ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి గిన్నిస్ రికార్డ్

ఉదయం ఐదు గంటలకి మొదలుకొని, బ్లూ లైన్ ఢిల్లీ మెట్రో నుంచి మొదలుపెట్టి బ్రిగాదర్ సింగ్ స్టేషన్ దగ్గర ముగిసిన యువకుడి మెట్రో స్టేషన్ ప్రయాణం. మొత్తం 15 గంటల్లో ఢిల్లీలో ఉన్న మొత్తం అన్ని మెట్రో స్టేషన్స్లో కవర్ చేసి గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కాడు.  వివరాల్లోకి వెళితే, ఢిల్లీలో ఉన్న ఒక యువకుడు ఒక ప్రత్యేకమైన వరల్డ్ రికార్డ్ని సృష్టించాడు. 15 గంటల 22 నిమిషాల 49 సెకండ్స్ లోనే ఢిల్లీ మెట్రో స్టేషన్ […]

Share:

ఉదయం ఐదు గంటలకి మొదలుకొని, బ్లూ లైన్ ఢిల్లీ మెట్రో నుంచి మొదలుపెట్టి బ్రిగాదర్ సింగ్ స్టేషన్ దగ్గర ముగిసిన యువకుడి మెట్రో స్టేషన్ ప్రయాణం. మొత్తం 15 గంటల్లో ఢిల్లీలో ఉన్న మొత్తం అన్ని మెట్రో స్టేషన్స్లో కవర్ చేసి గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. 

వివరాల్లోకి వెళితే, ఢిల్లీలో ఉన్న ఒక యువకుడు ఒక ప్రత్యేకమైన వరల్డ్ రికార్డ్ని సృష్టించాడు. 15 గంటల 22 నిమిషాల 49 సెకండ్స్ లోనే ఢిల్లీ మెట్రో స్టేషన్ అన్నిట్లోని ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అన్ని మెట్రో స్టేషన్స్ ను కవర్ చేసి శశాంక్ మను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. మిస్టర్ మను ఒక ఫ్రీలాన్స్ రీసర్చ్ర్గా పని చేస్తున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు ఆయన ఎంపిక చేసుకున్నది ఏప్రిల్ 2021. మొత్తం మెట్రో స్టేషన్ ప్రయాణం ఉదయం 5 గంటలకి మొదలైయితే, ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ కి వెళ్లేందుకు ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ట్రాఫిక్ మెయిన్ గా ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఛాలెంజెస్ అనేవి పేస్ చేసి ఆయన వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 

మిస్టర్ మను తన ప్రయాణం డైలీ బ్లూ లైన్ దగ్గర ఉదయం అయిదు గంటలకు మొదలుపెట్టి, చివరిగా బ్రిగెదర్ సింగ్ స్టేషన్ దగ్గర ఆయన ప్రయాణం ముగించారు. అది కూడా ప్రయాణం మొత్తం 15 గంటల 22 నిమిషాల 49 సెకండ్లలో ముగిసింది. అయితే నిజానికి మిస్టర్ మను రెండు సంవత్సరాల క్రితమే తన ప్రయాణాన్ని ముగించుకుని రికార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. కాకపోతే చిన్న మిస్ అండర్స్టాండింగ్ కారణంగా ముందుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్, అఫీషియల్ గా మరో వ్యక్తికి ఇచ్చేందుకు నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఆగస్టు 29, 2021లో ప్రఫుల్ సింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ 16 గంటల 2 నిమిషాలలో మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రొఫైల్ సింగ్ కు ఇచ్చేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ తర్వాత మిస్టర్ మను 15 గంటల్లోనే మొత్తం ఢిల్లీ మెట్రో స్టేషన్ కవర్ చేసి రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిబంధనలు: 

ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నంలో భాగంగా మను చాలా కసరత్తు చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిబంధనల ప్రకారం, మను ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర ఫొటోస్ తీసుకోవడం అలాగే ఎవిడెన్స్ గా కొంతమంది సిగ్నేచర్ కలెక్ట్ చేయడం జరిగింది. అయితే మను కవర్ చేసిన జర్నీలో, మెయిన్ గా ఇద్దరూ వీట్నెస్ యొక్క సాక్షాల కన్ఫర్మేషన్ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఆయన తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. తను కవర్ చేసిన టైం అలాగే తను అందుకున్న సర్టిఫికెట్ చూపిస్తూనా ఫోటో కూడా మనం చూడొచ్చు. 

అయితే మెట్రో స్టేషన్ కవర్ చేయడానికి శశాంక్ మను చాలా కష్టపడినట్లు మనకి తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం ఢిల్లీ మెట్రో నెట్వర్క్ 391 కిలోమీటర్లు మొత్తం 12 లైన్లు 286 స్టాప్స్ ఇందులో ఉంటాయి. ఢిల్లీ మెట్రో స్టేషన్ 2002లో ప్రారంభమైంది. ఢిల్లీ మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత ఢిల్లీ రోడ్డు ట్రాఫిక్ అనేది సగానికి పైగా తగ్గిందని చెప్పుకోవచ్చు.