కర్ణాటక ప్రభుత్వం 17% వేతన పెంపును ప్రకటించడంతో ఉద్యోగులు నిరసన విరమించారు

రాబోతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఈ టైంలో రిస్క్ ఎందుకని అనుకున్నారో ఏమో కానీ, కర్ణాటక ప్రభుత్వం చాలా తొందరగానే నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆశ్చర్యపరచింది. సమ్మె బాట పట్టిన ప్రభుత్వ ఉంద్యోగులను ఒకే ఒక ప్రకటనతో మళ్ళీ దారిలోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు సమ్మె ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ప్రతిపక్షాల నుండి, విమర్శకుల నుండి విమర్శలను ఎదుర్కొకుండా కర్ణాటక  సీఎం  బొమ్మై ఉద్యోగుల డిమాండ్లను సామరస్యంగా నెరవేర్చి అందరికీ షాక్ ఇచ్చారు. 2023 కర్ణాటక బడ్జెట్‌లో […]

Share:

రాబోతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఈ టైంలో రిస్క్ ఎందుకని అనుకున్నారో ఏమో కానీ, కర్ణాటక ప్రభుత్వం చాలా తొందరగానే నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆశ్చర్యపరచింది. సమ్మె బాట పట్టిన ప్రభుత్వ ఉంద్యోగులను ఒకే ఒక ప్రకటనతో మళ్ళీ దారిలోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు సమ్మె ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ప్రతిపక్షాల నుండి, విమర్శకుల నుండి విమర్శలను ఎదుర్కొకుండా కర్ణాటక  సీఎం  బొమ్మై ఉద్యోగుల డిమాండ్లను సామరస్యంగా నెరవేర్చి అందరికీ షాక్ ఇచ్చారు.

2023 కర్ణాటక బడ్జెట్‌లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు  ఫిబ్రవరి 23న ప్రకటించారు. ఏడో వేతన సంఘం సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తుందన్న ఉద్యోగుల ఆశలపై సీఎం బొమ్మై నీళ్లు చల్లారు. దీనికై ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. గత వారం రోజుల్లోగా జీతాల పెంపునకు సంబంధించి శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప సమ్మె ఆలోచన విరమించేది లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలో.. సమ్మె మొదలైన 3 గంటలలోనే వారికి మధ్యంతర ఉపశమనంగా మూలవేతనాన్ని 17 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. అంతకుముందు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనాన్ని 40% పెంచాలని మరియు NPS రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్‌ షడక్షరి అధికారులతో సమావేశమయ్యారు. అక్కడ అతనికి 17% పెంపు ప్రతిపాదన కాపీని అందించారు. ఈ సమావేశం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారని, అయితే సమ్మె విరమిస్తారో లేదో తర్వాత ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఏడో వేతన సంఘం అమలు, కొత్త పెన్షన్‌ విధానాన్ని (ఎన్‌పీఎస్‌) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం ఉదయం నిరవధిక సమ్మెకు దిగారు. రెండు మూడు గంటల్లోనే ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె విరమించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17% వేతన పెంపునకు అంగీకరిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు తమ నిరవధిక సమ్మెను మూడు గంటల్లో విరమించారు.

17% వేతన పెంపు ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వ నిర్ణయంతో కర్ణాటకలోని ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ లభించింది. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల నిరసనకు తెరపడింది. మీడియాతో మాట్లాడిన కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడక్షరి సమ్మె విరమిస్తున్నట్లు స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో సంతృప్తి చెందలేదని, 25% అడిగామని, ప్రభుత్వం 17% ఇస్తుందని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేం ఆమోదించామని షడక్షరి వివరించారు.