కోవిడ్ వ్యాక్సిన్‌లు, రెస్క్యూ ఆపరేషన్‌లు, అవసరమయ్యే సహాయం:
ఇతర దేశాలకు సహాయపడే మిత్ర దేశం భారత్

గయానా అధ్యక్షుడు డా. ఇర్ఫాన్ అలీ ఇటీవల ప్రపంచ కథనంలో భారతదేశ విదేశాంగ విధానం, మన దేశం యొక్క స్థానాన్ని సూచించే విషయాన్ని ప్రస్తావించారు. భారతదేశం యొక్క గ్లోబల్ వ్యాక్సిన్ పాలసీపై అధ్యక్షుడు అనర్గళంగా ప్రసంగించారు. ముఖ్యంగా ప్రపంచీకరణ విఫలమైన సమయాల్లో ప్రేమ, భవిష్యత్తుపై ఆశల కోసం నిలబడినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆయన కరోనా వైరస్ సమయంలో వచ్చిన సంక్షోభం గురించి మాట్లాడారు. భారతదేశం, తన దేశంలో ఒక్కొక్క శతాబ్దానికి ఒక్కొక్క సారి […]

Share:

గయానా అధ్యక్షుడు డా. ఇర్ఫాన్ అలీ ఇటీవల ప్రపంచ కథనంలో భారతదేశ విదేశాంగ విధానం, మన దేశం యొక్క స్థానాన్ని సూచించే విషయాన్ని ప్రస్తావించారు. భారతదేశం యొక్క గ్లోబల్ వ్యాక్సిన్ పాలసీపై అధ్యక్షుడు అనర్గళంగా ప్రసంగించారు. ముఖ్యంగా ప్రపంచీకరణ విఫలమైన సమయాల్లో ప్రేమ, భవిష్యత్తుపై ఆశల కోసం నిలబడినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆయన కరోనా వైరస్ సమయంలో వచ్చిన సంక్షోభం గురించి మాట్లాడారు. భారతదేశం, తన దేశంలో ఒక్కొక్క శతాబ్దానికి ఒక్కొక్క సారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, ఏ దేశానికైనా ఆపద వస్తే ఆయా దేశాలకు సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు.

ఒక సంవత్సరం క్రితం.. డొమినికన్ ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్ స్కెరిట్ వ్యాక్సిన్‌ల కోసం సంప్రదించినప్పుడు వేగంగా ప్రతిస్పందనను పొందాలనే ఆశ తనకు లేదని, సంక్షోభ సమయాల్లో మేము ఎలా ప్రతిస్పందించామో అనే విషయం గురించి ఆలోచించుకున్నామని చెప్పారు. ఆ సందర్భంలో సాధారణంగా ఆ దేశం యొక్క శక్తిని, పరిమాణాన్ని పట్టించుకోకుండా, 72,000 జనాభా కలిగిన తన చిన్న ద్వీప దేశానికి భారతదేశం తన స్నేహహస్తాన్ని చాచి, ఎంతో సహకారాన్ని అందించిందని కూడా ఆయన చెప్పారు.

భారతదేశ విదేశాంగ విధానంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి; ఇతర దేశాల పట్ల భారతదేశం ఎంతో సానుభూతిని చూపుతూ అవసరం వచ్చినప్పుడు సహాయపడుతూ ఉండే మిత్ర దేశంగా ఉంది. అవసరమైన సమయాల్లో చేయగలిగిన సహాయాన్ని ఎప్పుడూ అందిస్తుంది. పైన తెలిపిన రెండు సంఘటనలు భారతదేశం యొక్క సేవా తత్వానికి ప్రతీకలు. ఈ భావన మన నాగరికత తత్వాల నుండి మనకి వారసత్వంగా వచ్చింది. అది భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది. భారతదేశం ప్రయోజనం పొందే దేశం యొక్క పరిమాణాన్ని గానీ బలాన్ని గానీ చూడదు. వారి నుండి ప్రతిఫలంగా ఏమీ ఆశించదు. ఎందుకంటే ఆ దేశం భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు వివరించిన ‘కర్మ యోగం’ లోని తత్వమైన ‘నిస్వార్థ సేవ’ చేయడాన్ని నమ్ముతుంది. మన ప్రయత్నాలకు ప్రతిఫలాన్ని గానీ దానివల్ల వచ్చే ఫలితాలను గానీ ఆశించకుండా కర్తవ్యం, అంటే మనం చేయవలసిన పనులను చేయడమే ” ఈ తత్త్వం యొక్క సారం.

భారతదేశం, కొన్ని వేల సంవత్సరాల నుండి, ఎప్పుడూ మానవ సేవను నమ్మింది. ఎందుకంటే ఈ దేశం యొక్క సామాజిక నియమాలు అదే తత్త్వం నుండి ఉద్భవించాయి.  ఏ భారతీయ రాజూ కూడా శత్రు రాజ్యాలలో వచ్చే వ్యాధులు, విపత్తులను ఉపయోగించుకొని ఇతర రాజ్యాలపై దండెత్తినట్లు మనం ఎప్పుడూ విని ఉండము.

భారతదేశం 98 దేశాలకు 235 మిలియన్ వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ లాంటి ప్రపంచ నాయకులు భారతదేశం యొక్క ప్రయత్నాలను, ప్రజాస్వామ్యాన్ని కొనియాడారు. యెమెన్ అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పుడు, ‘ఆపరేషన్ రాహత్’ ప్రారంభించి 41 దేశాల నుండి 960 మంది విదేశీ పౌరులతో పాటు 4,640 మంది భారతీయ పౌరులను రక్షించింది భారత ప్రభుత్వం.

అదేవిధంగా.. దక్షిణ సూడాన్ అటువంటి కలహాలను చూసినప్పుడు, ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ ప్రారంభించి 6,000 మందికి పైగా భారతీయులు, విదేశీయులను, రష్యా-ఉక్రెయిన్ వివాదం సమయంలో, ఆపరేషన్ గంగా ద్వారా 18 దేశాల నుండి 25,000 మంది భారతీయులను మరియు 147 మంది పౌరులను రక్షించింది భారత ప్రభుత్వం.

ప్రపంచంలోని అందరి బాధలనూ మనం దూరం చేయలేము. కానీ ప్రతిఫలాలు ఆశించడం కంటే నిస్వార్థంగా చేయటమే మన దేశ లక్ష్యం.