తాగ‌డానికి డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని భార్య‌ను చంపేసాడు

హైదరాబాదులో మరో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం కొనుక్కునేందుకు తనకు రెండు వందల రూపాయలు ఇవ్వలేదని చెప్పి భర్త తన భార్య ప్రాణాన్ని తీశాడు.  చంద్రయాన్ గుట్టలో దారుణం:  పోలీసులు చెప్పిన దాని ప్రకారం, ఫర్జానా బేగం మరియు అజర్ భార్యాభర్తలు. వారు చంద్రయాన్ గుట్టలోని మిల్లెట్ కాలనీలో ఒక ఇంట్లో కాపురం ఉంటున్నారు. అయితే మంగళవారం సాయంత్రం, అజర్ మద్యం కొనుక్కునేందుకు 200 రూపాయలు తన భార్యని అడుగుతాడు. అదే సందర్భంలో తన భార్య డబ్బులు […]

Share:

హైదరాబాదులో మరో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం కొనుక్కునేందుకు తనకు రెండు వందల రూపాయలు ఇవ్వలేదని చెప్పి భర్త తన భార్య ప్రాణాన్ని తీశాడు. 

చంద్రయాన్ గుట్టలో దారుణం: 

పోలీసులు చెప్పిన దాని ప్రకారం, ఫర్జానా బేగం మరియు అజర్ భార్యాభర్తలు. వారు చంద్రయాన్ గుట్టలోని మిల్లెట్ కాలనీలో ఒక ఇంట్లో కాపురం ఉంటున్నారు. అయితే మంగళవారం సాయంత్రం, అజర్ మద్యం కొనుక్కునేందుకు 200 రూపాయలు తన భార్యని అడుగుతాడు. అదే సందర్భంలో తన భార్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించినందున వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెద్ద గొడవ జరిగినట్లు స్థానికులు చెప్పారని పోలీసులు తెలిపారు. అయితే గొడవ పెద్దదైన అనంతరం. అజర్కు కోపం వచ్చి బేగం పీకకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. 

అయితే గొడవ జరిగిన అనంతరం పక్కింట్లో ఉంటున్న జరీన అనే యువతీ, బేగం వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే సరికి, బేగం స్పృహ లేకుండా నేల మీద పడి ఉండడం చూసినట్లు చెప్పింది. అయితే అప్పటికే తాను చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై పోలీసులు అజర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

చాలా రోజులుగా వేధింపులకు గురవుతున్న భార్య: 

అయితే అందిన సమాచారం ప్రకారం, ఫర్జానా బేగం అనే యువతకి సమీర్ అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. అయితే కొన్ని విషయాలు కారణంగా 2003లో వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. తర్వాత బేగం, అజర్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అజర్ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా తమ కాపురం సాఫీగా సాగుతున్నప్పటికీ, మద్యం కాపురాన్ని కూల్చేసింది. 

చాలా రోజులుగా బేగం భర్త అయిన అజర్ మద్యం మత్తులో ఆఫీసుకు వెళ్లి పని చేస్తున్నట్లు గమనించిన ఆఫీస్ వాళ్లు, అజర్ ను ఉద్యోగం నుంచి మాన్పించేస్తారు. అయితే మద్యానికి బానిస అయిన అజర్, తన ఉద్యోగం పోగొట్టుకున్నప్పటినుంచి మద్యం కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడేవాడు. ఈ విషయంలోనే చాలా రోజులుగా తన భార్యని వేధింపులకు గురి చేస్తున్నట్లు చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు తెలియజేయడం జరిగింది. 

మద్యానికి బానిసైన అజర్ మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. కరెక్ట్ గా మంగళవారం సాయంత్రం మద్యం కొనుక్కునేందుకు తన భార్య బేగంను 200 రూపాయలు అడగగా, బేగం తన భర్తకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. ఇదే క్రమంలో మద్యానికి బానిసైన అజర్, విచక్షణ కోల్పోయి తన భార్య అని చూడకుండా గొడవకు దిగి చివరికి టవల్తో తన భార్య గొంతు పిసికి చంపేశాడు. 

అయితే గొడవ జరిగిన అనంతరం పక్కింట్లో ఉంటున్న జరీన  అనే యువతీ, బేగం వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే సరికి, బేగం స్పృహ లేకుండా నేల మీద పడి ఉండడం చూసినట్లు చెప్పింది. ఈ విషయంపై పోలీసులు అజర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

మద్యం మహా చెడ్డది: 

చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి, రోడ్డున పడడానికి కారణం ఇటువంటి మధ్యానికి బానిసలుగా మారడమే. ఎంతో ఆడుతూ పాడుతూ గడపాడాల్సిన జీవితాన్ని మద్యం కారణంగా చాలామంది తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇప్పుడు బేగం మరియు అజర్ విషయంలో జరిగింది కూడా అదే. అందుకే మాదకద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.