అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు

మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన సినిమా ‘బ్రో’. కలెక్షన్లలో దూసుకుపోతున్న ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అయితే ‘బ్రో’లో ఓ క్యారెక్టర్‌‌ పెద్ద దుమారమే రేపుతోంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలినట్లుగా ఉన్న ‘శ్యాంబాబు’ అనే  పాత్రలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ నటించారు. దీంతో అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడుతుండగా.. అంతే దీటుగా పృథ్వీ కౌంటర్ ఇస్తున్నారు. ఆయనేమన్నా ఆస్కార్ […]

Share:

మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన సినిమా ‘బ్రో’. కలెక్షన్లలో దూసుకుపోతున్న ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అయితే ‘బ్రో’లో ఓ క్యారెక్టర్‌‌ పెద్ద దుమారమే రేపుతోంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలినట్లుగా ఉన్న ‘శ్యాంబాబు’ అనే  పాత్రలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ నటించారు. దీంతో అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడుతుండగా.. అంతే దీటుగా పృథ్వీ కౌంటర్ ఇస్తున్నారు.

ఆయనేమన్నా ఆస్కార్ నటుడా?

జులై 28న ‘బ్రో’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. పవన్ స్టామినా, వివాదం కూడా తోడుకావడంతో హౌస్‌ఫుల్‌ షోలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ సభలో థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడారు. ‘శ్యాంబాబు’ పాత్ర, దానిపై వస్తున్న విమర్శలు, అంబాటి రాంబాబు గురించి ఆయన స్పందించారు. అంబటి రాంబాబు ఎవరో తనకు తెలియదని, ఆయనేమన్నా ఆస్కార్ సాధించిన నటుడా అని ప్రశ్నించారు.

‘‘శ్యాంబాబు పాత్రకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. పవన్‌ కల్యాణ్‌తో గతంలో మూడు సినిమాలు చేశా. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ గురించి మాటల్లో చెప్పలేను. అయితే నేను చేసిన పాత్ర రాజకీయ వివాదం అయిపోయింది. ఎక్కడ చూసినా శ్యాంబాబు, రాంబాబు వీడియోలు కనిపిస్తున్నాయి. ‘మంత్రి గారిని ఈ విధంగా డీగ్రేట్ చేయడమేంటి?’ అని కొందరు నన్ను అడిగారు. ఎవరండీ ఆ మంత్రి అంటే.. ‘అంబటి రాంబాబు’ అని చెప్పారు. ఆయనెవరో నాకు తెలీదని అన్నాను. అయినా ఇమిటేట్ చేయడానికి.. ఆయనేమీ ఆస్కార్ సాధించిన నటుడేమీ కాదు’’ అని అన్నారు.

ఓ పనికిమాలిన వెధవ పాత్ర

‘‘ఓ పనికిమాలిన వెధవ, బాధ్యతలేని వెధవ, బార్లలో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడు. ఇదీ మీ క్యారెక్టర్” అని దర్శకుడు సముద్రఖని తనకు చెప్పారని పృథ్వీ అన్నారు. ‘‘డైరెక్టర్ చెప్పింది నేను చేయాలి కదా. ఆ పాత్రకు న్యాయం చేశాను. శ్యాంబాబు సీన్ చూసి థియేటర్లలో నవ్వుతున్నారు. ఆ క్రెడిట్ అంతా మా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారిది. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది ఆ పాత్ర” అని అన్నారు. ఇప్పుడు శ్యాంబాబు పాత్ర గురించే చర్చ జరుగుతోందని, ఇంత మైలేజీ వస్తుందని అనుకోలేదని చెప్పారు.

ఇదీ అసలు వివాదం

ఈ ఏడాది సంక్రాంతి సంబురాల్లో భాగంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ చేశారు. బ్రో సినిమాలో ‘శ్యాంబాబు’ పాత్రధారి అచ్చం అంబటి వేసుకున్న టీషర్ట్‌నే ధరించి డ్యాన్స్‌ చేయడం వివాదానికి కారణమైంది. సోషల్ మీడియా, ప్రధాన న్యూస్‌ చానల్స్‌లో ప్రసారమైంది. దీంతో తననే ఇమిటేట్ చేశారంటూ అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ‘గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి” అని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌పై తాము కూడా సినిమా చేస్తామని చెప్పారు. హవాలా డబ్బుతో బ్రో సినిమా తీశారని ఆరోపిస్తూ.. ఢిల్లీలో ఫిర్యాదు చేస్తానని అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్ని సార్లు అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్లారు అని నెటిజన్లు , జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.