నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఆర్డర్

ఢిల్లీ టెక్కీ ట్వీట్‌ వైరల్ గా మారింది. ఎందుకంటే తను ఆర్డర్ చేసిన నాలుగు సంవత్సరాల తర్వాత అలీఎక్స్‌ప్రెస్ ప్యాకేజీని అందుకున్నాడని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మనం క్లిక్ చేసిన వెంటనే మన ఆర్డర్ మన చేతిలో ఉంటుందని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం కదా, కానీ కొన్ని కొన్ని సార్లు దీనికి భిన్నంగా మన సహనానికి పరీక్ష కొన్నిసార్లు ఆర్డర్లు ఇంటి వరకు రావడానికి లేట్ అవుతూ ఉంటాయి. ఆన్‌లైన్ ఆర్డర్‌లు పరిమితులను పెంచి, […]

Share:

ఢిల్లీ టెక్కీ ట్వీట్‌ వైరల్ గా మారింది. ఎందుకంటే తను ఆర్డర్ చేసిన నాలుగు సంవత్సరాల తర్వాత అలీఎక్స్‌ప్రెస్ ప్యాకేజీని అందుకున్నాడని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మనం క్లిక్ చేసిన వెంటనే మన ఆర్డర్ మన చేతిలో ఉంటుందని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం కదా, కానీ కొన్ని కొన్ని సార్లు దీనికి భిన్నంగా మన సహనానికి పరీక్ష కొన్నిసార్లు ఆర్డర్లు ఇంటి వరకు రావడానికి లేట్ అవుతూ ఉంటాయి. ఆన్‌లైన్ ఆర్డర్‌లు పరిమితులను పెంచి, మన స్థైర్యాన్ని పరీక్షించి, రోజులు, వారాలు మరియు ఇంకా ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని సందర్భాలలో, సంవత్సరాల తరబడి ఉత్కంఠకు గురిచేస్తాయి! అవును, మీరు విన్నది నిజమే! ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోకుండా ఉండరు. ఒక వ్యక్తి ఇటీవల నాలుగు సంవత్సరాల క్రితం అతను చేసిన ఆర్డర్‌ను ఇప్పుడు అందుకున్నాడు. అతని ఉత్సాహానికి అవధులు లేవు కాబట్టి, అతను తన పూర్తి ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. నిజానికి ఇలాంటి ఆశ్చర్యాలు ఎప్పుడో గాని జరగవు. ఇప్పుడు తన వంతు అంటూ ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నాలుగు సంవత్సరాల చేసిన ప్యాకేజీని చూసి మురిసిపోతున్నాడు.

మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో, ఢిల్లీకి చెందిన టెక్కీ, నితిన్ అగర్వాల్ ఇలా వ్రాశాడు, “ఎప్పటికీ ఆశని మాత్రం వదులుకోవద్దు! కాబట్టి, నేను దీన్ని 2019లో AliExpress (ఇప్పుడు భారతదేశంలో నిషేధించబడింది) నుండి ఆర్డర్ చేసాను మరియు ఈ రోజు పార్శిల్ డెలివరీ అందుకున్నాను.” తన ట్వీట్‌తో పాటు, అంతేకాకుండా ప్యాకేజీ మీద ఉన్న రహస్యమైన చైనీస్ అక్షరాలతో అలంకరించబడిన ఫోటోను పంచుకున్నాడు. నిజానికి, అతను చేసిన ట్విట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్యాకేజీలో తేదీ – మే 2019, ఇప్పుడు నిషేధించబడిన చైనీస్ యాప్ ఇప్పటికీ ఆర్డర్ డెలివరీ ఇవ్వడంలో విఫలం కాలేదు అని ప్రతి ఒక్కరికి తెలియచేసింది.

కొంతమందికి ఆలీ ఎక్స్ప్రెస్ గురించి తెలియకపోవచ్చు. AliExpress అనేది చైనీస్ బహుళజాతి సంస్థ, అలీబాబా ఆన్‌లైన్ రిటైల్ సేవ. భద్రతా సమస్యల కారణంగా 2020లో భారతదేశంలో కొన్ని విదేశీ యాప్‌ లను నిషేధించారు. అందులో ఈ చైనీస్ యాప్‌ కూడా ఒకటి.

ఇది ఇలా ఉండగా, ఆర్డర్ చేసిన నాలుగు సంవత్సరాలకు పార్సిల్ అందుకున్న వ్యక్తి ట్విట్టర్లో పంచుకున్న తన ట్వీట్ తో వైరల్ గా మారాడు. సునామీలా కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. కామెంట్స్ లో భాగంగా ఒక వినియోగదారి “వాహ్. నేను అదృష్టవంతురాలిగా ఉండాలనుకుంటున్నాను.” మరొకరు వారి స్వంత అనుభవంతో ఇలా అన్నారు, “నాకు కూడా 8 నెలల తర్వాత AliExpress నుండి నా పార్శిల్ వచ్చింది. అంతే కాదు ఫ్రెండ్స్, AliExpress నా మొత్తాన్ని కూడా వాపసు చేసింది :)” అంటూ చాలామంది రాసుకువచ్చారు.

కానీ, మరొక కామెంట్ లో, తన అత్యంత విలువైన అనుభవాన్ని పంచుకుంటూ “నేను కొన్ని సంవత్సరాల క్రితం నా స్వంత దేశంలోని ఆన్‌లైన్ స్టోర్ నుండి ఒక ఆర్డర్ చేసాను…, నేను 6.5 సంవత్సరాల తర్వాత ఆర్డర్ అందుకున్నాను.” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ట్విట్టర్ కామెంట్స్: 

నేను కొన్ని సంవత్సరాల క్రితం నా స్వంత దేశంలోని ఆన్‌లైన్ స్టోర్ నుండి ఆర్డర్ చేసాను…., నేను 6.5 సంవత్సరాల తర్వాత ఆర్డర్‌ని అందుకున్నాను 

నేను కూడా AliExpress నుండి 8 నెలల తర్వాత నా పార్శిల్‌ని అందుకున్నాను. అంతేకాదు ఆనందకరమైన విషయం ఏమిటంటే,AliExpress నా మొత్తాన్ని కూడా వాపసు చేసింది