ఇంకోసారి తమిళ్ అని అనకండి: స్టాలిన్

ఇకపై తమిళ్ అనే పదాన్ని పలికే హక్కు బీజేపీకి గాని, ప్రధాని నరేంద్ర మోదీకి గాని లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. తమిళం అనే పదాన్ని హిందీతో భర్తీ చేయాలనే బీజేపీ కుట్ర పూరిత ప్రయత్నాన్ని కృతనిశ్చయంతో వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. దీనికోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనికి DMK పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానమిస్తూ.. DMK […]

Share:

ఇకపై తమిళ్ అనే పదాన్ని పలికే హక్కు బీజేపీకి గాని, ప్రధాని నరేంద్ర మోదీకి గాని లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. తమిళం అనే పదాన్ని హిందీతో భర్తీ చేయాలనే బీజేపీ కుట్ర పూరిత ప్రయత్నాన్ని కృతనిశ్చయంతో వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. దీనికోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనికి DMK పార్టీ మద్దతు ఇచ్చింది.

ఈ అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానమిస్తూ.. DMK పార్టీపై విమర్శలు గుప్పించారు. అవమానకరంగా మాట్లాడారు. దీనిపై స్పందిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ ట్వీట్ చేశారు. ‘‘చరిత్రలో ఇలాంటి అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడి తమిళనాడు, DMK పార్టీలు అగ్రగామిగా నిలిచింది’’ అని పేర్కొన్నారు.  

భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా బిల్లు ద్వారా భారతదేశ వైవిధ్యం యొక్క సారాంశాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రపూరితంగా ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ.. ఈ చర్య భాషా సామ్రాజ్యవాదాన్ని రెచ్చగొట్టిందని పేర్కొన్నారు. 

హిందీ వ్యతిరేక ఆందోళన నుంచి మన బాషా గుర్తింపును కాపాడుకోవడం వరకు తాము ఎన్నో పోరాటాలు చేశామని, మళ్ళీ చేస్తామన్నారు. దీనికోసం తాము దేనికీ తలొగ్గని ధృడ సంకల్పంతో పని చేస్తామని తెలిపారు. హిందీ వలసవాదానికి వ్యతిరేకంగా మరోసారి మంటలు చెలరేగుతున్నాయని చెప్పారు.  

ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ ఏం చెప్పారంటే..

హిందీ వ్యతిరేక విధానం పేరుతో తమిళనాడులో హిందీ, సంస్కృతంపై పరిశోధనలు అవకాశం ఇవ్వడం లేదని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్‌పై కూడా విమర్శలు గుప్పించారు. 

ఆమె ట్వీట్‌పై కేవలం స్టాలిన్ మాత్రమే కాకుండా, సింగర్ చిన్మయి, జర్నలిస్టులు కూడా విమర్శలు చేశారు. ‘‘ఇది పూర్తిగా అబద్దం. అత్యధికంగా హిందీ నేర్చుకునేవారు తమిళనాడులో ఉన్నారు. ‘చెన్నై/తమిళనాడులో ప్రజలు ఏ భాష కావాలన్నా నేర్చుకోగలరు, ప్రజలు కోరుకున్నది ఎందుకు మాట్లాడలేరు, వారు కోరుకున్నది ఎందుకు తినలేరు? ఎవరికి నచ్చిన వారిని ఎందుకు పూజిస్తున్నారా లేదా?’’ అని ప్రశ్నించారు.

మరో జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ‘‘1977-80 మధ్య కాలంలో సీతారామన్ చదివిన తిరుచ్చిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో ఉపకార వేతనంతో హిందీని ద్వితీయ భాషగా బోధించేవారు. అదే నిర్వహణలో ఉన్న సావిత్రి విద్యాశాల పాఠశాలలో సంస్కృతం బోధించేవారు’’ ఆమె సభను తప్పుదోవ పట్టిస్తున్నారా అని నిలదీశారు.

అనేక మంది విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో హిందీని అభ్యసిస్తున్నారని తెలుపుతూ దానికి సంబంధించిన కథనాలను బయటపెట్టారు. ఆర్ధికమంత్రి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అలాగే దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా చాలా కాలంగా హిందీ బోధించబడుతోందని పేర్కొన్నారు.

ఎప్పటి నుంచో కొనసాగుతున్న రగడ..

ఇటు కేంద్రం, అటు రాష్ట్రం మధ్య రగడ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కేవలం ఈ విషయమనే కాకుండా అనేక విషయాల్లో కేంద్రానికి రాష్ట్రానికి పొసగడం లేదు. అందుకు కారణం ఇక్కడ పాలిస్తున్న డీఎంకే పార్టీ బీజేపీతో పొత్తులో లేకపోవడమే కారణం కావచ్చునని అంతా అంటున్నారు. ఏదేమైనా కానీ ఇటు కేంద్రం తగ్గకుండా అటు రాష్ట్రం తగ్గకుండా వ్యవహరిస్తోంది. మరో పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామాని శపథం చేస్తున్నారు. వారికి అంత సీన్ లేదులే అని మరో పక్క డీఎంకే నేతలు కొట్టిపారేస్తున్నారు. తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అన్నామలై అయితే ఏకంగా పాదయాత్రనే స్టార్ట్ చేశారు. తన యాత్ర డీఎంకే ప్రభుత్వానికి అంతం అని ప్రకటించారు.