ఫుడ్ డెలివరీ చేసి మహిళకు ప్రపోజ్ చేసిన డొమినోస్ డెలివరీ బాయ్

ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు లవ్ ప్రపోజ్ చేశాడు ఓ డెలివరీ ఏజెంట్….దీనిపై సీరియస్ అయినా ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై ఆ డెలివరీ సంస్థ స్పందన సరిగా లేకపోవడంతో   పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆన్లైన్లో ఫుడ్ కానీ… ఇతర వస్తువులు కానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మన నెంబర్ కంపెనీ తో పాటు డెలివరీ ఏజెంట్ కు చేరుతుంది. కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని.. […]

Share:

ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు లవ్ ప్రపోజ్ చేశాడు ఓ డెలివరీ ఏజెంట్….దీనిపై సీరియస్ అయినా ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై ఆ డెలివరీ సంస్థ స్పందన సరిగా లేకపోవడంతో   పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆన్లైన్లో ఫుడ్ కానీ… ఇతర వస్తువులు కానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మన నెంబర్ కంపెనీ తో పాటు డెలివరీ ఏజెంట్ కు చేరుతుంది. కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఈ సంఘటన రుజువు చేసింది. డొమినోస్ డెలివరీ బాయ్ ఓ మహిళకు ఫుడ్ డెలివరీ చేశాడు. ఆ తరువాత “నేను నిన్ను ఇష్టపడుతున్నాను” అంటూ వాట్సప్ లో ప్రపోజ్ చేశాడు.

దీంతో ఆ మహిళ కంప్లైంట్ చేసింది అయినా కూడా డొమినోస్ యాజమాన్యం చర్య  తీసుకోనందున ఉత్తర ప్రదేశ్   పోలీసుల జోక్యం చేసుకున్నారు. కనిష్క  అనే ట్విట్టర్ యూజర్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది.. కబీర్ అనే డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత ఆమెతో వాట్సాప్ లో చేసిన చాట్ పై కనిష్క  ఆందోళన చెందారు.  క్షమించండి నా పేరు కబీర్, నేను నిన్న మీకు పిజ్జా ఇవ్వడానికి వచ్చాను… అది నేనే… ” నేను నిన్ను ఇష్టపడుతున్నాను ” అంటూ ఆమెకు మెసేజ్ పంపారు.

డెలివరీ కోసం కంపెనీ అందించిన తన సమాచారాన్ని కబీర్ దుర్వినియోగం చేశాడని కనిష్క ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీస్ హెల్ప్ లైన్  112 స్పందించింది. కనిష్క  అధికారులతో అతని సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసుకున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ సమాచారాన్ని పంచుకోవడానికి డొమినోస్ నిరాకరించిందని… దీనిపై కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయపోరాటం చేస్తానని కనిష్క చెబుతున్నారు. ఈ ఘటనపై నెటిజెన్స్  ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

మొబైల్ వాడకం ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రతిదీ ఆన్లైన్ లోకి మారుతుంది. తినే తిండి నుంచి ధరించే బట్టలు,  కూరగాయలు ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా అరచేతిలో మొబైల్.. అందులో సంబంధిత యాప్ ఉంటే చాలు.. ఆర్డర్ పెట్టిన వెంటనే మన ఇంటి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.. కానీ డెలివరీ కోసం మన ఇంటి అడ్రస్ తో పాటు మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలకు అందిస్తున్నాం. అయితే కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సంఘటన రుజువు చేసింది..

ఇకపోతే బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా డొమినోస్ ఇండియా ఏ విధమైన దుష్ప్రవర్తన లేదా వేధింపుల పట్ల జీరో- టాలరెన్స్ పాలసీకి  నిస్సందేహంగా కట్టుబడి ఉంది. కాగా తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసులు. మరి డెలివరీ బాయ్ చేసిన పనికి కనిష్క పూర్తిస్థాయిలో మనస్థాపం చెందుతోంది మరి దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అతడికి ఎటువంటి శిక్ష విధిస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది.