ఓఖీ తుఫాను: పళనిస్వామికి పూర్తి సహాయాన్ని అందిస్తామని ప్రధాని మోదీ హామీ

ఓఖీ తుఫాను ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో మన కళ్ళతో మనం చూసాము. ఎంతో మంది కుటుంబాలను కోల్పోయారు. రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయ్యింది. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తుఫాన్ ప్రభావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వాలని ప్రజలను కోరారు. వరదలు […]

Share:

ఓఖీ తుఫాను ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో మన కళ్ళతో మనం చూసాము. ఎంతో మంది కుటుంబాలను కోల్పోయారు. రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయ్యింది. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తుఫాన్ ప్రభావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వాలని ప్రజలను కోరారు. వరదలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సహాయ చర్యలను కూడా పెంచారు. ఇది ఇలా ఉండగా.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి నిధులు కోరుతూ తమిళనాడు త్వరలో కేంద్రానికి నివేదిక పంపనున్నట్లు పళనిస్వామి తెలిపారు.. ఈ మేరకు తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాల్లో ఓఖీ కారణంగా సంభవించిన నష్టానికి కేంద్రం నుంచి పూర్తి సహాయాన్ని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పూర్తి స్థాయిలో జరుగుతున్న వివిధ సహాయ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆయనకు వివరించారు.అవసరమైన సహాయాన్ని తక్షణమే అందజేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొన్నారు..

దక్షిణ ద్వీపకల్పం మీదుగా వచ్చిన ఓఖీ తుఫాను తమిళనాడు, కేరళలో కనీసం 17 మంది ప్రాణాలను బలిగొంది. రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. కన్యాకుమారి, తిరునెల్వేలి జిల్లాల్లో తుపాను వల్ల సంభవించిన నష్టానికి తమిళనాడు ప్రభుత్వం కేంద్ర నిధులను కోరాలని యోచిస్తున్నప్పటికీ పరిస్థితిని మోదీ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీనియర్‌ మంత్రులు, ఐఏఎస్‌ అధికారులను నియమించడమే కాకుండా పలు చర్యలను పళనిస్వామి స్వయంగా చూసుకున్నారు..

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సమయంలో యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలో చిక్కుకుపోయిన 30 మంది మత్స్య కారులను రక్షించడానికి కోస్ట్ గార్డ్ సహాయం ఉపయోగించబడింది.. అలాగే వారిలో 76 మందిని సహాయక బృందాలు ఇప్పటికే రక్షించినట్లు పళనిస్వామి చెప్పారు. కన్యాకుమారి జిల్లాలో జనజీవనం అతలాకుతలమైన తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని సవివరంగా అంచనా వేసి నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపుతుందని సీఎం మోదీకి తెలిపారు… బెంగాలీ భాషలో ‘కంటి’ అని అర్ధం వచ్చే ఓఖీ తుఫాను శుక్రవారం తీవ్ర తుఫానుగా మారి అరేబియా సముద్రానికి చేరుకుంది. కన్యాకుమారి మరియు తిరునెల్వేలి జిల్లాల్లో తుఫాను కారణంగా 1,200 మందికి పైగా ప్రజలు సహాయక చర్యలు చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.. ఈ తుఫాన్ కారణంగా ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు.. ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. తుఫాన్ బాధితులను ఆదుకోనేందుకు  పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు సాయం ప్రకటిస్తున్నారు.. వరద భాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు.. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాసు కేంద్రాల్లోనే ప్రజలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.