భారీ వాహ‌నాల‌పై ఆంక్ష‌లు ఎత్తేసిన ఢిల్లీ

ప్రస్తుతం ఢిల్లీలోని యమునా నది ఉద్రిక్తత మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఇదే సందర్భంలో ఢిల్లీలోని ఇప్పటివరకు హెవీ వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో కూడా హెవీ వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి అందుతుందని సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడున్న ఆంక్షలు సింగు బోర్డర్ మేరకు వర్తిస్తాయని ప్రభుత్వం చెప్పింది.  వీటికి మాత్రమే అనుమతి:  నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో, దేశ రాజధానిలో భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. […]

Share:

ప్రస్తుతం ఢిల్లీలోని యమునా నది ఉద్రిక్తత మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఇదే సందర్భంలో ఢిల్లీలోని ఇప్పటివరకు హెవీ వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో కూడా హెవీ వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి అందుతుందని సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడున్న ఆంక్షలు సింగు బోర్డర్ మేరకు వర్తిస్తాయని ప్రభుత్వం చెప్పింది. 

వీటికి మాత్రమే అనుమతి: 

నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో, దేశ రాజధానిలో భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా సింగుతో సహా నాలుగు సరిహద్దుల నుండి రాజధానిలోకి అవసరమైన వస్తువులను తీసుకువెళ్లేవారిని మినహాయించి భారీ గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. యమునా నది నీటి మట్టం తగ్గుముఖం పట్టడం కారణంగా, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి మెరుగుపడటం దృష్ట్యా, భారీ సరుకు రవాణా చేసే వాహనాల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను పాక్షికంగా తొలగించాలని నిర్ణయించారు. సింగు సరిహద్దు వద్ద మాత్రమే నిషేధం కొనసాగుతుందని కొత్త ఆర్డర్ పాస్ అయింది. 

హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరాఖండ్ నుండి వచ్చే అంతర్రాష్ట్ర బస్సులు ISBT కష్మీరే గేట్ దగ్గరే ఆగిపోతాయి. అయితే ప్రస్తుతానికి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. నిత్యావసర సరుకులు అంటే మందులు, కూరగాయలు, పండ్లు, బియ్యం, పాలు, గుడ్లు, ఐస్ మొదలైన వాటిని తీసుకువెళ్ళే ట్రక్కులకు మరియు పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్లకు ఈ ఆదేశాలు వర్తించవు అని పేర్కొంది. 

మామూలు అవుతున్న ఢిల్లీ పరిస్థితి: 

రికార్డ్ స్థాయిలో పొంగిపొర్లుతున్న యమునా నది కారణంగా ఢిల్లీలోని చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇంకా రెస్క్యూ టీం వారు కిందటి వారం నుంచి పలుచోట్ల చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో పడ్డారు. ఇప్పటివరకు ఢిల్లీలోని 23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఢిల్లీలోని సుప్రీంకోర్టుతో సహా అనేకమైన ప్రముఖ ప్రాంతాలు నీట మునగడం జరిగింది. మంత్రివర్గ సహచరుల కార్యాలయాలు ఉన్న సెక్రటేరియట్‌తో సహా ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాలు గురువారం వరదల్లో చిక్కుకున్నాయి. శుక్రవారం ఉదయం భారీ వర్షంతో యమునా నదిలో నీటిమట్టం పెరగడంతో రాజ్‌ఘాట్‌ సమీపంలో నీటి ప్రవాహం రికార్డ్ స్థాయిలో కొనసాగింది. 

డ్రైనేజీలు ఉన్నప్పటికీ, బ్లాక్ అయిపోవడం వల్ల నీరు వెనక్కి రావడంతో గురువారం రాత్రి యమునా వరద నీరు సుప్రీంకోర్టుకు చేరుకుంది. దీనిబట్టే వరద స్థాయి ఎంత ప్రమాది స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు సమీపంలోని మధుర రోడ్డు, భగవాన్ దాస్ రోడ్డులోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. 

అయితే ప్రస్తుతం యమునా నది ఉద్రిక్తత తగ్గుముఖం పట్టడంతో, ఢిల్లీలోని మళ్లీ పరిస్థితులు మామూలు స్థితికి వస్తున్నాయి. అక్కడ ఎక్కువగా వర్షాలు లేకపోయినప్పటికీ యమునా నదికి చేరుకున్న వరద నీరు కారణంగా ఇప్పుడు ఢిల్లీ నీట మునిగిందని ఢిల్లీ ముఖ్యమంత్రి ఉద్దేశపడడం జరిగింది.

యమునా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని ఇప్పటికే ఖాళీ చేయించింది. ఎక్కడ చూసినా రికార్డ్ స్థాయిలో నీరు ప్రవహిస్తూ కనిపిస్తుంది ఇళ్లల్లోకి, మెడికల్ షాపుల్లోకి, రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ తలదాచుకోడానికి కూడా చోటు లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టింది. అయితే ఢిల్లీలో పరిస్థితులు నార్మల్ స్థితికి వస్తున్న ఛాయిలు అయితే కనిపిస్తున్నాయి.