టమాటా పంటకు సీసీటీవీ కెమెరాలు

ప్రస్తుతం భారతదేశంలో టమాటాల రేటు ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. బంగారంతో సమానంగా ప్రతి ఒక్కరూ టమాటలను చూసుకుంటున్నారు. పావు కేజీ టమాటాల కోసం అర తులం బంగారం తాకట్టు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా టమాటాలు కొనేందుకు జనాలు గంటల తరబడి క్యూలో నిలబడే సన్నివేశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.కొంతమంది రైతులు టమాటాలు అమ్మి కోటీశ్వరులుగా మారారు. ఈ క్రమంలోనే టమాటా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం టమాటాలు […]

Share:

ప్రస్తుతం భారతదేశంలో టమాటాల రేటు ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. బంగారంతో సమానంగా ప్రతి ఒక్కరూ టమాటలను చూసుకుంటున్నారు. పావు కేజీ టమాటాల కోసం అర తులం బంగారం తాకట్టు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా టమాటాలు కొనేందుకు జనాలు గంటల తరబడి క్యూలో నిలబడే సన్నివేశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.కొంతమంది రైతులు టమాటాలు అమ్మి కోటీశ్వరులుగా మారారు. ఈ క్రమంలోనే టమాటా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం టమాటాలు అమ్మే వారి దగ్గర పోలీసు వారు సెక్యూరిటీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం టమాటా రేట్ ఎక్కువగా ఉండటం వల్ల, దొంగతనాలు జరగకుండా రైతులు తమ జాగ్రత్తల్లో తాము ఉంటున్నారు. 

ఈ మధ్యకాలంలో జరిగిన టమాటా దొంగతనాలు: 

టమాటా రేట్లు ఎక్కువైన క్రమంలో చాలా చోట్ల టమాటాలు దొంగతనానికి గురవుతున్నాయి. సోమవారం నాడు కర్ణాటక నుంచి రాజస్థాన్ వెళ్తున్న ట్రక్కులో 21 లక్షల విలువైన టమాటాలు దొంగతనం జరిగినట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. జార్ఖండ్ లో జరిగిన మరొక సంఘటనలో, ఒక మార్కెట్లో 40 కేజీల టమాటాలు దొంగతనం జరిగింది.

కొన్ని చోట్ల టమాటాలు దొంగతనాలు ఎక్కువగా అవ్వటంతో రైతులు తమ టమాటా పొలాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్రలో చత్రపతి శంభాజీ నగర్ లో ఒక రైతు తాను పండించిన టమాటాలు దొంగతనం జరగకుండా చూసేందుకు తమ పొలంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. 

వేర్వేరు ప్రాంతాల్లో టమాటా ధరలు:

ఢిల్లీలో లోకల్ మార్కెట్లలో కిలో  200 దాకా అమ్ముతున్నారు.ఉత్తర ప్రదేశ్, హర్యానాల నుండి సప్లై రానందువల్లనే ఢిల్లీలో రేట్ పెరిగింది అంటున్నారు. ఈ రేట్లు రానున్న 15 రోజుల్లో తగ్గుతాయని గవర్నమెంట్ అంటుంది. వచ్చే నెల రోజుల్లో టమాటా రేట్లు నార్మల్ అవుతాయని గవర్నమెంట్ అంటుంది. ఒక నెల క్రితం వరకు కిలో టమాట ధర 20 రూపాయలుగా ఉండేది.

కానీ సీజన్ ఆలస్యం అవ్వడం వల్ల దీని రేటు భారీగా పెరిగింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో దాదాపు ప్రతి ఇంట్లో టమాటా వాడుతారు. ఇప్పుడు వాళ్లంతా దీని రేట్ పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. టమాటా వల్ల మన శరీరానికి కూడా చాలా లాభాలు ఉంటాయి దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది. టమాటా సలాడ్స్ తో కలిపి తింటే మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టమాట ధర హైదరాబాద్ లో దాదాపు కిలో 200 దాకా ఉంది. హైదరాబాద్ లో లోకల్ మార్కెట్లలో దీని రేటు ఇంకా ఎక్కువ చేసి అమ్ముతున్నారు. దాదాపు అన్ని మెట్రో సిటీలలో ఇదే పరిస్థితి. టమాటా ధర రానున్న రెండు వారాల్లో తగ్గాలంటే ముందుగా వర్షాలు పడాలి. వర్షాలు పడ్డాక ఆటోమెటిగ్గా దీని రేటు తగ్గిపోతుంది. ఒక నెలలో టమాటో ధర సాధారణ స్థాయికి వస్తుండొచ్చని గవర్నమెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఏదేమైనా ఈ రేట్లు చూసి చాలామంది నిరాశ చెందుతున్నారు. ఆకాశాన్నంటిన టమాట ధరలు త్వరలోనే తగ్గుముఖం పడతాయని అందరూ ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టమాట ధరలు భారీగానే ఉన్నాయి. అక్కడ కిలో టమాటా ధర దాదాపు 150 పైగానే ఉంది. అక్కడ కూడా ప్రైవేట్ మార్కెట్లలో వీటి ధర ఎక్కువ చేసి అమ్ముతున్నారు. వీటి ధర త్వరలోనే తగ్గుముఖం పట్టాలని కోరుకుందాం.