ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జీషీట్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్లను చేర్చారు దర్యాప్తు అధికారులు. తాజాగా ఈ కేసులో మనీష్ సిసోడియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది.. మనీష్ సిసోడియా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలుమార్లు విచారించిన తర్వాత మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఈ ఏడాది మార్చి 26న అరెస్ట్ […]

Share:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జీషీట్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్లను చేర్చారు దర్యాప్తు అధికారులు. తాజాగా ఈ కేసులో మనీష్ సిసోడియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది..

మనీష్ సిసోడియా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలుమార్లు విచారించిన తర్వాత మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఈ ఏడాది మార్చి 26న అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జీషీట్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్లను చేర్చారు దర్యాప్తు అధికారులు. తాజాగా ఈ కేసులో మనీష్ సిసోడియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది..

రెండో చార్జీషీట్ దాఖలు చేసిన కొద్దిరోజులకే మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. ఆ తరువాత ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రపిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్రపిళ్లై స్టేట్‌మెంట్ ఆధారంగా బీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలో ప్రకంపనలు కలిగిస్తుంది. డిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగానే దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యాప్తు సంస్థలు ఈ కేసులో అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. 

ఏప్రిల్ 17 వరకు పొడిగింపు..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని సోమవారం ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 17 వరకు పొడిగించింది. సిసోడియాను ఏప్రిల్ 17న తమ ఎదుట హాజరుపరచాలని సిబిఐ న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ పోలీసులను ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నందున సిసోడియాను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును ఆదేశించింది.

అయితే సిసోడియా బెయిల్ దరఖాస్తును సిబిఐ కోర్టు మార్చి 31న కొట్టివేసింది. ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం.. ఈ నేరపూరిత కుట్రలో ప్రధాన సూత్రధారిగా సిసోడియా ఉన్నారని న్యాయమూర్తి తెలిపారు. ఈ కుంభకోణంలో అడ్వాన్సుగా చెల్లించిన రూ. 100 కోట్లు సిసోడియాకు, ఆప్ ప్రభుత్వంలోని ఆయన సహచరులకు ఉద్దేశించినట్లుగా కనపడుతోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

నిబంధనలకు విరుద్ధంగా..

నిబంధనలకు విరుద్ధంగా మద్యం పాలసీని మార్చారని ఆరోపించింది. ఫిబ్రవరి 26న సిబిఐ కేసులో అరెస్టు అయినందున బెయిలుపై విడుదల కావడానికి ఆయన అర్హుడు కాదని విచారణలో అతని పాత్ర ఇంకా పూర్తి కాలేదని తెలిపింది. ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత ఆరోపణలు దానికి మద్దతుగా ఇప్పటివరకు సేకరించిన సాక్షాధారాల ప్రకారం.. ఈ నేరపూరిత కుట్రకు రూపశిల్పి సిసోడియానే అని ప్రాథమికంగా భావించవచ్చని కోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో మరో ఏడుగురికి సహా నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయడం పెద్దగా పట్టింపు లేదని ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావితం చేసే కొన్ని ఆర్థిక నేరాల కమిషన్ కోసం లోతైన కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారని కోర్టు తెలిపింది. సిబిఐ ఎప్పటి వరకు సేకరించిన సాక్షాదారాలు నేరపూరిత కుట్రలో సిసోడియా భాగస్వామి చూపడానికి కాకుండా పిసి యాక్టు లోనే కొన్ని ముఖ్యమైన నేరాలను ప్రాథమికంగా కమిషన్ చేసిందని తెలిపింది. 

వ్యతిరేకంగా సాక్షాలు ఏమీ లేవు..

మరోవైపు గత విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది ఒకరు మాట్లాడుతూ.. నిరంతర కష్టడీకి హామీ ఇచ్చే సిబిఐ అసాధారణంగా ఏమీ చెప్పలేదని తెలిపారు. సిసోడియా సాక్షులను బెదిరిస్తున్నారని చూపించడానికి రికార్డులలో ఏమీ లేదు అని న్యాయవాది చెప్పారు సిసోడియా సిబిఐ దర్యాప్తుకు సహకరించారని.. సోదాలలో ఏది అతనికి వ్యతిరేకంగా ఎటువంటి దోషపూరిత విషయాలనూ వెల్లడించలేదని వివరించారు.