కాశ్మీర్‌‌ లోయలో డ్రగ్స్ దందా..బలైపోతున్న యువత

జమ్మూ కాశ్మీర్‌‌ పోలీసులకు మరో సవాల్‌ ఎదురైంది. ఇన్ని రోజులు టెర్రరిస్టుల బాంబు దాడులు, తుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన లోయ.. ఇప్పుడు మత్తులో తూగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యాంటీ టెర్రరిజం చర్యలు, ఆర్టికల్‌ 370 రద్దుతో కాశ్మీర్‌‌లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ బాగా తగ్గిపోయాయి. అలాగే, నోట్ల రద్దు, తదితర కఠిన చర్యలతో టెర్రరిస్టులకు ఫండింగ్‌ కూడా ఆగిపోయింది. దీంతో ఉగ్రవాదులు డ్రగ్స్‌ అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో కాశ్మీర్‌‌లో టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో […]

Share:

జమ్మూ కాశ్మీర్‌‌ పోలీసులకు మరో సవాల్‌ ఎదురైంది. ఇన్ని రోజులు టెర్రరిస్టుల బాంబు దాడులు, తుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన లోయ.. ఇప్పుడు మత్తులో తూగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యాంటీ టెర్రరిజం చర్యలు, ఆర్టికల్‌ 370 రద్దుతో కాశ్మీర్‌‌లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ బాగా తగ్గిపోయాయి. అలాగే, నోట్ల రద్దు, తదితర కఠిన చర్యలతో టెర్రరిస్టులకు ఫండింగ్‌ కూడా ఆగిపోయింది. దీంతో ఉగ్రవాదులు డ్రగ్స్‌ అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో కాశ్మీర్‌‌లో టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కాశ్మీర్‌‌ యువత డ్రగ్స్‌ బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటుంది. పోలీసుల చొరవతో డీఅడిక్షన్‌ సెంటర్లకు వెళ్లి, చాలామంది ఆ మత్తు నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నారు.

జమ్మూ కాశ్మీర్‌‌లోని పుల్వామా జిల్లాకు చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్‌‌.. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు డ్రగ్స్‌ వ్యసనం నుంచి బయటపడ్డాడు. డ్రగ్స్‌ అతని జీవితాన్ని, కుటుంబాన్ని ఛిద్రం చేసింది. శ్రీనగర్‌‌లోని డ్రగ్స్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌‌లో సంవత్సరం పాటు ట్రీట్‌మెంట్‌ తీసుకున్న తర్వాత ఆ యువకుడు తిరిగి మామూలు మనిషి అయ్యాడు. 

డ్రగ్స్ తో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను…

‘‘నేను సిగరెట్లు బాగా తాగే వాడిని. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు నా ఫ్రెండ్స్‌ ఇద్దరు నాకు డ్రగ్స్ అలవాటు చేశారు. దీంతో నేను రోజూ హెరాయిన్‌ను ఇంజెక్ట్‌ చేసుకునే వాణ్ని. డ్రగ్స్‌ వాడుతూ వాడుతూ బానిసై, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను” అని ఆ 22 ఏళ్ల యువకుడు చెప్పాడు. 

డ్రగ్స్‌ అలవాటు నుంచి బయటపడిన తర్వాత, డ్రగ్స్ మాఫియా గురించి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చానన్నాడు మరింత సమాచారం ఇస్తే కాశ్మీర్‌‌లో డ్రగ్స్‌ సమస్యను నియంత్రిస్తామని వారు తనతో చెప్పడంతో ఇన్ఫర్మేషన్‌ ఇచ్చానన్నాడు. 

‘‘వారు చిన్న పిల్లలకు కూడా డ్రగ్స్‌ ను అలవాటు చేస్తున్నారు. చాలా మందికి డ్రగ్స్‌ అలవాటు చేసి, వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. డ్రగ్స్‌ కు అలవాటుపడిన వారు డబ్బుల కోసం వారి తల్లిదండ్రులను కొట్టి, డబ్బులను తీసుకెళ్లేవారు. ఆ డబ్బులతో డ్రగ్స్‌ కొనుక్కోని వాడేవారు. నా సంపాదన మొత్తం హెరాయిన్‌ కొనడాకే సరిపోయేది. అలా నేను రూ.5 లక్షలు డ్రగ్స్‌ కోసం ఖర్చు చేసి, నా కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాను” అని ఆ యువకుడు చెప్పాడు.

ప్రభుత్వానికి పెను సవాల్‌..

లోయలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారిందని జమ్మూకాశ్మీర్‌‌ పోలీసులు చెబుతున్నారు. కాశ్మీర్‌‌లో టెర్రరిజానికి నిధులు సమకూర్చేందుకు ఈ డ్రగ్స్‌ డబ్బునే వినియోగిస్తున్నారని విచారణలో తెలిందన్నారు. సరిహద్దు దాటి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై దాడి చేసినప్పటికీ.. కాశ్మీర్‌‌లో మాదకద్రవ్యాలకు బానిసలైన వారి సంఖ్యచాలా రెట్లు పెరుగుతోంది. 

2021 మార్చిలో కాశ్మీర్‌‌లోని హంద్వారా ప్రాంతంలో డ్రగ్‌ సిండికేట్‌ను నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) చేధించింది. ఆ తర్వాత ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు డ్రగ్స్‌ అమ్ముతున్నారని తెలిసింది. ఈ విచారణలో లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌(నియంత్రణ రేఖ) వద్ద బీఎస్‌ఎఫ్‌ అధికారిని అరెస్ట్ చేశారు. యాంటీ టెర్రర్‌‌ ఏజెన్సీ సాంబా జిల్లాలోని బీఎస్‌ఎఫ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌‌గా పనిచేస్తున్న రోమేశ్‌కుమార్‌‌ నుంచి రూ.91 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చిందని గుర్తించారు. ఈ డబ్బును లష్కర్‌‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టెర్రరిస్టులకు నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిందని పోలీసులు వెల్లడించారు. 

2,700 మంది అరెస్ట్, 1,850 ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు..

గత ఏడాది జమ్మూకాశ్మీర్‌‌ పోలీసులు 2,700 మందికి పైగా డ్రగ్స్‌ పెడ్లర్లను అరెస్ట్ చే శారు. 1,850 ఎఫ్‌ఐఆర్‌‌లను నమోదు చేశారు. దీన్ని బట్టి చూస్తే కాశ్మీర్‌‌లో టెర్రరిజం కంటే డ్రగ్స్‌ వినియోగంపై కట్టడి  పెద్ద  సవాల్‌గా మారిందని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది పోలీసులు, భద్రతా సిబ్బంది కూడా సరిహద్దు దాటి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారు. 

ఇటీవల రాజ్‌బాగ్‌ ప్రాంతంలోని పట్టుబడిన నిందితుల వద్ద 11 కిలోల హెరాయిన్‌, రూ.11 లక్షలకుపైగా నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్వారా జిల్లా డ్రగ్స్‌ రవాణాకు కేంద్రంగా మారుతోంది. సరిహద్దు గ్రామాల నుంచి పలు డ్రగ్స్‌ ను పోలీసులు గుర్తించారు. డిసెంబర్‌‌ 23న డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టగా, కుప్వారాలో ఐదుగురు పోలీసులతో సహా 17 మందిని అరెస్ట్ అయ్యారు. 

అదేవిధంగా, ఫిబ్రవరిలో తంగ్‌ధర్ సెక్టార్ నుంచి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌  ముఠా గుట్టురట్టు చేశారు. నియంత్రణ రేఖ నుంచి డ్రగ్స్‌ స్మగ్లింగ్ చేస్తున్నందుకు ఐదుగురు ఆర్మీ జవాన్లతో సహా 9 మంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. కాగా, డ్రగ్స్ బానిసలు, డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య తేడాను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌ (ఎటీఎఫ్‌)లు, డ్రగ్‌  డీఅడిక్షన్ సెంటర్లలో డ్రగ్స్ బానిసలకు పునరావాసం కల్పిస్తున్నారు. డ్రగ్‌ పెడ్లర్లకు, సరిహద్దు వద్ద అక్రమ  రవాణాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. 

‘‘మా సెంటర్‌‌లో రోజుకూ 150 నుంచి 170 మంది పేషెంట్లను చూస్తున్నాం. ఈ సంఖ్య మా కేంద్రంలో  చాలాఎక్కువ. ఐదు లేదా ఆరు సంవత్సరాల క్రితం మేము రోజుకు ఐదుగురు రోగులను మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు ఆ సంఖ్య చాలా పెరిగింది” అని శ్రీనగర్‌‌లో ప్రభుత్వ మానసిక వైద్యశాలలో అడిక్షన్‌ సైకియాట్రిస్ట్ డాక్టర్‌‌ ఫాజల్‌ రౌబ్‌ చెప్పారు.