88వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామా

కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలను శాంతియుత దారిలోకి తీసుకువెళ్లే దలైలామా పద్ధతులు ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు ప్రస్తుతం 14వ దలైలామా ప్రజలకు ఎన్నో మంచి విషయాలు నేర్పించడంలో సహాయపడుతున్నారు. ఆయన టెన్జిన్ గ్యాట్సో, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అన్ని జీవులను సమానంగా గౌరవించాలి అంటూ తమదైన శైలిలో ప్రసిద్ధి చెందారు.  నిజానికి దలైలామాలు బుద్ధుడుకి సంబంధించిన కొన్ని అంశాలను నిష్టగా పాటిస్తారు. వాడు పూర్తిగా బుద్ధుడిలో లీనమైపోతారు. హింస గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. ఏ […]

Share:

కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలను శాంతియుత దారిలోకి తీసుకువెళ్లే దలైలామా పద్ధతులు ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు ప్రస్తుతం 14వ దలైలామా ప్రజలకు ఎన్నో మంచి విషయాలు నేర్పించడంలో సహాయపడుతున్నారు. ఆయన టెన్జిన్ గ్యాట్సో, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అన్ని జీవులను సమానంగా గౌరవించాలి అంటూ తమదైన శైలిలో ప్రసిద్ధి చెందారు. 

నిజానికి దలైలామాలు బుద్ధుడుకి సంబంధించిన కొన్ని అంశాలను నిష్టగా పాటిస్తారు. వాడు పూర్తిగా బుద్ధుడిలో లీనమైపోతారు. హింస గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. ఏ సమస్య అయినా ఆ శాంతియుతంగా పరిష్కరించాలి అనేది వారి నినాదం. వారిని అనుసరించే కొంతమంది యువకులను కూడా వారు శాంతియుతంగా ఉండాలని ఎప్పుడూ మంచి విషయాలు చెప్తుంటారు. ఉదయాన్నే నాలుగు గంటలకి ముందుగానే లేవడం, శాఖాహారమే తినడం, శాంతియుతంగా మెసలడం, ఇతరులకు సేవ చేయడం, భక్తిలో ఉండడం. ఇలా దలైలామాను ఇలా ఎన్నో నియమాలు ఉంటాయి.

దలైలామా గురించి మరింత తెలుసుకుందాం: 

1959 నుండి భారతదేశంలోని ధర్మశాలలో నివసిస్తున్నారు దలైలామా. తర్వాత అతనికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనే చాలా రోజులుగా డిమాండ్లు కూడా వినిపించాయి. 

14వ దలైలామా, టెన్జిన్ గ్యాట్సో జూలై 6, 1935న టిబెట్‌లోని అమ్డోలోని తక్సేర్‌లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. లామో ధోండుప్‌గా జన్మించిన అతను 13వ దలైలామా తుబ్టెన్ గ్యాట్సో ఏ మళ్లీ పుట్టారని ప్రతి ఒక్కరు అన్నారు. తరువాత దలైలామాల గురించి, వారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా, బుద్ధునికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకోవడమే కాకుండా దాన్ని అనుసరించడం తనకు ఎంతో బాగా నచ్చింది. తెలియకుండానే వారిలో కొన్ని నియమాలనేవి ఏర్పడడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, ఆయనలో కనిపించిన మార్పులు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు కూడా.

1989లో, దలైలామా ” ప్రతి జీవిని మనం ఎంతో గౌరవించాలి, మనిషికి ప్రకృతికి ఎప్పుడు మంచి సంబంధం ఏ ఉండాలి” అని ఆయన తెలిపిన విషయాలకు గౌరవార్థం నోబెల్ శాంతి బహుమతితో సత్కరించారు.

ఇటీవలి కాలంలో, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో దలైలామాను గౌరవించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపించసాగాయి. 2019లో, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ నేతృత్వంలోని 200 మంది పార్లమెంటు దలైలామాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక మెమోరాండంపై సంతకం కూడా చేయడం జరిగింది. 

దలైలామా ప్రపంచానికి అందించిన ప్రత్యేకమైన కొటేషన్స్: 

1. “ప్రతిరోజూ ఉదయం, లేవగానే మనం అందరిలాగే సజీవంగా ఉన్నందుకు ఆనందపడాలి. మనిషిగా పుట్టినందుకు, నాకున్న శక్తులను వృధా కానివ్వను. నన్ను నేను బలపరుచుకోవడానికి శక్తులను ఉపయోగించాలి. ఇతరులకు అదే చెప్పాలి. అందరూ సమానంగా ఉండేలా చూసుకోగలగాలి”. 

2. ఎంత కష్టం ఎదురైనా ఓర్చుకోవడం నేర్చుకోగలిగితే విజయం మనదే లేకుంటే వినాశనాన్ని చూడాల్సి వస్తుంది. 

3. ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమ నిజానికి అవసరానికి మించిన విషయం అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. 

4. ఒక సమస్య పరిష్కరించగలం అని మనకి తెలిసినప్పుడు, చింతించకుండా మనమే పరిష్కరిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ సమస్య పరిష్కరించలేం అని తెలుసుకున్నప్పుడు, దాని గురించి చింతించడం కూడా వృధా. 

5. ఏదైనా విషాదకరమైన సంఘటన మన జీవితంలో ఎదురైనప్పుడు, మనం రెండు విధాలుగా రియాక్ట్ అవ్వచ్చు, మొదటిది మన ఆశలన్నీ వదులుకొని, జరిగే దానికి తట్టుకోలేక దూరలవాటులకు బానిసలుగా మారడం. రెండోది, అది ఒక సవాలుగా తీసుకొని, మనలోని శక్తిని బయటికి తీయడం.