ఎయిర్ ఇండియాలో పేలిన మొబైల్

ఢిల్లీకి వెళ్ళనున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ పేలిన సంఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ చేసిన కొంత సమయం తర్వాత పైలెట్ మంటలు చూసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్లో మొబైల్ పేలుళ్ల కలకలం:  మొబైల్ ఫోన్ రేడియేషన్ దీనికి కారణం కావచ్చు అని పలమారు భావిస్తున్నారు. పైలెట్ ఏటీసీ కి  అన్ని వివరాలు చెప్పారు. ఎమర్జెన్సీ లాండింగ్ తర్వాత ఒక గంట లోపల మళ్లీ ఫ్లైట్ టేక్ […]

Share:

ఢిల్లీకి వెళ్ళనున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ పేలిన సంఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ చేసిన కొంత సమయం తర్వాత పైలెట్ మంటలు చూసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఫ్లైట్లో మొబైల్ పేలుళ్ల కలకలం: 

మొబైల్ ఫోన్ రేడియేషన్ దీనికి కారణం కావచ్చు అని పలమారు భావిస్తున్నారు. పైలెట్ ఏటీసీ కి  అన్ని వివరాలు చెప్పారు. ఎమర్జెన్సీ లాండింగ్ తర్వాత ఒక గంట లోపల మళ్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అనేది జరిగింది.

గతంలో కూడా ఇదే విధంగా ఇండిగో ఫ్లైట్ లో మొబైల్ ఫోన్ వల్ల మంటలు రేగిన సంఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ నుండి డెహ్రాడూన్ వెళ్లే ఇండిగో ఫ్లైట్ 6E 2134  లో ఈ సంఘటన జరిగింది. పైలెట్ ఏటీసి తో మాట్లాడి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

అసలు మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతున్నాయి: 

ప్రస్తుతం ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్స్ హవా నడుస్తోంది. పిల్లవాడు చేతిలో లేకపోయినా మొబైల్ ఫోన్ మాత్రం కనిపిస్తుంది. చివరికి ముసలి వాళ్లు కూడా మొబైల్ ఫోన్ లేకుండా క్షణం ఉండలేకపోతున్నారంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడికి ఎంత సరవేగంగా ప్రపంచమంతా వ్యాపించిందో తెలుస్తుంది. ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు మొబైల్ ఫోన్లు తప్పకుండా ఉంటున్నాయి. 2020 కరోనా వైరస్ వచ్చిన తరువాత ముఖ్యంగా విద్యార్థులకు మొబైల్ ఫోన్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం స్కూలు సిలబస్ మొబైల్ ఫోన్లో చదువుకొని వినాల్సి వచ్చేది. 

ఇదే క్రమంలో మొబైల్ ఫోన్లు వాడకం ఎక్కువైంది. చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి పని కూడా మొబైల్ ఫోన్ ద్వారానే చేస్తున్నారు. మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే కాలమే ఆగిపోయేంత పని అవుతుంది.. ప్రస్తుతం ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో, ఫోన్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. 

మొబైల్ ఫోన్స్ కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పరోక్షంగా మొబైల్ ఫోన్ లో వాడకం మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసిందని చెప్పాలి. ప్రస్తుతానికి మొబైల్ ఫోన్స్ నిరంతరం వాడుతున్న సందర్భంలో పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టి వాడటం కారణమే వేలులకి ముఖ్య కారణాలు.అయితే చార్జింగ్ పెట్టిన అనంతరం మీ మొబైల్ వాడడం, మొబైల్ ఫోన్స్ లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, చార్జింగ్ లేకపోయినప్పటికీ ఎక్కువ సేపు మొబైల్ వాడకంలో ఉండటం పేలుళ్లకు ముఖ్య అంశాలు. అందుకే మొబైల్ విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. లేదంటే మొబైల్ పేలుడు సంభవించే అవకాశం ఉంది. 

రేడియేషన్ డేంజర్: 

ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ ఎక్కువ లేకపోయినా, లేదంటే సిగ్నల్ సరిగ్గా లేకపోయినా మన మొబైల్ వాడకం తగ్గించాలి.. ఎందుకంటే చార్జింగ్ లేనప్పుడు, సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మొబైల్ వాడితే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే మొబైల్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఏరోప్లేన్ లో వెళ్తున్నప్పుడు, మొబైల్ తప్పకుండా ఏరోప్లేన్ మోడ్ లో ఉంచుకోవడం తప్పనిసరి.