నీ బిడ్డ ప్రాణాలతో కావాలా లేదా శవమై రావాలా?

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ వారిపై దాడి చేస్తూ సమీప పొలాల్లోకి కొందరు దుండగులు తీసుకెళ్లుతున్న వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపిందిఇదిలా ఉండగా.. మణిపూర్‌లో మరో తల్లి తన గర్భశోకాన్ని వివరిస్తూ కన్నీరైంది. ‘నీ బిడ్డ ప్రాణాలతో కావాల? శవమై రావాలా? అని ఓ మహిళ అడిగింది. ఆ వెంటనే ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత నా బిడ్డను రేప్ చేసి చంపేశారని తెలిసింది.’ అని ఓ తల్లి ఆక్రందనతో అన్నమాటలివి. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి ఏరియాలో […]

Share:

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ వారిపై దాడి చేస్తూ సమీప పొలాల్లోకి కొందరు దుండగులు తీసుకెళ్లుతున్న వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపిందిఇదిలా ఉండగా.. మణిపూర్‌లో మరో తల్లి తన గర్భశోకాన్ని వివరిస్తూ కన్నీరైంది. ‘నీ బిడ్డ ప్రాణాలతో కావాల? శవమై రావాలా? అని ఓ మహిళ అడిగింది. ఆ వెంటనే ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత నా బిడ్డను రేప్ చేసి చంపేశారని తెలిసింది.’ అని ఓ తల్లి ఆక్రందనతో అన్నమాటలివి. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి ఏరియాలో ఈ ఘటన మే 4వ తేదీన జరిగింది. 

అసలు ఎం జరిగింది అంటే.. ….

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి ఏరియాలో ఈ ఘటన మే 4వ తేదీన జరిగింది తన గర్భశోకాన్ని వివరిస్తూ కన్నీరైంది ఓ తల్లి  ‘నీ బిడ్డ ప్రాణాలతో కావాల? శవమై రావాలా? అని ఓ మైతేయి మహిళ  అడిగింది అని తరువాత తన కాల్ ని కట్ చేసింది అని ఆమె బాధతో వెల్లడించారు. ఆ తర్వాత నా బిడ్డను రేప్ చేసి చంపేశారని . అదే రోజున ఇదే జిల్లాలో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వైరల్ వీడియో ద్వారా బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే గ్రామానికి చెందిన 21 ఏళ్లు, 24 ఏళ్ల ఇద్దరు యువతులు ఇంఫాల్‌లో ఓ కార్ వాష్ ఫెసిలిటీలో పని చేస్తున్నారు. వారిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఓ మూక మే 4వ తేదీన దారుణంగా హత్య చేసింది.

ఈ ఘటన తర్వాత మృతి చెందిన ఇధ్దరు యువతుల్లో ఒకరి తల్లి మే 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, మే 16వ తేదీన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆ తల్లి బాధని వ్యక్తం చేసింది.

ఇల్లు గడవడానికి, ఆర్థిక సహాయపడటానికి నా కూతురు ఇంఫాల్‌లోని ఓ కార్ వాష్ ఫెసిలిటీలో పని చేసేది. మా గ్రామానికే చెందిన మరో యువతితో కలిసి అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండేది’ అని ఆమె చెప్పింది. ‘హింస చెలరేగడంతో నేను భయాందోళనలకు గురయ్యాను. నా బిడ్డకు తరుచూ ఫోన్ చేశాను. కానీ, ఆమె నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నా ఫోన్‌ను ఓ మైతేయి మహిళ లిఫ్ట్ చేసింది. నీ బిడ్డ నీకు ప్రాణాలతో కావాలా? విగత జీవై కావాలా? అని అడిగింది. ఫోన్ కట్ చేసింది’ అని ఆ తల్లి కన్నీరు రాలుతుండగా చెప్పింది. ఆ సమయంలో తన గుండె బద్ధలైందని పేర్కొంది.

‘ఆ తర్వాత తెలిసింది నా బిడ్డను చంపేశారని.. నా కేసు గురించి కూడా పోలీసులు లేదా ఇతర ఏ అధికారుల నుంచీ సమాచారం రాలేదు’ అని ఆమె చెప్పింది.

పోలీసుల నుండి ఎటువంటి సమాచారం రాలేదు ….

ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన తర్వాత తీసుకున్న చర్యల గురించి అడిగినప్పుడు,పోలీసుల నుండి లేదా ఇతర అధికారుల నుండి కేసు గురించి మాకు ఎటువంటి సమాచారం అందలేదు” అని ఆమె చెప్పారు.

ఫ్‌ఐఆర్ కాపీలో, మైతేయి యూత్ ఆర్గనైజేషన్‌తో సహా వివిధ సంస్థలకు చెందినవారు అని ఆరోపించిన దుర్మార్గులపై 302 (హత్య), 375 (రేప్), మరియు 366 (కిడ్నాప్) సహా IPCలోని వివిధ సెక్షన్ల కింద బుక్ చేసినట్లు తెలుస్తుంది .

తన కుమార్తె మరణ వార్త తెలియగానే తమ గ్రామంపై దాడి చేసి తగులబెట్టారని బాధితురాలి తల్లి తెలిపారు. ఆమె కుటుంబం అడవికి పారిపోయి సహాయ శిబిరంలో నివసించడం ప్రారంభించింది.బాధితురాలి తండ్రి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, కుటుంబానికి తమ కుమార్తె మృతదేహం ఇంకా అందలేదని ఆమె చెప్పారు.