Pollution: ఢిల్లీ కాలుష్యంతో జాగ్రత్త అంటున్న డాక్టర్లు

Pollution: 2023 సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే అత్యధిక వేడి నమోదైన సంవత్సరంగా శాస్త్రవేత్తలు (scientists) గుర్తించారు. ముఖ్యంగా కాలాలు మారుతున్నప్పటికీ ఎడతెరపలేని ఎండ కారణంగా, ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఎడారుల మారుతున్నాయి. దీనంతటికీ కారణం కేవలం కాలుష్యం (Pollution). దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ (Global Warming) ఏర్పడుతోంది. అంతేకాకుండా రాను రాను భూమి (Earth) మీద మనుగడ సాగించడం కూడా కష్టమే అంటూ వాతావరణాని (Climate)కి సంబంధించిన కొన్ని అంశాలను శాస్త్రవేత్తలు (scientists) వివరించడం జరిగింది. ఇప్పుడు […]

Share:

Pollution: 2023 సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే అత్యధిక వేడి నమోదైన సంవత్సరంగా శాస్త్రవేత్తలు (scientists) గుర్తించారు. ముఖ్యంగా కాలాలు మారుతున్నప్పటికీ ఎడతెరపలేని ఎండ కారణంగా, ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఎడారుల మారుతున్నాయి. దీనంతటికీ కారణం కేవలం కాలుష్యం (Pollution). దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ (Global Warming) ఏర్పడుతోంది. అంతేకాకుండా రాను రాను భూమి (Earth) మీద మనుగడ సాగించడం కూడా కష్టమే అంటూ వాతావరణాని (Climate)కి సంబంధించిన కొన్ని అంశాలను శాస్త్రవేత్తలు (scientists) వివరించడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి, అనేక శ్వాసకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డాక్టర్లు. 

క్యాన్సర్ వచ్చే అవకాశం!!: 

ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution)కి పెట్టింది పేరుగా మారిపోయింది. న్యూ ఢిల్లీ (New Delhi) తో పాటు, కోల్ కత్త (Kolkata), ముంబై (Mumbai) లో కూడా కాలుష్యం (Pollution) రోజురోజుకు ఎక్కువైపోతున్న క్రమం కనిపిస్తోంది. శీతాకాలం (Winter) మొదలైన సమయానికి దట్టమైన మంచితోపాటు, కాలుష్యం (Pollution) ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు తగ్గిపోతుంది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ (New Delhi), పాకిస్తాన్ దేశంలో లాహోర్ (Lahore), కోల్ కత్త (Kolkata), ముంబై వంటి ప్రధాన నగరాల (City)లో ఎయిర్ క్వాలిటీ రేట్ పూర్తిగా పడిపోయింది. ప్రజలను బయటికి రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. శీతాకాలం (Winter)లో ఎక్కువ గాలులు లేకపోవడం వల్ల, ఎక్కడ కాలుష్యం (Pollution) అక్కడే నిలిచిపోయి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణంగా భారతదేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ (New Delhi)లో PM2.5 కాలుష్యానికి ప్రధాన మూలం వాహనల నుంచి వచ్చే పొగ. PM2.5 కణాలు అతిచిన్న, అత్యంత ప్రమాదకరమైన రేణువుల పదార్థం, ఎందుకంటే అవి ఊపిరితిత్తులు మరియు రక్తప్రవాహంలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. ఢిల్లీ (New Delhi) గాలిలో నైట్రోజన్ ఆక్సిడైడ్.. అంతేకాకుండా కార్బన్ మోనాక్సైడ్లు 80 శాతం వాహనాలు నుంచి వస్తున్న కాలుష్యం కారణంగానే వెలువడుతున్నాయి.

పొంచి ఉన్న ముప్పు:

ఢిల్లీ (New Delhi)లో ‘తీవ్రమైన’ వాయు కాలుష్య స్థాయిలు, ఢిల్లీ (New Delhi)లో ఉన్నవారి ఆరోగ్యం (Health)పై గణనీయమైన ప్రభావాలను చూపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నగరంలో కాలుష్య పరిస్థితి భయంకరంగా మారడంతో ఆరోగ్య (Health) నిపుణులు హెచ్చరించారు. విషపూరితమైన గాలికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు ఢిల్లీ (New Delhi)లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని కోరారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చెందిన డాక్టర్ పీయూష్ రంజన్ ప్రకారం, ఢిల్లీ (New Delhi)లోని వాతావరణ కాలుష్యానికి గురికావడం వల్ల మనుషుల్లో క్యాన్సర్ (Cancer) వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని నొక్కి చెప్తున్నారు. ఢిల్లీ (New Delhi)లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, అంతేకాకుండా ఆర్థరైటిస్ వంటి కొరోనరీ ఆర్టరీ వ్యాధులు ముఖ్యంగా వాటిల్లుతాయి హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ప్రపంచంలోని అనేక నగరాల్లో (City) కాలుష్య స్థాయిలు పెరుగుతున్నందున, అటువంటి కలుషిత (Pollution) వాతావరణంలో వ్యాయామం (Exercise) చేయడం లేదా నడవడం వల్ల కలిగే సంభావ్య ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

ఎయిర్ క్వాలిటీ, AQI 0-50 వరకు ఉంటే, కాలుష్యం (Pollution) లేనట్టు. AQI 400 నుంచి 500 మధ్యలో ఉంటే, ప్రజల ఆరోగ్యానికి (Health) ముప్పు వాటిల్లుతున్నట్టు. ఇప్పుడు న్యూఢిల్లీ (New Delhi) లో AQI 483, పాకిస్తాన్ లాహోర్ లో AQI 371, తర్వాత కోల్ కత్త (Kolkata)లో AQI 206గా ఉండగా ఈ మూడు నగరాలు (City) అత్యధిక కాలుష్యం (Pollution)తో నిండిన నగరాలుగా (City) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తరువాత బంగ్లాదేశ్, చైనా, కువైట్ కి చెందిన నగరాలు (City) అత్యధిక కాలుష్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కాలుష్యం (Pollution) కారణంగా ఢిల్లీ (New Delhi)లో జరగాల్సిన బంగ్లాదేశ్ – శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ కూడా వచ్చే శుక్రవారంకి వాయిదా పడింది.