ఇంకెప్పుడు రోడ్లు బాగుప‌డేది:  అధికారుల‌పై కోర్టు ఆగ్ర‌హం

దేశంలో ఎక్కడ చూసినా పాడైపోయిన రోడ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక వాహనదారులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్న సంఘటనలు చవిచూడాల్సి వస్తుంది. రోడ్ల మరమ్మత్తులు గురించి ఎంతమంది అధికారులకు చెప్పిన ఉపయోగం లేకుండా పోతోంది. గుంతలమయమైన రోడ్లపై ముంబై సీనియర్ అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గమనించిన హైకోర్టు, శుక్రవారం వారిని కోర్టుకు పిలిపించింది. కోర్టుకు హాజరైన అధికారులు:  ముంబై నగరం మరియు […]

Share:

దేశంలో ఎక్కడ చూసినా పాడైపోయిన రోడ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక వాహనదారులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్న సంఘటనలు చవిచూడాల్సి వస్తుంది. రోడ్ల మరమ్మత్తులు గురించి ఎంతమంది అధికారులకు చెప్పిన ఉపయోగం లేకుండా పోతోంది. గుంతలమయమైన రోడ్లపై ముంబై సీనియర్ అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గమనించిన హైకోర్టు, శుక్రవారం వారిని కోర్టుకు పిలిపించింది.

కోర్టుకు హాజరైన అధికారులు: 

ముంబై నగరం మరియు శివారు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముంబై హైకోర్టు బుధవారం ముంబై మరియు MMR అంతటా ఉన్న మరో ఐదు మున్సిపల్ కార్పొరేషన్‌ల సివిక్ చీఫ్‌లతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. గుంతలమయమైన రహదారులపై సీనియర్‌ అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గమనించిన హైకోర్టు శుక్రవారం వారిని కోర్టుకు పిలిపించింది.

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్‌తో పాటు, ప్రధాన న్యాయమూర్తి DK ఉపాధ్యాయ మరియు జస్టిస్ ఆరిఫ్ డాక్టర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ థానే, వసాయి-విరార్ సిటీ, కళ్యాణ్-డోంబివిలి, నవీ ముంబై మరియు మీరా- మునిసిపల్ కార్పొరేషన్ల చీఫ్‌లను కూడా పిలిపించింది ముంబై హైకోర్టు. 

ఆదేశాలు పాటించని అధికారులు: 

సీనియర్ బ్యూరోక్రాట్‌లు 2018 నాటి హెచ్‌సి తీర్పులను ఎందుకు ఉల్లంఘించి ప్రవర్తించారో, ఎందుకు బాధ్యతలు వహించట్లేదని వివరించాలని హైకోర్టు అధికారులను కోరుతూ, శుక్రవారం హాజరు కావాలని కోరారు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు మరమ్మత్తులు జరగకుండా గుంతలుగా ఎందుకు ఉన్నాయో వివరించాలని కోరింది కోర్టు. దీనిలో కోర్టు అన్ని మునిసిపల్ కార్పొరేషన్‌లకు ఆదేశాలు జారీ చేసింది. MMR మరియు ఇతర అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు మరియు ఫుట్‌పాత్‌లను సరైన స్థితిలో నిర్వహించలేనందుకు బాధ్యత వహించాలని కోరింది. కోర్టు ఆదేశాలను పాటించని కమిషనర్లు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది.

వీధులు మరియు ఫుట్‌వేలను సరిగ్గా చదునుగా ఉంచడం, పోయిన రోడ్లు మరియు గుంతలు సరిగ్గా పూడ్చబడేలా చూసుకోవడం కార్పొరేషన్ల బాధ్యత అని మునుపటి తీర్పును కోర్టు బుధవారం గమనించింది. “ఏదైనా అవాంఛనీయ సంఘటన వలన ప్రాణనష్టం లేదా అవయవ నష్టం జరిగితే, సంబంధిత మునిసిపల్ కమీషనర్, మెట్రోపాలిటన్ కమిషనర్ మరియు చీఫ్ ఇంజనీర్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి” అని కోర్టు తీర్పులో ఖచ్చితంగా పేర్కొంది.

అయితే కొంతమంది బాధితులు సమర్పించిన వార్తాపత్రిక నివేదికను బెంచ్ పరిగణనలోకి తీసుకుంది, ఇది గత నెలలో రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 32 ఏళ్ల బైకర్ మరణాన్ని హైలైట్ చేసింది.  అయితే ఈ ప్రమాదం గుంతల వల్ల జరగలేదని, ఇరుకైన రోడ్డు, ట్రాఫిక్ రద్దీ కారణంగానే ప్రమాదం జరిగిందని కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ సమర్ధించుకోవడానికి ట్రై చేయడం జరిగింది.

అయితే నిజ నిజాలు బయటికి రప్పించేందుకు, ఘటనపై విచారణకు ఇద్దరు సభ్యుల కమిషన్‌ను కోర్టు నియమించింది. వార్తాపత్రికలో నివేదించినట్లుగా, మరణానికి కారణాన్ని KDMC తిరస్కరించిన దృష్ట్యా, రహదారి అధ్వాన్నంగా ఉన్న కారణంగా మరణం సంభవించిందో లేదో నిర్ధారించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. న్యాయవాదులు మాన్సీ నాయక్ మరియు రష్మీ మోర్లను నియమించింది. సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తులతో మాట్లాడి నివేదికను కోర్టుకు సమర్పించాలని న్యాయవాదులను కోరారు.