బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలని  బీబీసీ ఇండియాను ఆదేశించింది. అలాగే విదేశీ రెమిటెన్స్ ల వివరాలను పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. బీబీసీ ఇండియా కార్యాలయంలో కొద్ది నెలల క్రితం ఐటి శాఖ తనిఖీలు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని రోజులపాటు నిర్వహించిన ఆ తనిఖీలను సోదాలు కాదు […]

Share:

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలని  బీబీసీ ఇండియాను ఆదేశించింది. అలాగే విదేశీ రెమిటెన్స్ ల వివరాలను పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. బీబీసీ ఇండియా కార్యాలయంలో కొద్ది నెలల క్రితం ఐటి శాఖ తనిఖీలు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని రోజులపాటు నిర్వహించిన ఆ తనిఖీలను సోదాలు కాదు సర్వే అని అధికారులు తెలిపారు. అయితే గోద్ర మరణకాండ వెనుక నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందంటూ, బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రచారం చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ తనిఖీలు చోటు చేసుకోవటం గమనార్హం. 

 గుజరాత్ అల్లర్లలో మోడీ హస్తం ఉందని ‘: దా మోదీ క్యూస్షన్ పేరిట’ రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. దీని పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోడీకి క్లీన్ చిట్ లభించాక ఇలా అబాండాలు వేయడం ఏమిటని భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన లింకుల్ని కేంద్రం సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది.ఇండియా: ది మోదీ క్వశ్చన్

ఈ బీబీసీ డాక్యుమెంటరీపై భారతదేశం తోపాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. బీబీసీపై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు బీబీసీని సమర్థించారు. మరికొందరు మోడీని సమర్థించారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో సోదాలు చేశారు. ఐటీ సర్వే నిర్వహించారు. ఇప్పుడు ఈడీ కూడా బీబీసీపై ఫెమా కింద కేసు నమోదు చేసింది.

2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంటరీని బీబీసీ జనవరిలో ప్రసారం చేసింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. ఇందుకు సంబంధించిన లింకులతో కూడిన సుమారు 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్ ఇండియాను భారతదేశ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. దాంతో ఆ ట్వీట్లను మన దేశంలోని ట్విటర్ నుంచి డిలీట్ చేశారు. ఈ డాక్యుమెంటరీని మన దేశంలో ప్రసారం చేయలేదు. అయితే కొన్ని యూట్యూబ్ చానళ్లు దీనిని అప్‌లోడ్ చేశాయి.

ఈ విషయంపై ఎలన్ మస్క్ బీబీసీకి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు పంచుకున్నారు. మోదీ డాక్యుమెంటరీని ట్విటర్ నుంచి తొలగించడం గురించి తనకు తెలియదన్నారు. సోషల్ మీడియా కంటెంట్‌కు సంబంధించిన నిబంధనలు ఇండియాలో చాలా కఠినంగా ఉన్నాయని అన్నారు. ఇండియాలో కంటెంట్‌ను ట్విటర్ చాలాసార్లు బ్లాక్ చేసిందని, సెన్సార్ చేసిందని తెలిపారు. అలా చేయకపోతే తమ ఉద్యోగులు జైలుకు వెళ్లవలసి వస్తుందన్నారు. దేశంలోని చట్టాలకు అతీతంగా తాము ప్రవర్తించలేమని అన్నారు. ఉద్యోగులు జైలుకు వెళ్లడమా? చట్టాలను పాటించడమా? అనే వాటిలో తాము చట్టాలకు అనుగుణంగా నడచుకోవడాన్నే ఎంచుకుంటామని ఆయన అన్నారు. బీబీసీ ప్రసారం చేసిన మోదీ డాక్యుమెంటరీలో ఏం ఉందో తనకు తెలియదని అన్నారు. అయితే ఈ సమస్య గురించి తాను విన్నానని, ట్విటర్‌కు సంబంధించి ప్రపంచంలోని అన్ని విషయాలను రాత్రికి రాత్రే చక్కదిద్దడం సాధ్యం కాదని చెప్పారు.