విక్రమ్, ప్రజ్ఞానలను నిద్రలేపే పనిలో ఇస్రో

భారతదేశానికి చెందిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో అడుగుపెట్టి రీసెర్చ్ చేస్తూ ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటికే నిద్రలో ఉన్న చంద్రయాన్-3 మిషన్ కి సంభందించిన విక్రమ్ మరియు ప్రజ్ఞాన్‌లను, సెప్టెంబర్ 22న, చంద్రుని మీద తెల్లవారుజామున, నిద్ర లేపే పనిలో పడనుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).  సక్సెస్ అయితే.. ఇస్రోకి మరిన్ని ప్రాజెక్ట్స్:  ల్యాండర్-రోవర్ అనుకున్నట్లుగానే ఈ నెల ప్రారంభంలో 12 రోజులు (చంద్ర రాత్రులు మరియు […]

Share:

భారతదేశానికి చెందిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో అడుగుపెట్టి రీసెర్చ్ చేస్తూ ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటికే నిద్రలో ఉన్న చంద్రయాన్-3 మిషన్ కి సంభందించిన విక్రమ్ మరియు ప్రజ్ఞాన్‌లను, సెప్టెంబర్ 22న, చంద్రుని మీద తెల్లవారుజామున, నిద్ర లేపే పనిలో పడనుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). 

సక్సెస్ అయితే.. ఇస్రోకి మరిన్ని ప్రాజెక్ట్స్: 

ల్యాండర్-రోవర్ అనుకున్నట్లుగానే ఈ నెల ప్రారంభంలో 12 రోజులు (చంద్ర రాత్రులు మరియు రోజులు సాధారణంగా 14 భూమి రోజులు)తర్వాత మిషన్ నిద్రలోకి జారుకుంది. విక్రమ్ మరియు ప్రజ్ఞాన్‌లను నిద్ర నుండి ఇస్రో మేల్కొల్పగలిగితే, అది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుతుంది. అంతేకాకుండా, వీటి సక్సెస్ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికి అంతరిక్ష సంస్థకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది. 

అనుకున్నదానికన్నా ముందే నిద్రలోకి: 

విక్రమ్-ప్రజ్ఞాన్ మిషన్‌ను ముందుగా అనుకున్న 14 ఎర్త్ డేస్ కంటే రెండు రోజుల ముందుగానే ముగించాలని, సూర్యుని పొజిషన్ బట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండ్ అయినప్పుడు, శివ శక్తి ల్యాండింగ్ సైట్‌లో అప్పటికే సూర్యుడు ఉదయించాడు, 8.75 డిగ్రీల ఎత్తుతో ఉంటూ సరైన పరిస్థితులను అందించాడు. 

విక్రమ్- ప్రజ్ఞాన్ సర్వీసులకు అంతరాయం లేకుండా పనిచేయడానికి సూర్యుని ఎత్తుకు సంబంధించి నిర్దిష్ట కోణాన్ని 6 నుండి 9 డిగ్రీల మధ్య ఒకేలా ఉంచడం అనేది చాలా కీలకమైన అంశం. సరైన మార్జిన్‌లను కరెక్ట్ గా ఉంచేందుకు, చంద్రయాన్-3 ల్యాండర్-రోవర్ కి సంబంధించిన స్లీప్ మోడ్ కొంచెం ముందుగా ప్రారంభించడం జరిగింది. 

ముందున్న మూడు సవాళ్లు: 

క్రయో-టాలరెంట్ లిథియం-అయాన్ బ్యాటరీల ఇన్స్టాలేషన్, ఇది వాటి పనితీరుకు ఆటంకం కలగకుండా చంద్రుడి వాతావరణంలోని విపరీతమైన చలిలో కూడా తన పనితీరును చక్కగా చూపిస్తుంది. ఇది మిషన్ అంతటా స్థిరమైన విద్యుత్ అందించేలా చేస్తుంది.

ఈ ఆవిష్కరణకు ఎడిషనల్ గా ఉన్నా క్రియో-టాలరెంట్ ఎలక్ట్రానిక్స్,చంద్రుని ఉపరితలంపైకి సూర్యరశ్మి పడిన తర్వాత, కార్యకలాపాలను సజావుగా పునఃప్రారంభించేలా చేస్తుంది. నిద్రలో నుంచి మేల్కొన్న అనంతరం, మరోసారి మిషన్ తన పనితీరును చూపించడమే కీలకమైన అంశం.

దీనికి తోడుగా, క్రయో-ఆపరబుల్ ఎలక్ట్రానిక్స్ అమలు చేయడం వల్ల, దాని ద్వారా కోల్డ్ స్టార్ట్‌ని ప్రారంభించి, ఎక్కువ కాలం ఒకే చోట కదలకుండా ఉన్న తర్వాత కూడా శక్తిని తనకు తానుగా పునరుద్ధరించే సామర్థ్యాన్ని అందిస్తుంది.

మరో ఇస్రో మిషన్: 

సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో రీసెర్చ్ చేసేందుకు సముద్రయాన్ని మిషన్ రూపుదిద్దుకోంటోంది. అత్యాధునిక సబ్‌మెర్సిబుల్ ‘మత్స్య 6000’ నీటి అడుగున పరిశోధనలో భాగం అవుతుందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కిరెన్ రిజిజు ఇటీవల వెల్లడించారు. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో అభివృద్ధి చేసిన ఈ మిషన్లో సుమారు ముగ్గురు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. సముద్ర వనరులపై సమగ్ర అధ్యయనం మరియు సముద్ర జీవవైవిధ్యాన్ని అంచనా వేయడంపై మత్స్య 6000 మిషన్ అధ్యయనం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

‘సముద్రయాన్’ మిషన్ ‘బ్లూ ఎకానమీ’కి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించిన మిషన్. సముద్ర పర్యావరణ వ్యవస్థ లోటుపాట్లను అంచనా వేసే విధంగా తయారు చేయబడింది సముద్రయాన్ మిషన్. అంతే కాకుండాఈ ప్రాజెక్ట్ సముద్ర పర్యావరణ వ్యవస్థకు ఎటువంటి హాని తలపెట్టదు అని హామీ ఇస్తూ, రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.