మణిపూర్ హింసలో చైనా ప్రమేయం..?

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది […]

Share:

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం. అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది నాయకులు తాము ఈ పరిస్థితిని అదుపు చేయలేమని చెప్పి రాజీనామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్.

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసలో విదేశీ ఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవానే (రిటైర్డ్) అన్నారు, దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతంలోని వివిధ తిరుగుబాటు గ్రూపులకు చైనా చేస్తున్న సహాయాన్ని ధ్వజమెత్తారు. పొరుగు దేశంలో (మయన్మార్) మాత్రమే కాకుండా, సరిహద్దు రాష్ట్రం (మణిపూర్)లో కూడా అస్థిరత ఉంటే, అది మన మొత్తం జాతీయ భద్రతకు బంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది అని ఆయన అన్నారు. అంతర్గత భద్రత మనకు చాలా ముఖ్యం అని జనరల్ నరవానే అన్నారు. 

చైనా ప్రమేయం ఉందా?: 

శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితిపై ప్రశ్నలకు సమాధానమిస్తూ, అయితే ఎవరో ముఖ్యమైన వాళ్లు పైన కూర్చొని ఇదంతా నడిపిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి హింస మరోసారి వాటిల్లే అవకాశం లేకుండా చేస్తామని, అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో, తమకి బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు. 

దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతంలో చైనా తిరుగుబాటుకు ఆజ్యం పోస్తోందని మాజీ ఆర్మీ చీఫ్ చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతంలోని వివిధ తిరుగుబాటు గ్రూపులకు చైనా చేస్తున్న సహాయాన్ని ధ్వజమెత్తారు. పొరుగు దేశంలో (మయన్మార్) మాత్రమే కాకుండా, సరిహద్దు రాష్ట్రం (మణిపూర్)లో కూడా అస్థిరత ఉంటే, అది మన మొత్తం జాతీయ భద్రతకు బంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది అని ఆయన అన్నారు. అంతర్గత భద్రత మనకు చాలా ముఖ్యం అని జనరల్ నరవానే అన్నారు. 

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి, జనరల్ నరవానే మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతంలో చాలా కాలంగా మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ప్రధాన సమస్యగా ఉందని ఆయన ఉద్దేశపడ్డారు. 

సిబిఐ విచారణ: 

మే నెలలో మణిపూర్ గ్రామాలలో జాతి హింస చెలరేగినప్పటి నుండి 140 మందికి పైగా మరణాలు సంభవించగా మరి ఎంతోమంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. ముఖ్యంగా మణిపూర్ లోని ఆడవారి మీద హింస మరింత చెలరేగిపోతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఇంతకంటే అత్యవసరం ఏమీ లేదని ప్రతిపక్షం వాదిస్తోంది. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్.. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్.

మణిపూర్‌లోని హింసాకాండ విదేశాల్లో కూడా చర్చనీయంగా మారింది. యూరోపియన్ పార్లమెంట్ భారతదేశంలోని మానవ హక్కుల పరిస్థితిపై తీర్మానాన్ని ఆమోదించింది, మణిపూర్‌లో ఇటీవలి ఘర్షణలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.