రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ అరెస్ట్ కి సర్వం సిద్ధం

ఎన్నో రోజులుగా నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ అందుకున్న ఎంతోమంది నడి రోడ్లమీద బ్రిజ్ భూషణ్ అరెస్ట్ కోసం ధర్నాలు చేయడం జరిగింది. కానీ అతని మీద పలు ఆధారాలు ఉండప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. కానీ ప్రస్తుతం 100 మంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తీసుకొని, భూషణ్ మీద 1000 పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు పోలీసులు.  పోలీసులు ఏం చెప్తున్నారు:  అయితే ఎంతోకాలంగా భూషణ్ ద్వారా సెక్సువల్ హరేజ్మెంట్ కి గురయ్యాము అని చాలామంది […]

Share:

ఎన్నో రోజులుగా నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ అందుకున్న ఎంతోమంది నడి రోడ్లమీద బ్రిజ్ భూషణ్ అరెస్ట్ కోసం ధర్నాలు చేయడం జరిగింది. కానీ అతని మీద పలు ఆధారాలు ఉండప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. కానీ ప్రస్తుతం 100 మంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తీసుకొని, భూషణ్ మీద 1000 పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు పోలీసులు. 

పోలీసులు ఏం చెప్తున్నారు: 

అయితే ఎంతోకాలంగా భూషణ్ ద్వారా సెక్సువల్ హరేజ్మెంట్ కి గురయ్యాము అని చాలామంది రెజ్లర్ ఇచ్చిన కంప్లైంట్స్ పరంగా పోలీసులు ఎట్టకేలకు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి ఆయన అరెస్టుకు మొత్తం సిద్ధం చేశారు. ఈ మేరకు భూషణ్ ని పలు మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పటికీ ,వారితో కూడా అసభ్యంగా ప్రవర్తించి ముఖం మీద కార్ డోర్ వేసినట్లు మీడియా వాళ్ళు పేర్కొన్నారు. ప్రస్తుతం 100 మంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తీసుకొని, భూషణ్ మీద 1000 పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు పోలీసులు. 

లైంగిక వేధింపులు, వేధింపులు, అక్రమ నిర్బంధం అంతేకాకుండా నేరపూరిత బెదిరింపులకు కూడా భూషణ్ పాల్పడినట్లు పలు ఆధారాలు సేకరించారు పోలీసులు. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణల ఆధారంగా అతనిపై రెండవ ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) దాఖలు చేయబడింది, ఇది పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద నమోదు చేయబడింది. ఈ రెండు కేసుల మీద ఆయన్ని అరెస్టు చేయడం ద్వారా, అతనికి మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

అయితే ప్రస్తుతం భూషణ్ కి వ్యతిరేకంగా వచ్చిన వాంగ్మూలను సేకరించి కోర్టులో సబ్మిట్ చేసినట్లు, అంతేకాకుండా ఆయన జులై 18న కోర్టులో హాజరుకానున్నట్లు పోలీసు వారు తెలిపారు. అయితే ప్రస్తుతం 100 మంది వాంగ్మూలంతో కచ్చితంగా భూషణ్ కి పెద్ద శిక్ష పడుతుంది అని పోలీసులు ఖరారు చేశారు. 

రెజ్లర్స్ పోరాటం ఫలించింది: 

రెజ్ల‌ర్ల‌పై భూషణ్ వేధింపులు అన్ని ఇన్ని కాదు. గత కొన్ని నెలలుగా చూసుకుంటే జాతీయస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలుచుకున్న ఎంతో మంది రెసలర్స్ రోడ్లమీద న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టారు. అంతేకాకుండా వారికి ఎన్నోసార్లు అవమానమే ఎదురయింది. వాళ్ల పోరాటాన్ని తిప్పికొట్టేందుకు పోలీసుల ద్వారానే వారిని ఎన్నోసార్లు రోడ్లపై నుంచి ఈడ్చుకుని వెళ్లిన దృశ్యాలు కూడా మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాను. వారు ఎన్నో విధాలుగా ఆధారాలు చూపించినప్పటికీ భూషణ్ ఎత్తుకు పైఎత్తులు వేసి తప్పించుకుంటూనే ఉన్నాడు. భారతదేశనికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన గోల్డ్ మెడల్ గ్రహీతలు కూడా రోడ్డు ఎక్కడం వారికి న్యాయం జరగకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు పబ్లిక్. అయితే ఎట్టకేలకు భూషణ్ అరెస్టుకు సర్వం సిద్ధం అని చెప్పిన పోలీసుల మాట తర్వాత రెజ్లర్స్ మనసు ప్రశాంతంగా మారినట్లు తెలుస్తోంది. వారి పోరాటం ఫలించిందని సంబరాలు జరుపుకునే సమయం దగ్గరలోనే ఉంది అంటున్నారు.

భారతదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన రెజ్ల‌ర్లు ఇంత దౌర్భాగ్య పరిస్థితి రావడం నిజంగా భారతదేశం తలదించుకునే పరిస్థితి అని చెప్పుకోవాలి. చీఫ్ గా ఉంటున్న వారే వేధింపులకు గురి చేస్తున్నట్లు కొన్ని సంవత్సరాల తర్వాత భరించలేక బయట పెట్టినప్పటికీ, రెజ్ల‌ర్లు మాత్రం నిరాశ ఎదురయింది. అయితే, భూషణ్ అరెస్ట్ విషయం తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.