ఈస్ట్ కోస్ట్ రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది

రాబోయే వేసవి సీజన్‌లో పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని నివారించడానికి భారతీయ రైల్వేలోని వివిధ జోన్‌లు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వేసవిలో వారానికోసారి ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ విశాఖపట్నం – సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు రైలు నంబర్ 08579 విశాఖపట్నం – సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు.. మార్చి 1వ తేదీ నుండి ఏప్రిల్ 26వ తేదీ వరకు ప్రతి బుధవారం 19.00 […]

Share:

రాబోయే వేసవి సీజన్‌లో పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని నివారించడానికి భారతీయ రైల్వేలోని వివిధ జోన్‌లు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వేసవిలో వారానికోసారి ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.

ప్రత్యేక రైళ్ల షెడ్యూల్

విశాఖపట్నం – సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు

రైలు నంబర్ 08579 విశాఖపట్నం –

సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు.. మార్చి 1వ తేదీ నుండి ఏప్రిల్ 26వ తేదీ వరకు ప్రతి బుధవారం 19.00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 08.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (9 ట్రిప్‌‌లు)

తిరుగుప్రయాణంలో రైలు నెం. 08580 సికింద్రాబాద్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు.. మార్చి 2 నుండి ఏప్రిల్ 27 వరకు ప్రతి గురువారం సికింద్రాబాద్ నుండి 19.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 06.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (9 ట్రిప్‌‌లు)

స్టాప్‌‌లు:

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ వద్ద ఆగనుంది.

ట్రైన్ బోగిలు :

2వ ఏసీ-1, 3వ ఏసీ-5, స్లీపర్ క్లాస్-10, జనరల్ సెకండ్ క్లాస్-5, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/డిసేబుల్డ్ కోచ్‌‌లు 2 ఉంటాయి.

విశాఖపట్నం-మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ రైలు

అదేవిధంగా.. రైలు నంబర్ 08585 విశాఖపట్నం-మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ రైలు.. మార్చి 7 నుండి ఏప్రిల్ 25 వరకు ప్రతి మంగళవారం విశాఖపట్నం నుండి 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. (8 ట్రిప్‌‌లు)

రిటర్న్ ప్రయాణంలో రైలు నెం. 08586 మహబూబ్‌నగర్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు..  మార్చి 8 నుండి ఏప్రిల్ 26 వరకు ప్రతి బుధవారం నాడు 18.20 గంటలకు మహబూబ్‌నగర్ నుండి బయలుదేరి మరుసటి రోజు 09.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (8 ట్రిప్‌‌లు)

స్టాప్‌‌లు:

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య దువ్వాడ, అన్నవరం, సామర్లకోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, ఉమాదానగర్, షాద్‌నగర్‌, జడ్చర్ల వద్ద ఆగనుంది.

ట్రైన్ బోగిలు :

థర్డ్ ఏసీ-3, స్లీపర్ క్లాస్-10, జనరల్ సెకండ్ క్లాస్-6, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/డిసేబుల్డ్ కోచ్‌‌లు 2 ఉంటాయి.

విశాఖపట్నం – తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు

రైలు నెం. 08583 విశాఖపట్నం – తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు.. మార్చి 6వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రతి సోమవారాల్లో 19.00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 09.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. (8 ట్రిప్‌‌లు)

ఇక తిరుగు ప్రయాణంలో  రైలు నెం. 08584 తిరుపతి – విశాఖపట్నం వీక్లీ స్పెషల్.. మార్చి 7 నుండి ఏప్రిల్ 25 వరకు ప్రతి మంగళవారం తిరుపతి నుండి 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (8 ట్రిప్‌‌లు)

స్టాప్‌లు: విశాఖపట్నం-తిరుపతి మధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట వద్ద ఆగనుంది.

ట్రైన్ బోగిలు: 2వ ఏసీ-1, 3వ ఏసీ-5, స్లీపర్ క్లాస్-9, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 ఎల్‌హెచ్‌బీ కోచ్‌‌ ఉంటుంది. 

విశాఖపట్నం – బెంగళూరు కంటోన్మెంట్ వీక్లీ స్పెషల్ రైలు

రైలు నెం. 08543 విశాఖపట్నం –

బెంగళూరు కంటోన్మెంట్ వీక్లీ స్పెషల్ రైలు.. మార్చి 5 నుండి ఏప్రిల్ 30 వరకు ప్రతి ఆదివారం 15.55 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 09.15 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. (9 ట్రిప్‌‌లు)

రిటర్న్ ప్రయాణంలో రైలు నెం. 08544 బెంగళూరు కంటోన్మెంట్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్.. మార్చి 6వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు ప్రతి సోమవారం 15.50 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ నుండి బయలుదేరి మరుసటి రోజు 11.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (9 ట్రిప్‌‌లు)

స్టాప్‌లు: దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, విశాఖపట్నం మరియు బెంగళూరు కాంట్ మధ్య కృష్ణరాజపురం వద్ద ఆగనుంది.

ట్రైన్ బోగిలు:

2వ ఏసీ-1, 3వ ఏసీ-5, స్లీపర్ క్లాస్-10, జనరల్ సెకండ్ క్లాస్-5, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/డిసేబుల్డ్ కోచ్‌‌లు 2 ఉంటాయి.