ఎస్టీలుగా వాల్మీకులు.. ఆమోదిస్తూ అసెంబ్లీలో తీర్మానం

వీరు 2019 ఎన్నికలలో YSRCPకి మద్దతు ఇచ్చారు. వాల్మీకులను ఎస్టీలుగా  చేర్చుకోవడం వల్ల ప్రస్తుత కోటాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఏపీ సీఎం జగన్ ఇతర గిరిజన వర్గాలకు హామీ ఇచ్చారు. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో బోయ (వాల్మీకి) వర్గాన్ని చేర్చడంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన నెల రోజుల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత వారం అసెంబ్లీలో ఈ రకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేర్చాలని […]

Share:

వీరు 2019 ఎన్నికలలో YSRCPకి మద్దతు ఇచ్చారు. వాల్మీకులను ఎస్టీలుగా  చేర్చుకోవడం వల్ల ప్రస్తుత కోటాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఏపీ సీఎం జగన్ ఇతర గిరిజన వర్గాలకు హామీ ఇచ్చారు.

షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో బోయ (వాల్మీకి) వర్గాన్ని చేర్చడంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన నెల రోజుల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత వారం అసెంబ్లీలో ఈ రకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఏపీ అసెంబ్లీ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ దళిత ముస్లింలు, క్రిస్టియన్లకు రిజర్వేషన్  కోటా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మాత్రం దీనిని వ్యతిరేకిస్తూ.. ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థతో ముడిపడి ఉండకూడదని, కోటాను పొడిగించకూడదని కమిటీకి, కేంద్రానికి నివేదించింది..

ఇక.. వాల్మీకులను ఎస్టీ కేటగిరీలో చేర్చడంపై అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, ప్రస్తుత రిజర్వేషన్ కోటాపై  ఎలాంటి ప్రభావం ఉండదని, ఇతర గిరిజన వర్గాల వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. 2019 మేలో అధికారంలోకి రాకముందు తాను చేపట్టిన పాదయాత్రలో.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం తెలిపారు.

కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వాల్మీకి వర్గీయులను ఈ జాబితాలో చేర్చడం వల్ల.. ఆరు పాయింట్ల ఫార్ములా ప్రకారం జోన్ల వ్యవస్థ అమల్లో ఉన్నందున, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీల కోటా ఏ మాత్రం తగ్గదని,  అలాంటి భయాన్ని పెట్టుకోవద్దని సీఎం పేర్కొన్నారు. బోయలు (వాల్మీకులను) చేర్చడం వల్ల నాన్-జోనింగ్ కేటగిరీ కింద వచ్చే గ్రూప్ 1 ఉద్యోగాలపై అతి తక్కువ ప్రభావం ఉంటుంది. గత 10 సంవత్సరాలలో కేవలం 386 గ్రూప్ 1 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వబడింది. ఆరు శాతం రిజర్వేషన్లు కేవలం 21 లేదా 22 పోస్టులకు మాత్రమే పరిమితం కావడం వల్ల ఇది చాలా తక్కువ అవుతుందని పేర్కొన్నారు.

నాలుగు జిల్లాల్లోని బోయల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఏకసభ్య కమిషన్‌ నిర్ణయాన్ని ఎస్‌టీ కమిషన్‌ కూడా  అంగీకరించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

జోనల్ వ్యవస్థ మరియు జిల్లాలలోని ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఉద్యోగాలలో.. 99 శాతం ఉండటం వల్ల.. వాల్మీకులను ఎస్టీ గ్రూప్‌లో చేర్చడం వల్ల గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలోని STల ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది ఉందని తెలిపారు.

“మా ఎస్టీల అతి పెద్ద భయం ఏమిటంటే.. ఇతర సంఘాలను తమ గ్రూప్‌లో చేర్చినప్పుడు ఉద్యోగాలు పోతాయనేది మా భయం” అని ఎస్టీ నాయకుడు వి రంగారావు అన్నారు.

బోయలు గతంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేవారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్  పార్టీ ప్రాబల్యం తగ్గిపోవడంతో..  2019లో వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించింది. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత, ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌ను మళ్లీ బోయ సంఘం లేవనెత్తింది. దీంతో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.. బోయ కులస్తులకు సహాయం చేయాలనీ,  పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయా వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్రానికి సిఫారసు చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి తీర్మానాన్ని చదివి వినిపించారు.