‘తాజ్‌మహల్‌ను కూల్చేయ్యండి’: షాజహాన్-ముంతాజ్ ప్రేమపై విచారణ కోరుతున్న ఎమ్మెల్యే

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ తాజ్ మహల్ మరియు కుతుబ్ మినార్‌లను కూల్చివేసి, వాటికి బదులుగా ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేయడంతో వివాదానికి దారితీసింది. ఈ ఆలయ ప్రాజెక్ట్ కోసం ఒక సంవత్సరం వేతనాన్ని విరాళంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రూపజ్యోతి కుర్మీ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన తాజ్ మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఈ స్మారక చిహ్నాన్ని ప్రేమకు చిహ్నంగా వర్ణించకూడదని […]

Share:

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ తాజ్ మహల్ మరియు కుతుబ్ మినార్‌లను కూల్చివేసి, వాటికి బదులుగా ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేయడంతో వివాదానికి దారితీసింది. ఈ ఆలయ ప్రాజెక్ట్ కోసం ఒక సంవత్సరం వేతనాన్ని విరాళంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

రూపజ్యోతి కుర్మీ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన తాజ్ మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఈ స్మారక చిహ్నాన్ని ప్రేమకు చిహ్నంగా వర్ణించకూడదని పేర్కొన్నారు.

“షాజహాన్ తన నాల్గవ భార్య జ్ఞాపకార్థం తాజ్ మహల్‌ను నిర్మించాడు. అది నిజంగా ప్రేమకు చిహ్నమే అయితే..  ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ మరో మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు?” అని కుర్మీ ప్రశ్నించారు.

మొఘల్ రాజు తన భార్యను నిజంగా ప్రేమించాడా లేదా అని తెలుసుకోవడానికి విచారణ చేపట్టాలని కూడా ఎమ్మెల్యే కుర్మీ డిమాండ్ చేశాడు.

ఇటీవల ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలలో మార్పులు చేసి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అధ్యాయాలను తొలగించిన మార్పుల గురించి కుర్మీ ఇలా వ్యాఖ్యానించారు, “మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడని, షాజహాన్ ‘ఈ తాజ్ మహల్ నిర్మించాడని.. మేము చిన్న పిల్లలకు నేర్పించకూడదని అకుంటున్నాము. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాకా కూడా అది ప్రేమేనా? అని అన్నాడు. అందుకే  “రాబోయే తరాలకు మేము అలాంటి సమాచారాన్ని అందించకూడదని అనుకుంటున్నాము. ఇప్పుడు NCERT.. మొఘల్‌లకు చెందిన చరిత్రను తగ్గించాలని నిర్ణయించుకుంది.. దీనికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము అని పేర్కొన్నారు.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఇటీవల మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించడం ద్వారా 12వ తరగతి చరిత్ర పుస్తకంతో సహా తన పుస్తకాలను సవరించింది. దేశవ్యాప్తంగా NCERTని అనుసరించే అన్ని పాఠశాలలకు ఈ మార్పు వర్తిస్తుందని పేర్కొంది.

12వ తరగతి నుండి, ‘కింగ్స్ అండ్ క్రానికల్స్’కి సంబంధించిన అధ్యాయాలు; మొఘల్ కోర్టులు (C. 16వ మరియు 17వ శతాబ్దాలు)’ చరిత్ర పుస్తకం ‘థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ-పార్ట్ 2’ నుండి తొలగించబడ్డాయి.

12వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి మహాత్మా గాంధీ, హిందూ-ముస్లిం ఐక్యత మరియు ఆర్‌ఎస్‌ఎస్ నిషేధంలోని కొన్ని పాఠాలు కూడా తొలగించబడ్డాయి.

“క్రోనా మహమ్మారి తరువాత, చదువు భారం తగ్గించబడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు భారం అవుతుందని మేము గ్రహించాం. ఈ నష్టాలను పూడ్చడానికి మేము మార్గాలను కనుగొనవలసి ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), ప్రక్రియను మేము ప్రామాణికం చేశాము, ”అని NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు.

జ్యోతి కుర్మీ అస్సాం నుండి మే 2021లో అస్సాం శాసనసభకు (కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నైకయ్యారు) ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయ నాయకుడు. అతను భారతీయ జనతా పార్టీకి చెందిన రమణి తంతిపై 2,446 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా కుర్మీని జూన్ 2021లో భారత జాతీయ కాంగ్రెస్ నుండి బహిష్కరించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కుర్మీ బీజేపీలో చేరారు.