Girl Child: అమ్మాయి పుడితే అలా చేస్తున్నారు..

నేటి రోజుల్లో సైన్స్ (Science) ఎంతో డెవలప్ అయింది. ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన ఆడవాళ్లు (Girl Child) నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రోదసిలోకి కూడా వెళ్లి తమకు (Girl Child) సాటిలేదని నిరూపిస్తున్నారు. అయినా కానీ వారి మీద రోజూ ఎక్కడో చోట జరిగిన వివక్ష బయటపడుతూనే ఉంది. కేవలం వివక్ష అని మాత్రమే కాకుండా లైంగిక వేధింపుల (Sexual Harassments) ఘటనలు కూడా మనం అనేకం చూస్తున్నాం. వీటన్నింటిని చూసినపుడు ఇంకా ఈ […]

Share:

నేటి రోజుల్లో సైన్స్ (Science) ఎంతో డెవలప్ అయింది. ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన ఆడవాళ్లు (Girl Child) నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రోదసిలోకి కూడా వెళ్లి తమకు (Girl Child) సాటిలేదని నిరూపిస్తున్నారు. అయినా కానీ వారి మీద రోజూ ఎక్కడో చోట జరిగిన వివక్ష బయటపడుతూనే ఉంది. కేవలం వివక్ష అని మాత్రమే కాకుండా లైంగిక వేధింపుల (Sexual Harassments) ఘటనలు కూడా మనం అనేకం చూస్తున్నాం. వీటన్నింటిని చూసినపుడు ఇంకా ఈ సమాజంలో మహిళలకు (Girl Child) రక్షణ లేదని మనకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని నేరాలు, ఘోరాలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. మహిళలనే కాకుండా కొన్ని చోట్ల బాలికల (Girl Child)పై వేధింపులు, వారిపై చిత్రహింసలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ చూసినపుడు మనస్సు చివుక్కుమంటుంది. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం ఆడపిల్లల (Girl Child) ను పూజించడం గమనార్హం. ఎక్కడైనా సరే ఆడపిల్ల (Girl Child) పుట్టిందని అంటే కసురుకునే సమాజాన్నే మనం చూశాం. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ ఆడపిల్లను (Girl Child) అంగీకరించడానికి ఈ సమాజం సిద్ధంగా లేదనేది అందరూ ఒప్పుకుని తీరాల్సిన సత్యం. కానీ అటువంటిది రాజస్థాన్ లో ఆడపిల్ల (Girl Child) పుడితే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. 

వింత ఆచారం వెలుగులోకి 

ఆడపిల్ల (Girl Child) పుట్టిందని అంటే చీదరించుకునే ఈ రోజుల్లో (సాంకేతిక ఇంత డెవలప్ అయినా కానీ) కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ ఇదే జరుగుతోంది. కానీ దక్షిణ రాజస్థాన్‌ (Rajasthan) లోని రాజ్‌సమంద్ ప్రాంతంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అక్కడ ఉన్న పిప్లాంత్రి గ్రామం (Village) బాలికల (Girl Child) హక్కులను ప్రోత్సహించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కేవలం బాలికల (Girl Child) హక్కులను కాపాడడం మాత్రమే కాదు ఈ నిర్ణయంతో వారు పర్యావరణాన్ని (Environment) కూడా కాపాడుతున్నారు. పిప్లాంత్రి ప్రజలు పుట్టిన ప్రతి ఆడబిడ్డ (Girl Child)కు 111 మొక్కలు నాటుతున్నారు. చిన్నారులు (Girl Child) పెద్దయ్యాక ఆ చెట్లు పెరిగేలా మరియు ఫలాలు అందేలా సమాజం వాటిని సంరక్షించడం మరో కొసమెరుపు. నమ్మశక్యంగా లేకపోయినా కాదీ ఇది నిజం. ఇప్పటికీ కొడుకుల పుట్టుకను ఇష్టపడే ఈ దేశంలో పిప్లాంత్రి గ్రామ స్థానికులు కొత్త రికార్డును నెలకొల్పారు. గ్రామంలో పుట్టిన ప్రతి కొత్త అమ్మాయి (Girl Child) పేరు మీద 111 మొక్కలు (Plants) నాటడం విశేషం. ఇది కేవలం ఆడ పిల్లలను (Girl Child) మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కూడా రక్షిస్తుంది. 

అసలేంటీ ఈ గ్రామ చరిత్ర.. 

పిప్లాంత్రి అనేది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక కుగ్రామం. ఇది రాజ్‌ సమంద్ (Rajsamand) జిల్లాలో ఉంది. ఆడపిల్ల  (Girl Child) పుట్టిన ప్రతిసారీ.. పిప్లాంత్రి ప్రజలు 111 మొక్కలు నాటుతున్నారు. ఆడబిడ్డ (Girl Child) జన్మించిన తర్వాత, గ్రామస్తులు వారి ఉమ్మడి విరాళాలను రూ. 21,000 వసూలు చేసి, అంతే కాకుండా తల్లిదండ్రుల నుంచి రూ. 10,000 తీసుకుంటారు. వాటిని పుట్టిన ఆడ పిల్ల (Girl Child) పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ గా జమ చేస్తారు. వాటిని ఆ బిడ్డ 20 సంవత్సరాలు పూర్తయ్యాక తీసుకునేందుకు మాత్రమే వీలుంటుంది. అంతే కాకుండా బాలికకు  (Girl Child) చట్టబద్ధంగా వివాహ వయసు రాకముందు పెళ్లి చేయమని తల్లిదండ్రుల నుంచి ఒక కాగితం రాసి తీసుకుంటారు. దాని మీద తల్లిదండ్రుల (Parents) చేత బలవంతంగా సంతకం చేపిస్తారు. 

మొదలయింది అలాగే.. 

ఇంతటి గొప్ప ప్రయత్నం ఎలా మొదలైందనే ఆలోచన, అనుమానం ఎవరికైనా రావడం సహజమే. ఈ ప్రయత్నాన్ని మాజీ సర్పంచ్ (Sarpanch) శ్యామ్ సుందర్ పలివాల్ ప్రారంభించారు. అనేక సంవత్సరాల క్రితం మరణించిన తన కుమార్తె కిరణ్ జ్ఞాపకార్థం ఆయన ఇది ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ (Project) కారణంగా పిప్లాంత్రి సంఘం పచ్చని చెట్లతో కలకళలాడుతోంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు వల్ల గ్రామ ఆర్థిక వ్యవస్థ కూడా లాభపడింది. ఈ కుగ్రామంలో 2.5 మిలియన్లకు పైగా అలోవెరా మొక్కలతో ఫలాలను ఇచ్చే చెట్లు ఉన్నాయి. కలబందను (Aloe Vera) ప్రాసెస్ చేయడానికి మరియు విక్రయించడానికి అనేక పద్ధతులు ఉన్నాయని ప్రజలు క్రమంగా కనుగొన్నారు. ఫలితంగా, సంఘం ఇప్పుడు జ్యూస్ మరియు జెల్‌ తో సహా కలబందతో తయారు చేసిన వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. ఈ పద్ధతి వల్ల గ్రామంలో పచ్చదనం పెరగడం మాత్రమే కాదు. ఇది తమకు లాభాలను కూడా తెచ్చిపెడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.