గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశానికి ముప్పు తప్పదు.. హెచ్చరిస్తున్న ఐపీసీసీ..!

ఇటీవల విడుదల చేసిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) సంశ్లేషించిన నివేదిక ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల, సముద్ర మట్టం పెరుగుదల, ప్రజల జీవితాలు, జీవనోపాధిపై విపత్కర ప్రభావాలు భారతదేశానికి కొన్ని పెద్ద సవాళ్లని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే గ్లోబల్ వార్మింగ్ రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పాలి వాస్తవానికి గ్లోబల్ వార్మింగ్ పెరగడాన్ని ఎలా గుర్తిస్తారు అంటే భూమి ఉష్ణోగ్రతలలో దీర్ఘకాలికంగా జరిగే శీతోష్ణస్థితి మార్పే గ్లోబల్ వార్మింగ్.. అయితే ఇప్పుడు మనదేశంలో పర్యావరణ పరిస్థితులలో […]

Share:

ఇటీవల విడుదల చేసిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) సంశ్లేషించిన నివేదిక ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల, సముద్ర మట్టం పెరుగుదల, ప్రజల జీవితాలు, జీవనోపాధిపై విపత్కర ప్రభావాలు భారతదేశానికి కొన్ని పెద్ద సవాళ్లని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే గ్లోబల్ వార్మింగ్ రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పాలి

వాస్తవానికి గ్లోబల్ వార్మింగ్ పెరగడాన్ని ఎలా గుర్తిస్తారు అంటే భూమి ఉష్ణోగ్రతలలో దీర్ఘకాలికంగా జరిగే శీతోష్ణస్థితి మార్పే గ్లోబల్ వార్మింగ్.. అయితే ఇప్పుడు మనదేశంలో పర్యావరణ పరిస్థితులలో మార్పులు రావడం వల్ల గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకూ పెరిగిపోతోందని ఐపీసీసీ హెచ్చరికలు జారీ చేస్తోంది. భూమి వేడెక్కడం వల్ల ప్రజల జీవితాలే కాదు వారి జీవనోపాధిపై కూడా చెడు ప్రభావం చూపుతుందని ఆ నివేదిక హెచ్చరించింది. ఈ కాలంలో భారతదేశం మరిన్ని పెద్ద సవాలను ఎదుర్కోవాలి అని ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) సంశ్లేషణ నివేదించింది.

ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు.. 

ఈ నివేదిక మొత్తం ఆరు నివేదికలను ఏకీకృతం చేస్తుంది. అలాగే జీవన విధానానికి అత్యంత ముఖ్యమైన శాఖలను కూడా కలిగి ఉంటుంది.. రోజురోజుకీ వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడం వల్లే భారత దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ముఖ్యంగా ఈ సంఘటనలు వ్యవసాయం,  ఆర్థిక వ్యవస్థ , ప్రజారోగ్యానికి భయంకరమైన పరిణామాలను కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు… అత్యంత ప్రభావితం చేసే ప్రాంతాలు.. ప్రజలకు హాని కలిగించే జనాభాను రక్షించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా విపత్తు ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా విధాన రూపకర్తలు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ నివేదిక హైలెట్ చేస్తుందని ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ అంజన్ ప్రకాష్ తెలిపారు.

 ఐపిసిసి సంశ్లేషణ నివేదిక.. 

గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కి పరిమితం చేయడం సిద్ధాంతపరంగా సాధ్యమేనని తెలుస్తోంది.  అయితే 2030లో ప్రతిజ్ఞ చేసిన గ్లోబల్ యాక్షన్ యొక్క ప్రస్తుతస్థాయి పరిధి, వేగం సరిపోవు. కాబట్టి చాలా ఎక్కువ నమ్మకంతో గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడగలిగినట్లయితే ప్రజలు సమస్యల నుంచి బయటపడతారని ఆ నివేదిక స్పష్టం చేసింది. భారతదేశంలో రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరగడం కూడా అంత అనుకూలంగా లేదని ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా అది కూడా అధిగమించవచ్చని నివేదిక తెలిపింది. ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు,  చెట్ల నరికివేత , వర్షపాతం తక్కువగా నమోదవడం, సముద్రమట్టం పెరగడం ఇలాంటి కారణాల వల్ల రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని తద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తున్నాయని ఐపిసిసి సంశ్లేషణ నివేదిక యొక్క 93 రచయితలలో ఒకరైన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన ఎనర్జీ ఎకనామిక్స్ ప్రోగ్రాం ప్రొఫెసర్ జోయ్ శ్రీరాయ్ ఎత్తిచూపారు.

ఇప్పటివరకు భారతదేశంలో 400 మిలియన్ల మంది అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారు. వీరు వాతావరణ మార్పులకు ఎక్కువగా గురవుతున్నారు. తీరప్రాంత మండలాలలో నివసిస్తున్న వారు, వ్యవసాయ ఆదాయాలు కలిగి ఉన్నవారికి ఈ ధోరణి దేశానికి చాలా భయంకరంగా మారనుంది. వాతావరణంలో వచ్చిన మార్పులు ఉదాహరణకు తుఫానులు,  వరదలు కారణంగా అత్యంత హాని కలిగించే ప్రభావితమైన వాతావరణం ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేస్తుంది. క్లైమేట్ ఫైనాన్స్ ప్రపంచం ఎలా పనిచేస్తుందో వాతావరణ స్థితిస్థాపకతను నిర్ధారించడానికి ఆర్థిక అవకాశాలను పెంచడానికి చేసే ఇతర ప్రయత్నాలు ఏమిటో పునరాలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా ఆ నివేదిక తెలిపింది. ఇకపోతే పరిష్కారాల కోసం ప్రపంచం వైపు చూడకుండా దేశంలోనే పరిష్కారాలను కనుగొనడం ఎంతో అవసరం.  భారతదేశము ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది కాబట్టి అందరూ అందుకు తగ్గట్టుగా పని చేయవలసిన అవసరం కూడా ఉంది. అంతర్గతంగా దృష్టిని అభివృద్ధి చేయడం జాతీయ,  రాష్ట్ర నిర్దిష్ట వాతావరణ స్థితిస్థాపకత మార్గాలను నిర్మించడం వల్ల భూమి వేడెక్కడాన్ని తగ్గించవచ్చు అని నివేదిక తెలిపింది.