హరిద్వార్ వీధుల్లో మొసళ్ల  సంచలనం

లక్సర్ , ఖాన్ పూర్ ప్రాంతాలలో మొసళ్ళు: ఉత్తరాది ప్రాంతం మొత్తం గత కొంతకాలం గా కుండపోత వర్షాల కారణం గా వరద నీరు లోతట్టు ప్రాంతాలను మొత్తం ముంచేసింది. తద్వారా జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఈ వరద బీభత్సం కారణం గా జనాల్లో సరికొత్త భయాలు మొదలయ్యాయి. విష సర్పాలు, తేళ్లు , సరిసృపాలు కొన్ని ప్రాంతాల్లో బయటపడ్డాయి. వీటిని అయితే కర్రతో కొట్టి చంపేయగలం, కానీ మొసలి లాంటి క్రూర మృగాలు కూడా ఆ […]

Share:

లక్సర్ , ఖాన్ పూర్ ప్రాంతాలలో మొసళ్ళు:

ఉత్తరాది ప్రాంతం మొత్తం గత కొంతకాలం గా కుండపోత వర్షాల కారణం గా వరద నీరు లోతట్టు ప్రాంతాలను మొత్తం ముంచేసింది. తద్వారా జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఈ వరద బీభత్సం కారణం గా జనాల్లో సరికొత్త భయాలు మొదలయ్యాయి. విష సర్పాలు, తేళ్లు , సరిసృపాలు కొన్ని ప్రాంతాల్లో బయటపడ్డాయి. వీటిని అయితే కర్రతో కొట్టి చంపేయగలం, కానీ మొసలి లాంటి క్రూర మృగాలు కూడా ఆ వరద నీటిలో కొట్టుకొని వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. హరిద్వార్ లో అలంటి సంఘటనే చోటు చేసుకుంది. హరిద్వార్ జిల్లాలోని లక్సర్ , ఖాన్ పూర్ ప్రాంతాలలో మొసళ్ళు దర్శనమిచ్చాయి. హరిద్వార్ లో ఉన్నటువంటి గంగ నది తీవ్రతని మొసళ్ళు తట్టుకోలేక భయపడిపోయాయి. దీనితో అవి ఇళ్ల మీదకు చొరబడ్డాయి. అయితే వాటి వల్ల ఒఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ హాని జరగలేదు, కానీ వాటికి ఆకలి వేస్తే అక్కడ ఉన్న స్థానికులను పకోడీ లాగా నంచుకుని తినేస్తాయి.

12 మొసళ్లను పట్టివేత, 25 మంది ఫారెస్ట్ సిబ్బంది కృషి :

అందుకే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్రమత్తమయ్యారు. వెంటనే మొసళ్లను పట్టుకునే చర్యలు చేపట్టారు. గంగ నది మరియు దాని ఉపనదులైన గంగా, సోనాలి లాంటి నదులు కూడా ఉప్పొంగడం వల్ల అందులో ఉండే జీవరాసులు మొత్తం నగరవీదుల్లోకి వచ్చేస్తున్నాయి. జన సమాచారం అధికంగా ఉండే  లక్సార్, ఖాన్‌పూర్ వంటిప్రాంతాలలో ఇప్పటి వరకు 12 మొసళ్లను పట్టుకున్నట్టుగా అటవీ శాఖా అధికారులు చెప్పుకొచ్చారు. వీటికోసం 25 మంది సిబ్బంది అహర్నిశలు కృషి చేసి, ప్రాణాలకు తెగించి మరీ రిస్క్ చేసారు..ఇదిలా ఉండగా గత వారం నుండి ఉత్తర భారత దేశం లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న  భారీ వర్షాల వల్ల గంగా నది నీటి స్థాయి రికార్డు స్థాయికి పెరిగిపోయింది. గడిచిన 40 ఏళ్లలో ఈ స్థాయి వరదలు ఎప్పుడూ కూడా చూడలేదని, మొట్టమొదటిసారి ఇలాంటి వరదల్ని చూస్తున్నాము అంటూ చెప్పుకొస్తున్నారు.

ఖాన్‌పూర్‌లోని ఖేడికలన్ గ్రామంలోని ఒక ఇంట్లోకి చొరబడి బాత్‌రూమ్‌లోకి  పెద్ద మొసలి ప్రవేశించిందని,అటవీ శాఖ బృందం దానిని పట్టుకుని తిరిగి నదిలోకి వదిలిందని స్థానిక నివాసి అమిత్ గిరి అనే వ్యక్తి  తెలిపాడు.ఇలా ఎన్నో ప్రాంతాలలో మొసళ్ళు నాగరాల్లోకి ప్రవేశించింది అనే సమాచారం తెలిసిన నిమిషాల వ్యవధి లోనే అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రూర మృగాలను దూరం నుండి చూస్తేనే భయపడి పోతాము, అలాంటిది మన ఇళ్లల్లోకి చొరబడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్కసారి మనకి అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ మొసళ్ల కారణం గా ఒక్క ప్రాణ హాని కూడా జరగకపోవడం మరో ఆశ్చర్యాన్ని కలుగచేసే విషయం. ఇకపోతే ఉత్తరాదిన వరద ఉదృతి ఏమాత్రం తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాలను రెడ్ జోన్స్ గా , యెల్లో జోన్స్ గా పరిగణించారు. వారం రోజులు దాటుతున్న కూడా వర్షాలు ఎడతెరపి లేకుండా పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఇప్పటికే అలా పాతిక వేల మందిని తరలించగా అందులో 18 వేల మందిని క్యాంపులకు తరలించారు. రాబొయ్యే రోజుల్లో అయినా ఈ వర్షాలు తగ్గుతుందో లేదో చూడాలి.