మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో మాటల యుద్ధం

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఓబిసీ వారికి కూడా, ఇప్పుడు ఆమోదించిన 33% […]

Share:

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఓబిసీ వారికి కూడా, ఇప్పుడు ఆమోదించిన 33% మహిళా రిజర్వేషన్ లో చోటు దక్కించాలని డిమాండ్ చేయడం జరిగింది. 

మాటల యుద్ధం: 

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభ సమావేశంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇతర ఓబిసీ తరగతులకు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయగా, బిజెపి ఎంపి నిషికాంత్ దూబే మాట్లాడుతూ, మళ్లీ రాజకీయం కోసం కొత్త మాటలు మాట్లాడుతున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపించారు. అంతేకాకుండా, మహిళా శాసనసభ్యుల రిజర్వేషన్లో ఓబిసి కోటా గురించి, కాంగ్రెస్ పార్టీ మునుపు ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే బిజెపి నేతృత్వంలో, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి వచ్చినందుకు కాంగ్రెస్ చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తుందని ఆయన భావించారు. అంతేకాకుండా తమ ప్రధానమంత్రి తన మాట నిలబెట్టుకున్నాడని అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ఆడవారి కోసం ప్రత్యేకమైన బిల్లు తీసుకువచ్చిన ఘనత బిజెపి అంటూ ప్రస్తావించారు.  కాంగ్రెస్ నేతృత్వంలో రిజర్వేషన్లు పేరు మీద జరిగిన అక్రమాలు ఇక చాలు అంటూ, ఇకమీదట ఆడవారి రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేయకుండా ఎవరూ ఆపలేరు అంటూ మరొకసారి గుర్తు చేశారు, బిజెపి ఎంపి నిషికాంత్ దూబే.

మాట్లాడిన సోనియా: 

ఆడవారి శక్తి అమోఘమైనదని, తాము తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్లే సాధించి చూపిస్తారని, పొగలో ఎప్పుడు వంటగదికే అంకితమయ్యే ఆడవాళ్లు, స్టేడియంలో తమ ఆడవారి సత్తా చూపించి భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఎంతోమంది ఆడవాళ్ళ ప్రయాణం గురించి ప్రస్తావించారు సోనియాగాంధీ. అంతేకాకుండా పీవీ నరసింహారావు పాలనలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రోజుల్లోనే, తన భర్త రాజీవ్ గాంధీ ఆడవారి రిజర్వేషన్ల గురించి ప్రస్తావన జరిగిందని, రాజ్యాంగ సవరణ గురించిన ఆలోచన జరిగిందని, ఆనాటి రాజీవ్ గాంధీ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది అని, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడటం జరిగింది సోనియా గాంధీ. 

అయితే ఇంకెన్నాళ్లు ఆడవాళ్లు తమ హక్కుల గురించి పోరాటం చేయాలని, ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలని తక్షణమే బిల్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భారత దేశంలో కుల గణన లెక్కింపులు ఎందుకు జరగట్లేదు అని.. తక్షణమే ఈ కుల గణన లెక్కింపులు జరిగి, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ముఖ్యమైన ప్రక్రియ ముందు జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం జరిగింది. 

మహిళా రిజర్వేషన్ బిల్లు: 

రాష్ట్ర శాసనసభలలో, పార్లమెంటులోని మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు (33 శాతం) మహిళలకు రిజర్వ్ చేయాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కోరడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం కోటాలో సబ్‌ రిజర్వేషన్లను బిల్లు ప్రతిపాదిస్తోంది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించే అవకాశం ఉంటుంది. 

ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ, మహిళల రిజర్వేషన్లు అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చిరకాల కోరిక అంటూ మరొకసారి గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, బిల్లు గురించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో చాలా బాగా చర్చించారని.. కొన్ని విషయాలలో సీక్రెట్స్ మైంటైన్ చేస్తూ పనిచేయడానికి బదులుగా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లడం చాలా మంచిది అని భావించారు మంత్రి.