాన్-2 బడ్జెట్ విషయానికి వస్తే సుమారు 978 కోట్లు ఖర్చు అయిందని, మరి ఇక చంద్రయాన్-3 విషయానికి వస్తే కేవలం 620 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశం గర్వించదగ్గ మిషన్ తయారు చేశారు అంటూ భారతదేశ శాస్త్రవేత్తలను మెచ్చుకున్నారు మాజీ ఇస్రో చీఫ్. 

ఇంకా చెప్పాలంటే, మన దేశ శాస్త్రవేత్తలు ఎప్పుడూ కూడా తమ శాలరీలు గురించి ఆలోచించలేదు అని, తాము ఎప్పుడూ కూడా తమకి వచ్చిన దానితోనే సంతృప్తి చెందారని, వారి శాలరీలు గురించి ఎప్పుడూ ఆలోచించకుండా ఇస్రో గురించి పని చేయడం శాస్త్రవేత్తల గొప్పతనం అని ఆయన మరొకసారి గుర్తు చేశారు. భారతదేశంలో శాస్త్రవేత్తలకు వచ్చే శాలరీ ఇతర దేశాల శాస్త్రవేత్తల శాలరీతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా లో బడ్జెట్ మిషన్ తయారీలో తమ శాస్త్రవేత్తలు అన్ని దేశాల కన్నా ముందు ఉన్నారని ప్రస్తావించారు. ప్రపంచ దేశాల్లో ధనిక శాస్త్రవేత్త, ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ చంద్రయాన్-3 బడ్జెట్ విన్న తర్వాత షాక్ అయినట్లు, తాము తయారు చేసిన క్రిస్టోఫర్ నొలాన్ ఇంటర్ స్టెల్లర్ తయారీ విషయంలో సుమారు 13,000 కోట్లు ఖర్చయినట్లు తాను చేసిన పోస్టులో ఎలోన్ మస్క్ వెల్లడించాడు. 

చంద్రయాన్-3 విజయం: 

ఆగస్టు 23 సాయంత్రం 6 గంటలకు చంద్రుడు సౌత్ పోల్ పైన అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం భారతదేశం అంటూ, ఈ మిషన్ లో తమదైన కృషిని చూపించిన శాస్త్రవేత్తలకు అభినందనలు కూడా తెలిపారు. తమ దేశం ఎవరు సాధించలేని ఘనతను సాధించి చూపించారని, ఇలాంటి మరెన్నో ప్రయోగాలు భారతదేశ నుంచి జరుగుతాయని వెల్లడించారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు బ్రిక్స్ దేశాల నుంచి కూడా అభినందనలు అందుకున్నారు మోది. 

2008లో బ్రాండ్ యూనివర్సిటీ, 1960 సంవత్సరంలో చంద్రుడు మీద కలెక్ట్ చేసిన కొన్ని శాంపిల్స్ అనేవి పరీక్ష చేశారు. పరీక్ష చేసిన తర్వాత అందులో హైడ్రోజన్ నిలువలు ఉన్నట్లు తేలింది. అంటే కచ్చితంగా చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో నీటి వనరులు తప్పకుండా ఉంటాయని నిర్ధారించారు. అయితే అప్పటి నుంచి చంద్రుడు మీదకు ముఖ్యంగా దక్షిణ ధ్రువం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి ప్రపంచ దేశాలు. 

ముఖ్యంగా చంద్రుడు మీద నీటి వనరులు ఉన్నట్లయితే, ఆ వనరులను ఉపయోగించుకుని మరో గ్రహం గా పిలువబడుతున్న మార్స్ ప్రయాణం సులభతరం చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం పరిశోధకుల ముఖ్య ఆలోచన. చంద్రుడు సౌత్ పోల్ పైన మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన చంద్రయాన్ -3 విక్రం లాండర్, సౌత్ పోల్ కి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది.