కారుని ఢీకొట్టిన పాఠశాల బస్సు..6 మంది దుర్మరణం!

రాంగ్ రూటులో రావడమే పెద్ద తప్పు : ఇటీవల కాలం లో వరుసగా ప్రమాదాలకు గురైన వార్తలను వింటూనే ఉన్నాము. ప్రతీ రోజు తెల్లవారు జామున న్యూస్ పేపర్ పట్టుకోవాలన్నా, న్యూస్ ఛానల్ పెట్టి వార్తలను చూడాలన్నా భయం వేస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో , ఎలాంటి దారుణాలను చూడాల్సి వస్తుందో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన పది రోజుల్లోనే దారుణమైన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎన్నో వార్తలను మనం చూసే ఉంటాము. […]

Share:

రాంగ్ రూటులో రావడమే పెద్ద తప్పు :

ఇటీవల కాలం లో వరుసగా ప్రమాదాలకు గురైన వార్తలను వింటూనే ఉన్నాము. ప్రతీ రోజు తెల్లవారు జామున న్యూస్ పేపర్ పట్టుకోవాలన్నా, న్యూస్ ఛానల్ పెట్టి వార్తలను చూడాలన్నా భయం వేస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో , ఎలాంటి దారుణాలను చూడాల్సి వస్తుందో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన పది రోజుల్లోనే దారుణమైన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎన్నో వార్తలను మనం చూసే ఉంటాము. ఇక రీసెంట్ గా ఘజియాబాద్ లో జరిగిన స్కూల్ బుస్స్ ప్రమాదానికి గురైన సంఘటన, దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా వీడియోలను చూస్తే గుండె తరుక్కుపోతుంది.  ఈ దుర్ఘటన లో ఆరు మంది చనిపోగా, అందులో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు.  సీసీటీవీ కెమెరా లో రికార్డు అయిన వీడియో ని ఒక్కసారి చూస్తే అత్యంత వేగంగా గురుగ్రామ్ వైపు వెళ్తున్న  SUV కారుని, రాంగ్ రూట్ లో వస్తున్న పాఠశాల బస్సు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరు మంది స్పాట్ లోనే చనిపోయారు. అందులో ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారు. ఇక స్కూల్ బస్సు లో ప్రయాణిస్తున్న పిల్లలకు కూడా గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఢిల్లీ – మీరట్ ఎక్స్ ప్రెస్ వే మీద మంగళవారం ఉదయం జరిగింది. ఇక ఈ ప్రమాదం లో 8 ఏళ్ళ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని సమీపం లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ బాలుడి పరిస్థితి విషమం గానే ఉందట. ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం బాద్యరాహిత్యంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాంగ్ రూట్ లో ఒక బస్సు వస్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఎలా అనుమతించారు?, ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించిందం వల్ల నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్య చర్య కారణం గా పోయిన ఆ ఆరుమంది ప్రాణాలను వెనక్కి తీసుకొని రాగలరా?.

ట్రాఫిక్ పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్న నెటిజెన్స్:

డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ , పొల్యూషన్ కార్డు , ఆర్సీ బుక్ వీటిల్లో ఏది లేకపోయినా కూడా ప్రజలను రోడ్డు మధ్యలో ఆపి, వేలకు వేలు ఫైన్స్ వేసే ట్రాఫిక్ పోలీసులు, ఇప్పుడు వారు వ్యహరించిన ఈ నిర్లక్ష్య ధోరణి కి ఎలాంటి ఫైన్ వెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్. ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలంటె కచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టమొచ్చినట్టు రాంగ్ రూట్ లో వెళ్తున్న బస్సు డ్రైవర్ మీద , అలాగే ఆ స్కూల్ యాజమాన్యం మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి వల్ల చక్కగా రూల్స్ ఫాలో అవుతూ సరైన దారిలో వెళ్తున్న వారు చనిపోయారు. అసలు రాంగ్ రూట్ లో రావాలి అంటేనే డ్రైవర్లకు వణుకు పుట్టే రేంజ్ లో చర్యలు చేపట్టాలి. జాతీయ రహదారుల్లో ఈమధ్య లారీలు , బస్సులు , కార్లు వన్ వే లో వారి సౌకర్యానికి తగ్గట్టుగా వెళ్లిపోతున్నారు. ఇందువల్ల రోడ్డు ప్రమాదాలు ఈమధ్య ఎక్కువైపోతున్నాయి, దీనిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.