పులుల దాడిలో ఇద్దరు మృతి… ఉత్తరాఖండ్‌లో కర్ఫ్యూ

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా యంత్రాంగం రిఖానిఖాల్ మరియు ధుమాకోట్ తహసీల్‌లలోని పలు గ్రామాలలో తదుపరి ఆదేశాలు వచ్చే  వరకు కర్ఫ్యూను విధించింది.  గత నాలుగు రోజుల్లో ఇద్దరు వృద్ధులు పులుల దాడిలో మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 11 గంటల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది కాకుండా, రెండు తహసీల్‌లలోని పాఠశాలలు మరియు అంగన్‌వాడీలు మంగళవారం వరకు మూసివేయబడతాయి. […]

Share:

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా యంత్రాంగం రిఖానిఖాల్ మరియు ధుమాకోట్ తహసీల్‌లలోని పలు గ్రామాలలో తదుపరి ఆదేశాలు వచ్చే  వరకు కర్ఫ్యూను విధించింది. 

గత నాలుగు రోజుల్లో ఇద్దరు వృద్ధులు పులుల దాడిలో మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 11 గంటల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది కాకుండా, రెండు తహసీల్‌లలోని పాఠశాలలు మరియు అంగన్‌వాడీలు మంగళవారం వరకు మూసివేయబడతాయి. పౌరీ గర్వాల్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఆశిష్ కుమార్ చౌహాన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ సంఘటన స్థానిక నివాసితులను భయాందోళనలకు గురిచేసిందని మరియు పులులు మళ్లీ దాడి చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొన్నారు.

“ల్యాండ్‌స్‌డౌన్ SDM, తహసీల్దార్ రిఖానిఖాల్ మరియు తహసీల్దార్ ధుమ్‌కోట్ పంపిన లేఖల ఆధారంగా, పులి దాడిలో  రిఖానిఖాల్ మరియు ధూమాకోట్‌లలో ఒక్కొక్కరు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళలను గురి చేయడంతో పాటు మళ్లీ పులి దాడి చేసే అవకాశం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రిఖానిఖాల్ పరిధిలోని 10 గ్రామాలు అదేవిధంగా ధూమాకోట్ పరిధిలోని 15 గ్రామాలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాత్రి 7 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూలో ఉంటాయి. స్థానికులు రాత్రిపూట అనవసరంగా తమ ఇళ్లను విడిచిపెట్టకుండా ఉండాలని ఉత్తర్వూలను అక్కడి అధికారులు జారీ చేశారు.

కాగా 73 ఏళ్ల రైతు బీరేంద్ర సింగ్ తన పొలంలో పని చేస్తున్నప్పుడు పులి దాడి చేసింది. పులి అతన్ని పొదల్లోకి లాగి చంపేసిందని స్థానికులు తెలిపారు.. రిఖానిఖాల్  తహసీల్ ప్రాంతంలోని డల్లా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు గోధుమ పంట కోస్తుండగా వెనుక నుంచి పులి అతనిపైకి దూసుకెళ్లింది. సహాయం కోసం అతని కేకలు విన్న కొందరు \కర్రలతో అక్కడికి చేరుకునే సమయానికి పులి కనిపించకుండా పోయింది. రెండవ సంఘటన ధూమాకోట్ తహసీల్ పరిధిలో జరిగింది, ఇందులో రణవీర్ సింగ్ నేగి (75) అనే వ్యక్తిని పులి దాడి చేసి చంపింది. నేగి అనే విద్యాశాఖ రిటైర్డ్ ఉద్యోగి అడవికి సమీపంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. అతడు కాలక్షేపం కోసం బయటికి వెళ్లిన ప్రాంతంలో పెద్ద పులులు  అతనిపై దాడి చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా పెద్ద పులులను ట్రాప్ చేయడానికి పరిపాలన మరియు అటవీ శాఖ ఆ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేసింది. కలగఢ్ టైగర్ రిజర్వ్ మరియు గర్వాల్ ఫారెస్ట్ డివిజన్ నుండి బృందాలు ఈ ప్రాంతంలో రాత్రి పెట్రోలింగ్ కోసం నియమించబడ్డాయి. అక్కడ పెద్ద  పులి కనిపించడంతో డ్రోన్లను కూడా గస్తీకి ఉపయోగిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ఆయా గ్రామంలో బోన్లను కూడా ఏర్పాటు చేసింది.