మహారాష్ట్రలో భూకంపం, ఆందోళనలో ప్రజలు

మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో ఆగస్టు 16 బుధవారం ఉదయం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని భారత జాతీయ భూకంప శాస్త్రం తెలిపింది. కొల్హాపూర్‌లో ఉదయం 06.45 గంటలకు భూకంపం వచ్చింది. భూకంపం సంబంధించిన అనంతరం, ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్‌లో, “భూకంపం తీవ్రత: 3.4, 16-08-2023, 06:45:05 IST, లాట్: 17.19 & పొడవు: 73.79, లోతు: 5 కిమీ, స్థానం: కొల్హాపూర్, మహారాష్ట్ర. […]

Share:

మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో ఆగస్టు 16 బుధవారం ఉదయం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని భారత జాతీయ భూకంప శాస్త్రం తెలిపింది. కొల్హాపూర్‌లో ఉదయం 06.45 గంటలకు భూకంపం వచ్చింది. భూకంపం సంబంధించిన అనంతరం, ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్‌లో, “భూకంపం తీవ్రత: 3.4, 16-08-2023, 06:45:05 IST, లాట్: 17.19 & పొడవు: 73.79, లోతు: 5 కిమీ, స్థానం: కొల్హాపూర్, మహారాష్ట్ర. ” ప్రతిరోజు ఎక్కడో ఒకచోట భూకంపాలు నమోదు అవుతూనే ఉన్నాయి. 

ఎక్కువ అవుతున్న భూకంపాలు: 

గత జూలై నెల 21వ తేదీన ఉదయం 4:09 గంటలకు జైపూర్‌లో భూకంపం సంభవించింది.  ప్రకంపనలు రావడంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని నివేదికలు చెబుతున్నాయి. అదృష్టవశాత్తూ, ఈ భూకంపాల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తులకు నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.

 జైపూర్‌లో గణనీయమైన ప్రకంపనలు సంభవించాయని మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా చెప్పడం జరిగింది. అందరి భద్రతపై ఆమె తన ఆందోళనను ట్వీట్‌ ద్వారా పంచుకున్నారు. వీధుల్లో అమర్చిన సిసి టీవీ ఫుటేజ్ ద్వారా భూకంపం ప్రభావం వీడియోలను చాలామంది సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఈ వీడియోలు భూకంపం సంభవించినప్పుడు తీవ్రతను స్పష్టంగా చూపించాయి. 

ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన భూకంపం: 

మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో సోమవారం రాత్రి 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. రాత్రి 10.07 గంటలకు భూకంపం వచ్చినట్లు నివేదికల ప్రకారం తెలిసింది. 

ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి 17న కరెక్ట్ గా జమ్మూ కాశ్మీర్ కత్రా ప్రాంతంలోనే భూకంపం సంభవించినట్లు భూకంపకేంద్రం స్పష్టం చేసింది. రాక్టర్ స్కేలు మీద 3.6గా భూకంపం సంబంధించినట్లు అధికారులు తెలిపారు. అయితే అప్పట్లో కాత్రాకు 97 కిలోమీటర్ల దూరంలో తూర్పున భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది. అయితే ఈ భూకంపం ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించినట్లు తెలుస్తోంది. 

దశాబ్దాల తర్వాత అత్యధిక భూకంపం ఇక్కడే సంభవించింది: 

6 ఫిబ్రవరి 2023న, టర్కీ మరియు ఉత్తర మరియు పశ్చిమ సిరియాలో, ఉదయం 04:17కు, రాక్టర్ స్కేలు మీద 7.8 భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం గాజియాంటెప్‌కు పశ్చిమ-వాయువ్యంగా 37 కిమీ (23 మైళ్ళు) దూరంలో ఉంది. ఎన్నో దశాబ్దాల తర్వాత సంభవించిన అతి పెద్ద భూకంపం ఇది. దీని తర్వాత 13:24కి మళ్లీ మరోసారి రెక్టర్ స్కేల్ మీద 7.7 భూకంపం వచ్చింది. ఈ భూకంపం మొదటిసారి వచ్చిన భూకంప కేంద్రం దగ్గర నుంచి 95 కిమీ (59 మైళ్ళు) ఉత్తర-ఈశాన్య దిశలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ అతిపెద్ద భూకంపం కారణంగా సుమారు 10,000 మంది మరణించడం జరిగింది.