టర్కీ లాగే ఇండియా పేరు కూడా మారనుందా..?

ఈ ఏడాది జీ20 సమిట్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. అయితే, ఈ సదస్సు ఎంత సక్సెస్‌ అయిందో దేశ పేరు మార్పుపై కూడా  అంతకంటే సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మారుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ జీ20 సమిట్‌లో ప్రెసిడెంట్‌ డిన్నర్‌ మీట్‌ ఇన్విటేషన్‌లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటం, అలాగే, ప్రధాని మోదీ నేమ్ ప్లేట్‌పై ‘భారత్‌ ’అని ఉండటం కూడా ఈ వార్తలకు బలం […]

Share:

ఈ ఏడాది జీ20 సమిట్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. అయితే, ఈ సదస్సు ఎంత సక్సెస్‌ అయిందో దేశ పేరు మార్పుపై కూడా  అంతకంటే సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మారుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ జీ20 సమిట్‌లో ప్రెసిడెంట్‌ డిన్నర్‌ మీట్‌ ఇన్విటేషన్‌లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటం, అలాగే, ప్రధాని మోదీ నేమ్ ప్లేట్‌పై ‘భారత్‌ ’అని ఉండటం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. అనుకున్నట్లు గానే త్వరలో దేశం పేరు మార్పు ఉండబోతోంది. 

భారత్ దేశ సంస్కృతికి నుంచి ఉద్భవించింది…

ఇండియా అనేది బ్రిటిష్‌ కాలంలో వాడిన పేరు. భారత్‌ అనేది దేశ  సంస్కృతి నుంచి ఉద్భవించింది. అయితే, దేశం పేరు మారుస్తున్నారని వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల నుంచే కాకుండా సాధారణ జనాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. సోషల్‌ మీడియాలో కూడా అల్లకల్లోం అయ్యింది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పేరు మార్పు చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరోవైపు ‘భారత్‌’ అనే పదం అధికార ‘భారతీయ జనతా పార్టీ’ని ప్రతిధ్వనిస్తుంది. 

బ్రిటీష్‌ పరిపాలన కాలంలో ఉన్న పలు దేశాల పేర్లు ఇప్పుడు మారాయి. అందులో బర్మా మయన్మార్‌ (1989)లో మారింది. అలాగే, రోడేషియా జింబాబ్వే (1980), సిలోన్‌ శ్రీలంక (1972)గా పేర్లు మార్చుకున్నారు. ఇన్ని దేశాల పేర్లు మారినప్పుడు భారతదేశ పేరు ఎందుకు మార్చకూడదని కొందరు వాదిస్తున్నారు. గతేడాది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తమ దేశ పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తమ దేశం టర్కీ కాదని, తుర్కియో అని ప్రకటించారు. దీనికి ఐక్యరాజ్య సమితి కూడా ఓకే చెప్పింది. కానీ, ఇంగ్లీష్‌ మాట్లాడేవారు దీనిని స్వీకరిచడం చాలా కష్టంగా ఉంది. బ్లూమ్‌బర్గ్ న్యూస్‌లో ఇప్పటికీ టర్కీ అనే పిలుస్తున్నారు. మరోవైపు టర్కీష్‌ ఎయిర్‌లైన్స్‌  అధికారికంగా పేరు మార్చారు. కానీ, ఆ దేశ విమానాలపై ఇప్పటికీ టర్కీగానే ఉంది. 

ట్విట్టర్‌‌లో లొల్లి..

ఇప్పుడు ఇండియా పేరు భారత్‌ గా మారితే వెబ్‌ డొమైన్‌(.bh)గా మార్చాల్సి ఉంటుందని ట్విట్టర్‌‌ యూజర్‌‌ ఒకరు పేర్కొన్నారు. అయితే, ఈ .bh అనే డొమైన్‌ చాలా కాలంగా బహ్రెయిన్‌ దేశం వద్ద ఉంది. మరోవైపు బ్రిక్స్‌ (BRICS) దేశాల్లో పేరు ఇండియా పేరు Iని ఇండికేట్‌ చేస్తుంది. ఒకవేళ పేరు మారిస్తే ఇప్పుడు అందులో BRBCSగా మార్చాల్సి ఉంటుంది. అలాగే, బ్రిక్స్‌ కూటమిలో వచ్చే ఏడాది మరిన్ని దేశాలు జాయిన్ కానున్నాయి. అవి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ బ్రిక్స్‌లో కలవనున్నాయి. దీంతో ఇప్పుడు ఆ కూటమి పేరు BARBIECUES (బార్బీక్యూ)లుగా మారనుందని మరో యూజర్‌‌ వెల్లడించాడు. మరోవైపు, దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ‘INDIA’ కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ప్రధాని మోదీ కావాలనే దేశం పేరును ‘భారత్’ అని మార్చారని ఇంకో యూజర్‌‌ పేర్కొన్నాడు. 

పాకిస్తాన్‌ ‘ఇండియా’గా మారితే..?

ఇక్కడ ఇండియాకు భారత్‌ అనే పేరు ఎంచుకుంటే కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. భారతదేశాన్ని ‘హిందూస్థాన్‌’ అని చేయాలని కొంతమంది నుంచి డిమాండ్‌ ఉంది. అయితే, ఈ పేరు పర్షియన్‌ మూలాలను కలిగి ఉంది. అలాగే, ఇండియా అనే పేరు మైథలాజికల్‌ గా ఇండస్‌ రివర్‌‌ (సింధు నది) నుంచి పుట్టింది. కానీ ఇప్పుడు ఈ నది ఎక్కువగా పాకిస్తాన్‌లో ప్రవహిస్తుంది. దేశంలో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ను ప్రధాని మోదీ గద్దె దించాలని చూస్తే పేరు మార్పు ఉంటుంది. అయితే, ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, సింధు నది ఎక్కువగా పాకిస్తాన్‌లో ప్రవహిస్తుంది. . కాబట్టి, మన భారతదేశం పేరు మార్చితే పాకిస్తాన్‌ కూడా తమ దేశ పేరును ‘ఇండియా’గా మార్చుకునే అవకాశం ఉందా? అని పలువురు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, టర్క్స్‌ ఎల్లప్పుడూ తమ దేశాన్ని తుర్కియో అని పిలుస్తారు. ఇప్పుడు ఇండియాలో కూడా భారత్‌ అనే పేరును  చాలా మంది ఉపయోగిస్తున్నారు. కానీ, ఆ పేర్లు ప్రపంచంలో వాడుకలో రావడానికి, జనాలకు అలవాటు పడటానికి చాలా టైమ్‌ పడుతుంది.