Pollution: దీపావళి తర్వాత అమాంతం పెరిగిన ఢిల్లీ కాలుష్యం

అప్రమత్తమవుతున్న అధికారులు..

Courtesy: Pexels

Share:

Pollution: ఢిల్లీ (New Delhi)లో పెరుగుతున్న కాలుష్యం (Pollution) కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కాలుష్య కారకాల శాతం 140% అధికమైనట్లు వాతావరణ కాలుష్య అధికారులు వెల్లడించారు. దీపావళి (Diwali)కి ముందు ఉదయం సమయంలో ఎయిర్ క్వాలిటీ AQI 200 ఉండగా, దీపావళి (Diwali) తర్వాత ప్రస్తుతం 400 దాటి 500కు చేరుకున్నట్లు ఢిల్లీ (New Delhi) వాతావరణ కాలుష్య శాఖ అధికారులు వెల్లడించారు. 

 

అమాంతం పెరిగిన ఢిల్లీ కాలుష్యం: 

ఊపిరితిత్తులను ప్రభావితం చేసే, ప్రధాన ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రధాన కాలుష్య కారకాల శాతం, గత ఉదయం నుండి 24 గంటల వ్యవధిలో 140% భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీపావళి (Diwali) తర్వాత ఢిల్లీ (New Delhi)లో గాలి నాణ్యత విషపూరిత స్థాయికి దిగజారింది. PM2.5, గాలిలో ఉన్న అన్ని కణాలలో అత్యంత హానికరమైనది, ఉదయం 7 గంటలకు గంటకు సగటున 200.8గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) నమోదు చేసిన వివరాల ప్రకారం నిన్న ఇదే సమయానికి 83.5గా నమోదైంది. 

 

ఢిల్లీ (New Delhi)లో రోజురోజుకీ కాలుష్యం (Pollution) అధికంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution) కారణంగా అనారోగ్య సమస్యలు  (Problem) వాటిల్లుతాయి అంటూ కొన్ని విషయాలు పాటించవలసిందిగా కోరుతుంది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు (School) సెలవులు ప్రకటించింది ఢిల్లీ (New Delhi). కాలుష్యం (Pollution) తారస్థాయికి చేరడంతో శ్వాసకోశ  (Respiratory) సమస్యలు  (Problem) ఎదురవుతాయి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీపావళి (Diwali) నాడు ఉదయం ఏడు గంటలకు, ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు కారణంగా ఢిల్లీ (New Delhi)లో కాలుష్యం (Pollution) కాస్త తగ్గినప్పటికీ, దీపావళి తర్వాత కాలుష్య శాతం అమాంతం పెరిగినట్లు ఢిల్లీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) అధికారులు ప్రకటించారు.

 

ఢిల్లీలో క్రాకర్స్ కాల్చడం బ్యాన్: 

ఢిల్లీ (New Delhi)లోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించింది ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం. తీవ్రమైన వాయు కాలుష్యం (Pollution)తో పోరాడుతున్నందున పాఠశాలలు (School) ఇప్పటికే తాత్కాలికంగా సెలవులు ప్రకటించింది. మరోవైపు కార్యాలయాలను మూసివేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని కాలుష్య కారణంగా పలు ఆంక్షలు తీసుకోవాలి అంటూ నిర్ణయాలు చేస్తున్నారు. గత మూడేళ్ల కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాజధాని నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం మరియు వినియోగంపై సమగ్ర నిషేధాన్ని ఢిల్లీ (New Delhi) ప్రకటించింది.

 

అయితే, రాజధానిలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి అక్కడక్కడ పటాకులు కాల్చిన సంఘటనలు నమోదయ్యాయి. అయితే ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఎయిర్ క్వాలిటీ AQI 200 ఉండగా, తక్కువ ఉష్ణోగ్రతలు మరియు బాణసంచా కాల్చడం వల్ల ఆదివారం రాత్రి ఢిల్లీ (New Delhi)లో కాలుష్య స్థాయిలు కాస్త పెరిగినట్లే తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution) లో తిరగడం అనేది, రోజుకి 12 నుంచి 13 సిగరెట్లు కాల్చడంతో సమానమని డాక్టర్లు వెల్లడించారు. అయితే ఢిల్లీ (New Delhi)లో వర్షపాతం నమోదు అయితే తప్పకుండా కాలుష్య పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటూ అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఆరోగ్యం జాగ్రత్త: 

కలుషితమైన (Pollution) గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ మరియు పర్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉంటాయి, ఇవి ఊపిరితిత్తుల (Lungs) పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వ్యాయామం (Exercise) చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు కలుషితమైన (Pollution) గాలిని ఎక్కువ మొత్తంలో పీల్చుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మెల్లమెల్లగా, ఇది ఊపిరితిత్తుల (Lungs) పనితీరును తగ్గిస్తుంది. ఆస్తమా మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.