ఢిల్లీ వరదల్లో మునిగిన‌ సుప్రీం కోర్ట్

ఢిల్లీలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యమునా నది ఉగ్రరూపంతో పొంగిపొర్లుతోంది. ఇప్పటికే 23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. యమునా నది రికార్డ్ స్థాయిలో ప్రవహించడం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి.  హెచ్చరికలు జారీ:  రికార్డ్ స్థాయిలో పొంగిపొర్లుతున్న యమునా నది కారణంగా ఢిల్లీలోని చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇంకా రెస్క్యూ టీం వారు బుధవారం నుంచి పలుచోట్ల చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే […]

Share:

ఢిల్లీలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యమునా నది ఉగ్రరూపంతో పొంగిపొర్లుతోంది. ఇప్పటికే 23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. యమునా నది రికార్డ్ స్థాయిలో ప్రవహించడం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. 

హెచ్చరికలు జారీ: 

రికార్డ్ స్థాయిలో పొంగిపొర్లుతున్న యమునా నది కారణంగా ఢిల్లీలోని చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇంకా రెస్క్యూ టీం వారు బుధవారం నుంచి పలుచోట్ల చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో పడ్డారు. ఇప్పటివరకు ఢిల్లీలోని 23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నది నీట మట్టం 208 నుంచి 205 మీటర్లకు తగ్గినప్పటికీ, ప్రస్తుతం ప్రమాద స్థాయిలోనే ప్రవహిస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

యమునా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని ఇప్పటికే ఖాళీ చేయించింది. ఎక్కడ చూసినా రికార్డ్ స్థాయిలో నీరు ప్రవహిస్తూ కనిపిస్తుంది ఇళ్లల్లోకి, మెడికల్ షాపుల్లోకి, రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ తలదాచుకోడానికి కూడా చోటు లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. 

నీట మునిగిన సుప్రీంకోర్టు: 

మంత్రివర్గ సహచరుల కార్యాలయాలు ఉన్న సెక్రటేరియట్‌తో సహా ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాలు గురువారం వరదల్లో చిక్కుకున్నాయి. శుక్రవారం ఉదయం భారీ వర్షంతో యమునా నదిలో నీటిమట్టం పెరగడంతో రాజ్‌ఘాట్‌ సమీపంలో నీటి ప్రవాహం రికార్డ్ స్థాయిలో కొనసాగింది. ఐటీఓ రోడ్డులో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

డ్రైనేజీలు ఉన్నప్పటికీ, బ్లాక్ అయిపోవడం వల్ల నీరు వెనక్కి రావడంతో గురువారం రాత్రి యమునా వరద నీరు సుప్రీంకోర్టుకు చేరుకుంది. దీనిబట్టే వరద స్థాయి ఎంత ప్రమాది స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు సమీపంలోని మధుర రోడ్డు, భగవాన్ దాస్ రోడ్డులోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. 

ఢిల్లీలో మంచి నీటి కష్టాలు: 

అధికారులు జూలై 16 వరకు అన్ని స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా అనవసరమైన సేవలలో ఉన్న భారీ గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు.యమునా నది నీటి మట్టం పెరగడం వల్ల వజీరాబాద్, చంద్రవాల్ మరియు ఓఖ్లా అనే మూడు వాటర్ ప్లాంట్స్ మూసి వేయడం జరిగింది. . దీని కారణంగా ఢిల్లీ ప్రభుత్వం నీటి సరఫరాను 25 శాతం తగ్గించాలని నిర్ణయించడంతో ఢిల్లీలో ప్రస్తుతం తాగునీటి కొరతను ఏర్పడింది. 

అంతిమయాత్రలు ఆగిపోయాయి: 

అత్యవసర సేవలు అందించే వాహనాలు మినహా భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేక్రివాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఢిల్లీ వాసులు అత్యవసరం కాకపోతే ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా ఆయన కోరారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నిగంబోధ్ ఘాట్‌కు వెళ్లవద్దని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం ఒక హెచ్చరిక జారీ చేసింది. యమునా నీటిమట్టం పెరగడంతో గీతాకాలనీలోని శ్మశానవాటికను కూడా మూసివేశారు.

పడవలతో, తాళ్లు మరియు ఇతర పరికరాలతో కూడిన పన్నెండు జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు గురువారం ఢిల్లీ ఫైర్ సర్వీస్ మరియు పోలీసులతో కలిసి రెస్క్యూ మరియు తరలింపు పనిని కొనసాగించాయి. 

ఎక్కువ అవుతున్న వరదలు: 

ఏది ఏమైనప్పటికీ అకాల వర్షాలు, అధిక వర్షాలు ప్రస్తుత కాలంలో ఎక్కువ అయ్యాయని చెప్పుకోవాలి. దీనంతటికీ కారణం కేవలం పెరుగుతున్న కాలుష్యమే కారణం. అధిక వర్షాలు వచ్చినప్పుడు, వరదలు ముప్పు పొంచి ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు వర్షాలు పడక ముందు కాలుష్యం తగ్గించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు పబ్లిక్.