నకిలీ రూ.500 నోట్ల‌తో బిల్లు క‌ట్టిన పేషెంట్

ఒక నకిలీ 500 నోటు మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు దానిని పోలీసులకు రిపోర్ట్ చేస్తారా లేదా అలాగే దాచుకుంటారా? డాక్టర్ వోరా కి ఇదే పరిస్థితి ఏదురైతే, తను అప్సెట్ అవ్వకుండా,దాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. తను ఈ విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా తెలియజేశాడు. డాక్టర్ వోరా ఈ విషయాన్ని చాలా ఫన్నీగా పోస్ట్ చేశాడు.  డాక్టర్ వోరా ఫన్నీ ట్వీట్: పేషెంట్లు తెలివి మీరు పోయారు, స్కూల్ ప్రాజెక్ట్ […]

Share:

ఒక నకిలీ 500 నోటు మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు దానిని పోలీసులకు రిపోర్ట్ చేస్తారా లేదా అలాగే దాచుకుంటారా? డాక్టర్ వోరా కి ఇదే పరిస్థితి ఏదురైతే, తను అప్సెట్ అవ్వకుండా,దాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. తను ఈ విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా తెలియజేశాడు. డాక్టర్ వోరా ఈ విషయాన్ని చాలా ఫన్నీగా పోస్ట్ చేశాడు. 

డాక్టర్ వోరా ఫన్నీ ట్వీట్:

పేషెంట్లు తెలివి మీరు పోయారు, స్కూల్ ప్రాజెక్ట్ కు యూస్ చేసే నోట్లనే నా రిసెప్షనిస్ట్ తెలియకుండా తీసుకుంది. డాక్టర్లనే మోసం రేంజ్కి పేషెంట్లు వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో కాస్త ఊహించుకోండి అని తను షేర్ చేశాడు. 

డాక్టర్ వోరా ఈ విషయంలో ఫస్ట్రేట్ అవుతున్నానని చెప్పగానే చెప్పాడు. డాక్టర్ నే ఇలా చేశారంటే బయట పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది, ఏది ఏమైనా ఈ 500 నోటుని ఒక మెమొరీగా నా దగ్గరే ఉంచుకుంటున్న೨ అని షేర్ చేశాడు. దీని గురించి ఒక యూజర్ చిలిపిగా కామెంట్ చేసింది తను ఏం కామెంట్ చేసిందంటే డాక్టర్ కే ఒక మర్చిపోలేని మెమొరీ ఇచ్చిందని కామెంట్ చేసింది. ఈ విషయం గురించి ఒక్కొక్క యూజర్ ఒక్కోలా కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ డాక్టర్ షేర్ చేసింది వైరల్ గా మారింది. 

డాక్టర్లని పేషెంట్లు మోసం చేయొచ్చా?:

నిజం చెప్పాలంటే డాక్టర్ అనే వాడు లేకుంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్స్ మనకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా దాన్ని క్లియర్ చేస్తారు. కానీ కొంతమంది డాక్టర్స్ చాలా కమర్షియల్ గా ఉంటున్నారు. వాళ్లు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా హాస్పిటల్స్ లో బిల్స్ రూపంలో దోచుకుంటున్నారు. చాలామంది పేషంట్లకు డాక్టర్ల వల్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డాక్టర్ల వల్ల పేషెంట్లు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది డాక్టర్లు తక్కువ డబ్బులు ఫీజు గా తీసుకొని ఎక్కువ రేటు ఉన్న మెడిసిన్స్ రాస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ ఫార్మసీలలో లాభాలు వస్తున్నాయి. ఇలా డాక్టర్లు రకరకాలుగా సంపాదిస్తున్నారు. కొంతమంది డాక్టర్ల వల్ల వోరా లాంటి డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పేషంట్ కి డాక్టర్లు అంటే కోపం ఉండొచ్చు. అందుకే ఇలాంటి మోసం చేసి ఉండొచ్చు. 

కానీ డాక్టర్లను ఇలా చేయడం తప్పు. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ ని డాక్టర్లు క్లియర్ చేస్తున్నారు. మనకు ఏ విధమైన రోగం వచ్చినా డాక్టర్లు త్వరగా దాన్ని తగ్గిస్తున్నారు. అలాంటి డాక్టర్లను ఇలా మోసం చేయడం తప్పు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎదురైతే డాక్టర్లు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆన్లైన్లోనే పేషెంట్ డబ్బులు పంపాలి లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అప్పుడు గ్రామీణ ప్రాంత పేషెంట్లు చాలా అవస్థలు పడతారు. ఎందుకంటే వాళ్లకు మొబైల్స్ వాడడం రాదు. అందుకే ఇలాంటి సంఘటనలు ఇక ముందైనా తగ్గాలి అని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఆన్లైన్ విధానంలోనే పేమెంట్ చేయాలనే కండిషన్స్ రావచ్చు. ఇలాంటి తప్పులు చేయకుండా అందరం జాగ్రత్త పడదాం.