Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం (Delhi Air Pollution) అతలాకుతలం చేస్తోంది. అక్కడ గాలిని పీల్చుకునేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే దీపావళి (Deepavali) పండుగ తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని అంతా ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ వాయు కాలుష్యానికి (Delhi Air Pollution) శాశ్వత పరిష్కారం (Solution) చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ కాలుష్యం నుంచి ఢిల్లీ (Delhi)ని బయట పడేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా కానీ అక్కడ పరిస్థితులు మెరుగవడం లేదు. ఇలా ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) పెరిగేందుకు అనేక కారణాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అనేక కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని తెలుపుతున్నారు. పక్క రాష్ట్రాలలో పంట వ్యర్థాలను కాల్చడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. పక్క రాష్ట్రాలలో పంట వ్యర్థాలు (Fire) కాల్చడం తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం (Government) పక్క రాష్ట్రాల ప్రభుత్వాలకు రిక్వెస్ట్ లు పంపుతోంది. అయినా కానీ అక్కడ వాతావరణంలో ఏ మార్పులూ రావడం లేదు.
కేవలం పక్క రాష్ట్రాల్లోని ప్రజలు పంట వ్యర్థాలు కాల్చడం వల్ల వచ్చే పొగ మాత్రమే కాకుండా నగరంలో కూడా కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ (Delhi) ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఆ రాష్ట్రంలో ఇప్పటికే అనేక చర్యలను చేపట్టింది. సరిబేసి (Even-Odd) విధానం అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ పడగానే వాహనం ఆఫ్ చేయాలని కూడా సూచనలు చేసింది. అయినా కానీ అక్కడ వాతావరణంలో ఎటువంటి మార్పులు రావడం లేదు.
Also Read: Delhi: కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కారు..
వాయుకాలుష్యం ( Air Pollution) విపరీతంగా పెరగడాన్ని గుర్తించడం లేదని బెంగళూరులోని సక్రా వరల్డ్ హాస్పిటల్ తో అనుబంధంగా ఉన్న సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ (Cardiologist) డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి హెచ్చరించారు. అత్యంత కలుషితమైన గాలికి గురికావడం వల్ల పౌరులలో హృదయ సంబంధ వ్యాధులు (Heart Diseases) వచ్చే ప్రమాదం ఉందని అతడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి పీల్చడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించి ఆ డాక్టర్ కొన్ని చిత్రాలను (Pics) కూడా షేర్ చేశాడు. వాయు కాలుష్యం ( Air Pollution) అనేది హృదయ సంబంధ సంఘటనలకు ముఖ్యమైన మరియు తక్కువగా గుర్తించబడిన ప్రమాద కారకం అని బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ (Cardiologist) పేర్కొన్నారు. కాలుష్యం ( Pollution) వెదజల్లని ఇంధనాలకు మారడం, రవాణా సంస్కరణలను పెంచడం మరియు ట్రాఫిక్ ఉద్గారాలను తగ్గించడం వంటి వాటితో అక్కడి పరిస్థితులలో మార్పును తీసుకురావచ్చునని ఆ డాక్టర్ పేర్కొన్నారు. వ్యక్తిగత స్థాయిలో, ఫేస్ మాస్క్ లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ లను ఉపయోగించాలని, ట్రాఫిక్ (Traffic)లో ఎక్స్‌పోజర్ లను తగ్గించాలని, అవుట్‌డోర్ వాయు కాలుష్యం ఇంటిలోకి చొచ్చుకుపోవడాన్ని తగ్గించాలని మరియు జీవనశైలి మార్పులు మరియు నివారణ ఔషధాలను ఉపయోగించాలని ఆయన ప్రజలను కోరారు.
ఇందుకు సంబంధించి ఆ డాక్టర్ (Doctor) వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎలాగైనా పరిస్థితిలో మార్పు తీసుకురావాలని బాగా ప్రయత్నిస్తోంది. అందుకోసం అనేక మార్గాలను అనుసరిస్తోంది. అయినా కానీ అక్కడి పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ సమస్య మీద ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న పంజాబ్ లో కూడా ఆప్ ప్రభుత్వమే ఉంది. మొన్నటి వరకు ఆప్ ప్రభుత్వం పంజాబ్ (Punjab) లో పంట వ్యర్థాలను కాల్చడం తగ్గించాలని అనేది కానీ ఇప్పుడు అక్కడ కూడా వారి ప్రభుత్వమే ఉంది కదా అని అనేక మంది నాయకులు కేజ్రీవాల్ సర్కార్ మీద ఫైర్ అవుతున్నారు.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని (Delhi Air Pollution) కంట్రోల్ చేసేందుకు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ అనేక చర్యలకు ఉపక్రమించింది. కానీ ఆ చర్యలేవీ ఢిల్లీ వాయు కాలుష్యాన్ని (Delhi Air Pollution) తగ్గించడం లేదు. ఈ సమస్య కేవలం ఈ ఏడాది మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం ఢిల్లీని వేధిస్తోంది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాయు కాలుష్యం వల్ల పడుతున్న ఇబ్బందితో పాటు ప్రభుత్వం పెట్టిన నిబంధనల వల్ల కూడా అక్కడి ప్రజలకు (People) ఇబ్బందులు తప్పడం లేదు.