చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్​ తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. జైలు రిమాండ్‌ను హౌస్ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లయ్యింది. సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది. అయితే.. ఈ తీర్పు తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాదులు […]

Share:

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. జైలు రిమాండ్‌ను హౌస్ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లయ్యింది. సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది. అయితే.. ఈ తీర్పు తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది.

నిన్నటి నుంచి ఏం జరిగింది..?

చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రతలేదని.. ప్రాణహాని ఉందని ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో హౌస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ‘చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉంది. చంద్రబాబు ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు. చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది.

కరడు గట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లోనే ఉన్నారని, సెక్యూరిటీ థ్రెట్ ను అనుసరించే ఎన్ఎస్జి లాంటి భద్రత కల్పించారని చంద్రబాబు తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీ కి సంబధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని సుప్రీం కోర్టు న్యాయవాది లూథ్రా కోర్టుకు విన్నవించారు. గౌతం నవలఖా కేసులో హౌజ్ రిమాండ్ కు సుప్రీం కోర్టు అనుమతించిందనీ పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు ఇవ్వండి. ప్రభుత్వం చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించింది’ అని న్యాయమూర్తికి సోమవారం నాడు లూథ్రా వాదనలు వినిపించారు.

2017 డిసెంబరులో పూణెలో నిర్వహించిన ఎల్గార్‌ పరిషద్‌ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖా (70)పై కేసు నమోదైంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై నమోదైన కేసులో 2021 ఏప్రిల్‌లో ఆయన ఎన్‌ఐఏ ముందు గౌతం నవలఖా లొంగిపోయారు. అనంతరం ఆయన్ను ముంబయిలోని తలోజీ సెంట్రల్‌ జైలుకు తరలించారు. తన వయసు, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హౌస్‌ కస్టడీ విధించాలని నవలఖా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన పిటిషన్ తిరస్కరించారు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవలఖా పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ వయసు, అనారోగ్య కారణాల రీత్యా ముంబయిలో హౌస్‌ కస్టడీలో ఉండేందుకు అనుమతించింది. ఇందుకు పలు షరతులు విధించింది.

ఇల్లు కంటే జైలే బెటర్

అయితే.. హౌస్ కస్టడీ అక్కర్లేదని సీఐడీ తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు హౌస్ కస్టడీ అనేదే సీఆర్పీసీలో లేదని.. ఇల్లు కంటే జైలే బెటరని అన్నివిధాలుగా భద్రతగా ఉందని ఆయన వాదించారు. అంతేకాదు.. చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్యే ఉన్నారని, రక్షణ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పొన్నవోలు కోర్టుకు చెప్పారు. రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుందని.. ఇక పిటిషనర్ ఆరోగ్యం కోసం 24×7 వైద్యులు అక్కడే ప్రభుత్వం ఉంచిందని న్యాయమూర్తికి సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు.

ఉత్కంఠకు తెర..

ఇలా వర్గాల సుదీర్ఘ వాదనలను విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సోమవారం నాడు సాయంత్రానికి తీర్పు ఇస్తారని అందరూ భావించారు కానీ.. మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకటే ఉత్కంఠ.. కోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అంతా మంచే జరగాలని టీడీపీ కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. మరోవైపు.. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలతో కలిపి టీడీపీ బంద్ నిర్వహించింది. అయితే.. తీరా చూస్తే తీర్పు వాయిదా పడింది. ఆఖరికి ఇవాళ 4:30 గంటలకు తీర్పును వెల్లడించింది కోర్టు. సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ హైకోర్టు ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. తీర్పు తర్వాత లూథ్రా టీమ్ ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిసింది.