Chandrababu: చంద్రబాబు లేఖపై డీజీపీ సీరియస్..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) జైలు నుంచి విడుదలయ్యారని రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail) నుంచి లేఖ విడుదలైన విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) తెలిపారు. ఇందులో నిజా నిజాలు ఏమిటో తేలాల్సి ఉందన్నారు డీజీపీ. అటు తర్వాతే చర్యలు ఉంటాయన్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు భద్రత(Chandrababu security)కు ఎలాంటి ఢోకా లేదన్న డీజీపీ.. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి […]

Share:

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) జైలు నుంచి విడుదలయ్యారని రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail) నుంచి లేఖ విడుదలైన విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) తెలిపారు. ఇందులో నిజా నిజాలు ఏమిటో తేలాల్సి ఉందన్నారు డీజీపీ. అటు తర్వాతే చర్యలు ఉంటాయన్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు భద్రత(Chandrababu security)కు ఎలాంటి ఢోకా లేదన్న డీజీపీ.. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి కోరలేదన్నారు.

కుటుంబ సభ్యులతో ములాఖత్(Mulakat) సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన అభిప్రాయాలు, ఆలోచనలను రాష్ట్ర ప్రజలకు లేఖ రాయాలని కోరారు. దీంతో.. ఆయన చెప్పిన అంశాలను పొందుపరిచి చంద్రబాబు పేరిట కుటుంబ సభ్యులు లేఖను విడుదల చేశారు. ఈ లేఖ చదివిన టీడీపీ(TDP) శ్రేణులు, చంద్రబాబు(Chandrababu) మద్దతుదారులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌‌మెంట్ కేసు(Skill Development Case)లో అరెస్టైన చంద్రబాబు నాయుడు గత నెలన్నరకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం తెలిసిందే. తాను జైల్లో లేనని ప్రజల గుండెల్లో ఉన్నా… తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు(Rajahmundry Jail) నుంచి ఆదివారం చంద్రబాబు నాయుడి లేఖ(Letter) విడుదల చేశారు. అటు లేఖపై స్పందించిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల చేయలేదని స్పష్టంచేయడంతో దీనిపై వివాదం నెలకొంది.

Read More: Karnataka: ఈ జిల్లా కర్ణాటక రాజధానిలో భాగమేనా?

ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారని(Released) చెప్తున్న లేఖపై విచారణ జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. చంద్రబాబు లేఖ వ్యవహారం, జైల్లో భద్రతపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జైలు నుంచి ఎటువంటి లేఖ బయటకు వెళ్లలేదని జైలు అధికారులు చెప్తున్నారని రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు .విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో చర్యలుంటాయని అన్నారు. జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. 

చంద్రబాబు భద్రత కోసం జైల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసిన లేఖపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి(Bhuvaneshwari) త్వరలో చేపట్టబోయే నిజం గెలవాలి యాత్రపైనా డీజీపీ స్పందించారు. ఈ యాత్ర కోసం టీడీపీ నేతలు ఇప్పటివరకూ ఎలాంటి అనుమతి కోరలేదన్నారు. అలాగే టీడీపీ(TDP) నిరసనల్ని పోలీసులు అడ్డుకుంటున్నారన్న విమర్శలపై స్పందిస్తూ..పోలీసులు ఎక్కడా వారిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.

నారా లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్..

ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్(Mulakat) అయ్యారు. నారా లోకేష్‌(Nara Lokesh), బ్రాహ్మణి(Brahmini) చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. జనసేన-టీడీపీ(Janasena-TDP) ఉమ్మడి కార్యచరణ భేటీపై బాబుతో లోకేష్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం సోమవారం రాజమండ్రిలో మధ్యాహ్నం 3 గం.లకు జరిగింది.

ఈ సమావేశానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నారా లోకేశ్, బ్రాహ్మణితో ములాఖత్ సందర్భంగా చంద్రబాబు కోరారని టీడీపీ నేత చినరాజప్ప మీడియాకు తెలిపారు.

తాను జైల్లో లేను ప్రజల గుండెల్లో ఉన్నా… తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం చంద్రబాబు నాయుడి లేఖ విడుదల చేశారు. అటు లేఖపై స్పందించిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల చేయలేదని స్పష్టంచేయడంతో దీనిపై వివాదం నెలకొంది. చంద్రబాబు నాయుడి పేరుతో నారా లోకేశ్ ఈ ఫేక్ లేఖను విడుదల చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై విచారణ జరిపిస్తామని ఏపీ డీజీపీ (DGP) ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.