కరోనా అప్‌డేట్‌: 10,542 కొత్త కేసులు నమోదు

గత కొన్ని రోజులు నెమ్మదించిన కరోనా.. వేసవి కాలం రాగానే మళ్ళీ ఊపందుకుంది. భారతదేశంలో గడించిన  24 గంటల్లో 10,542 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా తెలిపింది.  దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య  63,562 కి పెరిగింది. ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 18 వరకు గత ఐదు రోజుల్లో వరుసగా 11,109, 7,633, 9,111, 10,093, 10,753  కేసులు నమోదయ్యాయి.  మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ బులెటిన్‌ ప్రకారం దేశ రాజధానిలో […]

Share:

గత కొన్ని రోజులు నెమ్మదించిన కరోనా.. వేసవి కాలం రాగానే మళ్ళీ ఊపందుకుంది. భారతదేశంలో గడించిన  24 గంటల్లో 10,542 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా తెలిపింది.  దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య  63,562 కి పెరిగింది. ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 18 వరకు గత ఐదు రోజుల్లో వరుసగా 11,109, 7,633, 9,111, 10,093, 10,753  కేసులు నమోదయ్యాయి. 

మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ బులెటిన్‌ ప్రకారం దేశ రాజధానిలో 1,537 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. Omicron సబ్-వేరియంట్ XBB.1.16.. కేసుల పెరుగుదలకు దారితీస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 20,25,781కి చేరుకుంది

1,537 కొత్త కేసులతో ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 20,25,781కి చేరింది. మంగళవారం ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, 5గురు చనిపోగా.. వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 26,572 కు చేరుకుంది.

కాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం బుధవారం మార్చి చివరి నుంచి ఢిల్లీలో యాక్టివ్ కోవిడ్ కేసులు 430 శాతానికి పైగా పెరిగాయి. అయితే.. మార్చి 30 నాటికి 932 కేసుల ఉన్న కేసుల సంఖ్య, ఏప్రిల్ 17న 4,976కి చేరుకుంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో యాక్టివ్ కరోనా వైరస్ కేసులు దాదాపు మూడు వారాల్లో 430 శాతానికి పైగా పెరిగాయి. ఢిల్లీలో గత 19 రోజుల్లో 13,200కి పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాబోయే రెండు వారాల్లో దేశ రాజధానిలో కరోనావైరస్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఎల్‌ఎన్‌జెపి హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ ఏప్రిల్ 13 న హెచ్చరించారు.

మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలలో మాస్క్ ధరించాలని, దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు కొమొర్బిడిటీ ఉన్నవారు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిదని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ కోవిడ్ -19 నిబంధనలు జారీ చేసింది. కాగా.. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న కరోనావైరస్ వేరియంట్స్ తేలికపాటి ఇబ్బందులు కలిగించినా..  నిబంధనలు పాటించడం మంచిదని బెంగాల్ ప్రభుత్వం కోరింది. 

అధిక పాజిటివిటీ రేటును నివేదించిన రాష్ట్రాల నుండి త్రిపురకు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుందని సీనియర్ ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. “అధిక కోవిడ్-పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల నుండి వచ్చే దేశీయ ప్రయాణీకులందరూ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు వద్ద తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి” అని అధికారి తెలిపారు.

బైడెన్ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్‌లను బీమా లేని వారికి ఉచితంగా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌కు నిధులు సమకూరుస్తున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది చివర్లో వ్యాక్సిన్‌లు వాణిజ్య మార్కెట్‌లోకి మారిన తర్వాత బీమా లేని అమెరికన్లకు ఉచిత కరోనావైరస్ వాక్సిన్లను  అందించే కొత్త ప్రోగ్రామ్‌పై బిడెన్ పరిపాలన $1 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు చేయాలని యోచిస్తోందని పరిపాలన అధికారులు మంగళవారం తెలిపారు. బీమా చేసుకొనలేని వారి కోసం మాత్రమే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం 30 మిలియన్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుంది. కాగా.. ఫార్మసీ ఏజెన్సీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి కావాల్సిన  పరిపాలనా ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అటు ఇన్సూరెన్స్ లేని వారికి ఎటువంటి ఖర్చు లేకుండా వాక్సిన్లను అందిస్తామని ఫైజర్ మరియు మోడర్నా ప్రతిజ్ఞ చేశాయి.