BA.2.86 కరోనా వేరియంట్ కోసం ప్రస్తుత టీకాలు సరిపోతాయి: నిపుణులు

2020లో కరోనా సమయంలో ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారు తెలిసిన విషయమే. సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, కరోనా మరెన్నో రూపాలు దాల్చి విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రజలు టీకాలు వేసుకొని అప్రమత్తంగా ఉంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ మరో వేరియంట్ రూపంలో మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తుందని కొన్ని దేశాల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుతం టీకాలుగా వేసుకుంటున్నా కరోనా వైరస్ కు సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ […]

Share:

2020లో కరోనా సమయంలో ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారు తెలిసిన విషయమే. సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, కరోనా మరెన్నో రూపాలు దాల్చి విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రజలు టీకాలు వేసుకొని అప్రమత్తంగా ఉంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ మరో వేరియంట్ రూపంలో మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తుందని కొన్ని దేశాల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుతం టీకాలుగా వేసుకుంటున్నా కరోనా వైరస్ కు సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది అంటున్నారు నిపుణులు.

కొత్త వేరియంట్: 

BA.2.86 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ప్రస్తుతం విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎమర్జింగ్ వేరియంట్ వేగవంతమైనది కానప్పటికీ మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. దీనికన్నా ముందు వచ్చిన BA.2 సబ్‌వేరియంట్ ఒమిక్రాన్‌ వేరియంట్ కన్నా డిఫరెంట్. డాక్టర్ జెస్సీ బ్లూమ్, ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ సెంటర్‌లో వైరల్ ఎవల్యూషన్‌లో స్పెషలిస్ట్ అయిన ఒక సైంటిస్ట్, వ్యాప్తి చెందుతున్న వేరియంట్ గురించి వివరంగా తెలపడం జరిగింది. 

USతో సహా నాలుగు దేశాలలో BA.2.86 వేరియంట్‌కు సంబంధించిన కేవలం ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు ఆ ఆరు కేసుల ద్వారా ఎంతమందికి వ్యాప్తి చెందింది అనే దాని గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO BA.2.86ని “పర్యవేక్షణలో ఉన్న వేరియంట్”గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ కూడా దేశాలు పాటించాలని మరోసారి గుర్తు చేయడం జరిగింది. మూడు సంవత్సరాల అవుతున్నప్పటికీ కరోనా కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, ఎంతోమందితో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు హడలు పుట్టిస్తున్న ఈ కరోనా వైరస్ వేరియంట్ ఇజ్రాయిల్, డన్మార్క్, అమెరికా, యుకెలతో పాటుగా ఇప్పుడు స్విజర్లాండ్, సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా, మునుపు తీసుకున్నా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, టీకాలు ముందుగానే తీసుకోవడం మంచిది అంటుంది వర్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రతి దేశంలో ఏవైతే కరోనా వైరస్ నిరోధించడానికి టీకాలు వేసుకుంటున్నామో, ఇప్పుడు వచ్చిన కొత్త కరోనా వేరియంట్ బారి నుండి బయటపడేందుకు అవి సరిపోతాయి అంటున్నారు నిపుణులు.

కరోనా తర్వాత పెరిగిన హఠాత్ మరణాలు: 

ఇటీవల కాలంలో ఎంతోమంది హఠాత్తుగా మరణించడం చాలామంది చూస్తున్నాం. కరోనా సోకిన పేషంట్లలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పటికి క్లారిటీ లేదు. దీని గురించి తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రెండు అధ్యాయాలు చేయనుంది. ముఖ్యంగా యువత కోవిడ్ అనంతరం ఎందుకు హఠాత్ మరణాలకు గురవుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే రీసెర్చ్ లో భాగంగా ముఖ్య కారణాలు తెలుసుకుని మరిన్ని మరణాలను నిరోధించవచ్చు అని నివేదికలో పేర్కొంది ఐసిఎంఆర్.

ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్, ముఖ్యంగా 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ (జిసిటిఎం) సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి కారణాలు లేకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి, దాని గురించే ఈ అధ్యయనాలు అంటూ వెల్లడించారు. ఈ మరణాలు ఎందుకు సంభవించాయో తెలుసుకోవడానికి వేరే మార్గం లేదు అంటూ ప్రస్తుతం జరగబోయే రీసెర్చ్ గురించి క్లుప్తంగా వివరించారు ICMR డైరెక్టర్.