Delhi: రూ.41 కోట్ల భూమి రూ.353 కోట్లకు విక్రయం.. ఢిల్లీ సీఎస్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు

Delhi: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Policy) కేసుతో తీవ్ర సతమతం అవుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మరో తలనొప్పి వచ్చి పడింది. రూ.41 కోట్ల విలువైన భూమిని రూ.353

Share:

Delhi: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Policy) కేసుతో తీవ్ర సతమతం అవుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మరో తలనొప్పి వచ్చి పడింది. రూ.41 కోట్ల విలువైన భూమిని రూ.353 కోట్లకు విక్రయించి అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఫిర్యాదులు కూడా నమోదు కావడం సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యవహారంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ(Delhi Chief Secretary)పై అవినీతి ఆరోపణలు(Allegations of corruption) వెల్లువెత్తాయి.

 

ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) చుట్టూ కేసులు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని(Aam Aadmi Party), ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న వేళ.. తాజాగా మరో కొత్త కేసు బయటికి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్(Naresh Kumar) తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి తాజాగా ఫిర్యాదు(complaint) అందింది. సీఎంఓతో పాటు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ మంత్రి అతిషికి(Vigilance Enforcement Minister Atishi) కూడా ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. భూమి ధరను అమాంతం పెంచి రూ.312 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ సీఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు(Accusations) వచ్చాయి.

 

రూ.41 కోట్ల విలువైన భూమి ధరను(Land cost) రూ.353 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు దారుడు ఒక లాయర్ అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ కంపెనీ ఢిల్లీ సీఎస్‌ నరేశ్‌కుమార్‌(Delhi CS Naresh Kumar) కుమారుడు పని చేస్తున్న సంస్థతో సంబంధం ఉన్న కంపెనీ అని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో మొత్తం రూ.312 కోట్ల మేర అవినీతి(Corruption) జరిగిందని వచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తి స్థాయి నివేదిక కోరింది. అయితే ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ సీఎస్ నరేశ్‌ కుమార్‌ తీవ్రంగా ఖండించారు. అసలు ఆ సంస్థ గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. ముందుగా ఈ కేసులో తానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

 

2018లో ద్వారక ఎక్స్‌ప్రెస్‌ హైవే(Dwarka Express Highway) నిర్మాణం కోసం ఢిల్లీ శివారులోని 19 ఎకరాల భూమిని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా-ఎన్‌హెచ్‌ఏఐ(NHAI) కొనుగోలు చేసింది. అయితే ఆ 19 ఎకరాల భూమి విలువ రూ.41.52 కోట్లు అని అప్పటి నైరుతి ఢిల్లీ జిల్లా అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఆ భూమి విలువను నైరుతి ఢిల్లీ జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కుమార్(Collector Hemant Kumar) రూ.353.79 కోట్లకు పెంచినట్లు తెలిసింది. దీంతో ఆ జిల్లా కలెక్టర్ హేమంత్ కుమార్ అతడ్ని సస్పెండ్‌(Suspended)చేశారు. అనంతరం ఆ ఉత్తర్వులను కూడా పక్కకు పెట్టేశారు.

 

ఈ వ్యవహారంలో భూములు విక్రయించిన వారికి ఎన్‌హెచ్‌ఏఐ(NHAI) అధిక ధరలు చెల్లించేలా ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్(CS Naresh Kumar) ‌సమక్షంలోనే ఉత్తర్వులు విడుదల అయ్యాయని ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లు తెలుస్తోంది. అయితే భూ యజమాని సుభాష్‌ చంద్‌ కథురియాకు(Subhash Chand Kathuria) అనంత్‌ రాజ్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ప్రమోటర్ అయిన అమన్‌ సరిన్‌తో(Aman Sarin) సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమన్ సరిన్‌కు.. ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ కుమారుడు కరణ్‌కు కూడా మంచి సంబంధాలు ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. 

 

అయితే బిగ్‌ టౌన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు కరణ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారుు. అయితే అనంత్‌రాజ్‌ లిమిటెడ్‌ సంస్థకు కూడా అదే అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఉన్నట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. మరోవైపు.. ఈ విషయం ఈ ఏడాది జూన్‌లోనే సీఎస్ నరేశ్‌కుమార్‌ దృష్టికి వచ్చిందని.. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆయన ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్‌ విజిలెన్స్‌(Delhi Directorate of Vigilance)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.