KCR:  పాములకు బలైపోవద్దు అంటున్న కేసీఆర్

KCR: తెలంగాణ (Telangana) రాష్ట్ర పార్టీ బీఆర్‌ఎస్ (BRS) ఇప్పటికే ఎన్నికల (Elections) సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా, తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వంతు కృషి చేస్తూ, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తమ జెండాను ఎగరేయాలని తాపత్రయపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana)లో నిర్వహించిన కొన్ని సర్వేల ప్రకారం, కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అంటూ హరీష్ రావు (T. Harish Rao) తన ధీమాని వ్యక్తం చేశాడు. […]

Share:

KCR: తెలంగాణ (Telangana) రాష్ట్ర పార్టీ బీఆర్‌ఎస్ (BRS) ఇప్పటికే ఎన్నికల (Elections) సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా, తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వంతు కృషి చేస్తూ, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తమ జెండాను ఎగరేయాలని తాపత్రయపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana)లో నిర్వహించిన కొన్ని సర్వేల ప్రకారం, కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అంటూ హరీష్ రావు (T. Harish Rao) తన ధీమాని వ్యక్తం చేశాడు. పలు జిల్లాలో ప్రచారాన్ని మరింత ముందుకు కొనసాగిస్తున్న కేసీఆర్ (KCR), జాగ్రత్తగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది. 

పాములకు బలైపోవద్దు అంటున్న కేసీఆర్: 

పాములూ, నిచ్చెనల ఆట అయిన వైకుంఠపాళిని ప్రస్తావిస్తూ, పాములకు బలైపోవద్దని, ప్రజలు తమ ఓటు (Vote) హక్కును వినియోగించుకునేటప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలో జాగ్రత్తగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (KCR) ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లలో జరిగిన బీఆర్‌ఎస్‌ (BRS) ప్రచార సభల్లో ప్రసంగించిన కెసిఆర్ (KCR), ఒక్కసారి తప్పటడుగు వేసే.. పాము ‘మింగిన’ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని.. అణచివేస్తారని గుర్తు చేశారు. కాంగ్రెస్ (Congress), బీజేపీలకు ఓటు వేసి ఆ తప్పు చేయొద్దు అంటూ కేసీఆర్ (KCR), తెలంగాణ (Telangana) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

రైతు (Farmer) బంధు, రైతు (Farmer) బీమా, 24×7 నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, వివిధ పంటలకు కనీస మద్దతు ధరను బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం అందించడం రైతు (Farmer)లకు ఉల్లాసాన్ని తెచ్చిపెట్టిందని, ఒకప్పటి ప్రభుత్వం కారణంగా రైతు (Farmer)లు అప్పుల ఊబిలో కూరుకుపోయి, బిఆర్ఎస్ ప్రభుత్వంలోని మెల్లమెల్లగా బయట పడుతున్నారని చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి (RevanthReddy), టీపీసీసీ మాజీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతు (Farmer)లపై విషం చిమ్ముతున్నారని, 24గంటలూ విద్యుత్ సరఫరా, రైతు (Farmer)బంధును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు కేసీఆర్ (KCR). వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) కూడా పట్టుబట్టారు, అయితే తమ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకించిందని, రైతు (Farmer)ల ప్రయోజనాలను కాపాడటం ద్వారా కేంద్రం నుండి అందవలసిన రూ. 5,000 కోట్ల గ్రాంట్లను కోల్పోయినప్పటికీ తమ బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఈ విషయంలో రాజీపడలేదు అంటూ ప్రసంగించారు కేసీఆర్ (KCR).

నిర్మల్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్ (KCR) మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ (BRS)  వివిధ మత వర్గాల మధ్య శాంతిని, మత సామరస్యాన్ని పెంపొందిస్తుందని, గత పదేళ్లుగా రాష్ట్రం శాంతియుతంగా ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు ద్వేషం, విభజన రాజకీయాలు ఆడుతున్నాయి అని విమర్శించారు కెసిఆర్ (KCR).

భైంసాలో ఇప్పటివరకు కర్ఫ్యూ, లాఠీ ఛార్జి కూడా జరగలేదని, భైంసా వివాదాలతో అట్టుడుకుతుందని కొన్ని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయని కేసీఆర్ (KCR) గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పరిధిలోని నిర్మల్, ముధోలే, భైంసా, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో ముస్లింలు, హిందువులు శాంతియుతంగా జీవిస్తున్నారని కేసీఆర్ (KCR) అన్నారు. కేసీఆర్ (KCR)‌ జీవించి ఉన్నంత కాలం తెలంగాణ (Telangana) సెక్యులర్‌, శాంతియుత రాష్ట్రంగా ఉంటుందని పేర్కొన్నారు తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR). 

ఎన్నికల జోరు: 

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల (Elections) జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో (Manifesto) గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Elections) సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. అయితే ఇటీవల తెలంగాణ (Telangana) బిఆర్ఎస్(BRS) చేసిన మేనిఫెస్టో (Manifesto) రిలీజ్ చేశారు తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కెసిఆర్. ఇటీవల మాట్లాడిన హరీష్ రావు (T. Harish Rao), కేసీఆర్ (KCR) ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ (Congress) కాపీ కొడుతుందని విమర్శించారు హరీష్ రావు (T. Harish Rao). బీఆర్‌ఎస్ (BRS) మేనిఫెస్టో సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చిందని, కోటి మందికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ (KCR)‌కు పగ తీర్చుకునే మనస్తత్వం ఉంటే సగం మంది కాంగ్రెస్ (Congress) నేతలు కటకటాల వెనకే ఉండేవారని కూడా గుర్తు చేశారు హరీష్ రావు (T. Harish Rao).