సీఎం ఇలాకాలో దళిత పశుసంవర్ధక శాఖ అధికారి దారుణ హత్య..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే ఓ దళిత ప్రభుత్వ అధికారి హత్య జరగడం సంచలనం రేపుతోంది.   పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుడు డాక్టర్ చిన్న అచ్చెన్న కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో… అదృశ్యమైన 12 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో అచ్చెన్న మృతదేహం బయటపడింది. కాగా.. అచ్చన్న మృతదేహం దొరికిన  తర్వాత కూడా కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష నిర్వహించి..  అచ్చెన్న మృతదేహాన్ని […]

Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే ఓ దళిత ప్రభుత్వ అధికారి హత్య జరగడం సంచలనం రేపుతోంది.  

పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుడు డాక్టర్ చిన్న అచ్చెన్న కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో… అదృశ్యమైన 12 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో అచ్చెన్న మృతదేహం బయటపడింది. కాగా.. అచ్చన్న మృతదేహం దొరికిన  తర్వాత కూడా కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష నిర్వహించి..  అచ్చెన్న మృతదేహాన్ని హడావిడిగా ఇవ్వడ పలు అనుమానాలకు తెర తీసింది.. 

అసలు విషయం వేరే.. 

కడప బహుళార్థ పశు వైద్యశాలలో ఉపసంచాలకుడిగా విధులు నిర్వహిస్తున్న అచ్చెన్నకు.. అదే వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్‌కు మధ్య గత ఆరునెలలుగా విబేధాలు ఉన్నాయి. సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్ విధులు నిర్వర్తించే విధానంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలను, నిబంధనలను సక్రమంగా పాటించడంలేదని.. తనకు కూడా ఏమాత్రం సహకరించట్లేదని ఆయన మీద కంప్లైంట్ చేశారు. 

వాళ్ళు అచ్చన్న తమనే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పైఅధికారులకు కంపైంట్ చేశారు. దాంతో త్రిసభ్య కమిటీ విచారణ చేయగా.. సరెండర్ చేసిన ఆ ముగ్గురినీ విధుల్లో తీసుకోమని పైఅధికారులు అచ్చెన్నకు సూచించారు.  అందుకు అచ్చెన్న ఒప్పుకోలేదు. ఈ ఘటన  జరిగిన కొద్ది రోజులకే అచ్చెన్న అదృశ్యం కావడంతో ఆయన కుటుంబ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 

ఆ ముగ్గురిపైనే అనుమానం..

సురేంద్రనాథ్ సుభాష్ చంద్రబోస్, శ్రీధర్ లింగారెడ్డి, బెనర్జీలపై అనుమానం ఉందని.. అచ్చెన్న కొడుకు ఇచ్చిన కంప్లైంట్‌తో ఈనెల 14వ తేదీన కేసు నమోదు చేస్తే 24వ తేదీ వరకు దర్యాప్తు చేయకపోవడం గమనించాల్సిన అంశం అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.  అన్నమయ్య జిల్లా రామాపూరం మండలం గువ్వల చెరువు గట్టున ఉన్న రహదారి గోడ కింద ఓ మృతదేహం దొరికింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం అచ్చెన్నదిగా గుర్తించారు. ఆయన హత్యకు గురైనట్లు తెలిపారు. కడపలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గరలోని చర్చి వద్ద నుంచే నిందితులు అచ్చెన్నను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. 

బాధితులకు అండగా..

అచ్చెన్న కేసు విషయంలో పోలీసులు ముందు నుంచి చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఆయన బ్రతికి ఉండేవారని బాధపడుతున్నారు వారి కుటుంబ సభ్యులు. కనీసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా నిందితులు ఎవరో గుర్తించేందుకు వీలుండేది. పోలీసులు   నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అచ్చెన్న అదృశ్యంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదు.  అచ్చెన్న హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అచ్చెన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కడపలోని వీపీసీ ఎదుట అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు.  అచ్చెన్న మృతికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.. జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పశుసంవర్ధక శాఖలో పని చేసే వారు బాధ్యులైనట్లు తేలితే చర్యలకు వెనుకాడమని.. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అచ్చెన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.