New Delhi: రాజధానిలో తారస్థాయికి చేరిన కాలుష్యం

New Delhi: మన రాజధాని ఢిల్లీ (New Delhi)లో ప్రస్తుతం కాలుష్యం  (Pollution) తారస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. కాలుష్యం  (Pollution) కారణంగా చాలామంది బయటికి వెళ్లేందుకే ఇబ్బందులు పాలు అవుతున్నారు. ప్రతి ఏటా శీతాకాలం (Winter) సమయం లో ఢిల్లీ (New Delhi) వాసులు కాలుష్య బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్న క్రమం కనిపిస్తోంది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రైమరీ స్కూల్లకు (School) నవంబర్ 2 వరకు సెలవులు ప్రకటించగా ఇప్పుడు.. నవంబర్ […]

Share:

New Delhi: మన రాజధాని ఢిల్లీ (New Delhi)లో ప్రస్తుతం కాలుష్యం  (Pollution) తారస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. కాలుష్యం  (Pollution) కారణంగా చాలామంది బయటికి వెళ్లేందుకే ఇబ్బందులు పాలు అవుతున్నారు. ప్రతి ఏటా శీతాకాలం (Winter) సమయం లో ఢిల్లీ (New Delhi) వాసులు కాలుష్య బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్న క్రమం కనిపిస్తోంది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రైమరీ స్కూల్లకు (School) నవంబర్ 2 వరకు సెలవులు ప్రకటించగా ఇప్పుడు.. నవంబర్ 10 వరకు సెలవులు పొడిగించినట్లు తెలుస్తోంది.

రాజధానిలో తారస్థాయికి చేరిన కాలుష్యం:

ఢిల్లీ (New Delhi)లో కాలుష్యం  (Pollution) కారణంగా ప్రైమరీ స్కూల్లకు (School) సెలవులు ప్రకటించగా, మరోవైపు 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు స్కూల్లో (School) విద్యా బోధన నిర్వహించవచ్చు, లేదంటే ఆన్లైన్ తరగతులు నిర్వహించిన పర్లేదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఢిల్లీ (New Delhi)లో ఎటువంటి కన్స్ట్రక్షన్ పనులు జరగకుండా, డీజిల్ బళ్ళు నిషేధించడం, చెత్తను తగలబెట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహించకుండా.. చర్యలు తీసుకుంటామని ఢిల్లీ (New Delhi) పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఇప్పటికీ కూడా ఢిల్లీ (New Delhi)లోని కాలుష్యం  (Pollution) అరికట్టడంలో భాగంగా నిరంతరం 18 వేల ట్యాంకర్ల నీళ్లు, రోడ్ల మీద, చెట్ల మీద చల్లడం జరుగుతుంది.

కాలుష్య నగరాల జాబితాలో భారత్ నగరాలు:

Pollution: 2023 సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే అత్యధిక వేడి నమోదైన సంవత్సరంగా శాస్త్రవేత్తలు (scientists) గుర్తించారు. ముఖ్యంగా కాలాలు మారుతున్నప్పటికీ ఎడతెరపలేని ఎండ కారణంగా, ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఎడారుల మారుతున్నాయి. దీనంతటికీ కారణం కేవలం కాలుష్యం (Pollution). దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ (Global Warming) ఏర్పడుతోంది. అంతేకాకుండా రాను రాను భూమి (Earth) మీద మనుగడ సాగించడం కూడా కష్టమే అంటూ వాతావరణాని (Climate)కి సంబంధించిన కొన్ని అంశాలను శాస్త్రవేత్తలు (scientists) వివరించడం జరిగింది. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన కొన్ని నగరాలు (City), అత్యధిక కాలుష్య నగరాల (City) జాబితాలో చేరాయి. 

ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution)కి పెట్టింది పేరుగా మారిపోయింది. న్యూ ఢిల్లీ (New Delhi) తో పాటు, కోల్ కత్త (Kolkata), ముంబై (Mumbai) లో కూడా కాలుష్యం (Pollution) రోజురోజుకు ఎక్కువైపోతున్న క్రమం కనిపిస్తోంది. శీతాకాలం (Winter) మొదలైన సమయానికి దట్టమైన మంచితోపాటు, కాలుష్యం (Pollution) ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు తగ్గిపోతుంది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ (New Delhi), పాకిస్తాన్ దేశంలో లాహోర్ (Lahore), కోల్ కత్త (Kolkata), ముంబై వంటి ప్రధాన నగరాల (City)లో ఎయిర్ క్వాలిటీ రేట్ పూర్తిగా పడిపోయింది. ప్రజలను బయటికి రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. శీతాకాలం (Winter)లో ఎక్కువ గాలులు లేకపోవడం వల్ల, ఎక్కడ కాలుష్యం (Pollution) అక్కడే నిలిచిపోయి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణంగా భారతదేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఎయిర్ క్వాలిటీ, AQI 0-50 వరకు ఉంటే, కాలుష్యం (Pollution) లేనట్టు. AQI 400 నుంచి 500 మధ్యలో ఉంటే, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నట్టు. ఇప్పుడు న్యూఢిల్లీ (New Delhi)లో AQI 483, పాకిస్తాన్ లాహోర్ లో AQI 371, తర్వాత కోల్ కత్త (Kolkata)లో AQI 206గా ఉండగా ఈ మూడు నగరాలు (City) అత్యధిక కాలుష్యం (Pollution)తో నిండిన నగరాలుగా (City) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తరువాత బంగ్లాదేశ్, చైనా, కువైట్ కి చెందిన నగరాలు (City) అత్యధిక కాలుష్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కాలుష్యం (Pollution) కారణంగా ఢిల్లీలో జరగాల్సిన బంగ్లాదేశ్ – శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ కూడా వచ్చే శుక్రవారంకి వాయిదా పడింది.